Viral Video: ఏం దూకినవ్, హార్ట్ బీట్ పెంచేసినవ్ లే- 70 ఏళ్ల బామ్మ జంప్!
Viral Video: ఓ 70 ఏళ్ల బామ్మ గంగా నదిలో చేసిన ఓ ఫీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Viral Video: ఓ ఎత్తయిన బ్రిడ్జి మీద నుంచి పారే నదిలో ఎప్పుడైనా దూకారా? ఆ.. ఏముంది ఎప్పుడో చిన్నప్పడు పిల్ల కాలువలో ఇలానే దూకి స్నానాలు చేశామంటరా? చిన్నప్పుడు అయితే ఓకే, మరి 70 ఏళ్లు వచ్చాకా అలా ఎవరైనా చేస్తే ఏమంటారు? ఏమంటాం చూసి అవాక్కవుతాం. అవును తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
अम्मा की छलांग .. 😳😳
— Ashok Basoya (@ashokbasoya) June 28, 2022
हरकी पैड़ी के पुल से गंगा नदी में छलांग लगाने वाली बुजुर्ग महिला बुजर्ग महिला पुल से गंगा में छलांग लगाकर आराम से तैरकर किनारे जाती हुई विडियो में दिख रही है। बुजुर्ग महिला की उम्र 70 साल के करीब की बताई जा रही है। 😳😳#haridwar pic.twitter.com/IY9bDp7DAb
అలా దూకేసింది!
హరిద్వార్‌లోని హర్ కీ పురిలో ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి ఓ 70 ఏళ్ల వృద్ధురాలు గంగా నదిలోకి దూకింది. ఆమె డుప్కీ కొట్టడం అక్కడున్న వారిని అవాక్కయ్యేలా చేసింది.
బ్రిడ్జ్ మీద నుంచి దూకడమే కాకుండా తనదైన స్టయిల్లో పవిత్ర స్నానం చేసి అక్కడున్నవారు స్టన్ అయ్యేలా చేసింది. ఆ బామ్మ గంగలోకి దూకుతున్న సమయంలో అక్కడున్నవాళ్ల ఆమెకు చీర్స్ చెప్పారు. ఆ తర్వాత ఈజీగా ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
బామ్మ జంప్..
"హర్ కీ పైడీ వంతెన పై నుంచి ఓ వృద్ధురాలు గంగా నదిలో దూకింది. అనంతరం చాలా తేలికగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. ఆమెకు 70 ఏళ్లు అని అంతా చెబుతున్నారు." అని కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. షేర్ చేసిన నిమిషాల్లోనే ఈ వీడియోను కొన్ని వేల మంది చూశారు. చాలా మంది షేర్ చేశారు.
Also Read: Udaipur Murder Case: ఉదయ్‌పుర్ హత్య కేసు నిందితులకు పాక్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు