Udaipur Murder Case: 'ఉదయ్‌పుర్' హంతకులను వెంటాడి పట్టుకున్న పోలీసులు- వీడియో చూశారా?
Udaipur Murder Case: ఉదయ్‌పుర్ టైలర్‌ను హత్య చేసిన హంతకులను పోలీసులు పట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.
Udaipur Murder Case: రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో టైలల్ కన్హయ్య లాల్‌ను హత్య చేసిన దుండగులను పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. కన్హయ్య హత్య అనంతరం బైక్‌పై నగరం నుంచి పారిపోతున్న గౌస్ మహ్మద్, రియాజ్ అక్తరీని ఉదయ్‌పుర్ శివారులోని హైవేపై పోలీసులు అడ్డుకున్నారు.
ఇలా పట్టుకున్నారు
राजस्थान पुलिस ने उदयपुर हत्याकांड के दोनों हत्यारों को पकड़ लिया हैं ।
— Nitin Agarwal (@nitinagarwalINC) June 28, 2022
राजस्थान पुलिस ने मौक़े पर ही खातिरदारी की है। अभी और भी ख़ातिरदारी होनी है।
यह कांग्रेस शासित राजस्थान हैं यहाँ असामाजिक तत्व बिल्कुल भी बर्दाश्त नहीं किये जायेगे।#Udaipur pic.twitter.com/kBflQ0qzdB
రహదారిపై బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు ఇద్దరు హంతకులను చుట్టుముట్టి వారిని నిరాయుధులను చేశారు. ఆపై అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలో స్టేషన్‌కు తరలించి అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నితిన్ అగర్వాల్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఇదీ జరిగింది
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ టైలర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. రాజస్థాన్ ఉదయ్‌పుర్ మాల్దాస్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.
ఉగ్ర సంస్థ ఐసిస్ ముష్కరులను తలపించేలా టైలర్ గొంతు కోసి క్రూరంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. భాజపా సస్పెండ్ చేసిన నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామని హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలానే చేస్తామని హెచ్చరించారు.
వెంటనే అరెస్ట్
ఈ దారుణానికి తెగబడిన నిందితులను రియాజ్ అక్తర్, గౌస్ మొహమ్మద్‌గా పోలీసులు గుర్తించారు. రియాజ్.. టైలర్ గొంతు కోయగా, గౌస్ దీనిని అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు.
మరోవైపు సీఎం అశోక్ గహ్లోత్ సహా పోలీస్ శాఖ నిందితుల వీడియోలను వైరల్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుక సహకరించాలని కోరారు.
Also Read: Intelligence Alert: ఆ 2 రాష్ట్రాలకు భారీగా బలగాలు- అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా హెచ్చరిక
Also Read: Viral Video: ఏం దూకినవ్, హార్ట్ బీట్ పెంచేసినవ్ లే- 70 ఏళ్ల బామ్మ జంప్!