News
News
X

Udaipur Murder Case: ఉదయ్‌పుర్ హత్య కేసు నిందితులకు పాక్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు

Udaipur Murder Case: ఉదయ్‌పుర్‌ హత్య కేసు నిందితులకు పాక్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు తేలింది.

FOLLOW US: 

Udaipur Murder Case: రాజస్థాన్ ఉదయ్‌పుర్ హత్య కేసులో నిందితులకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు తెలిసింది. టైలర్‌ తల నరికి చంపిన కేసులో ఇద్దరు నిందితులకూ పాక్ ఉగ్ర సంస్థతో సంబంధాలున్నట్లు అధికారులు తెలిపారు.

దావత్-ఎ-ఇస్లామీతో లింక్

టైలర్ కన్హయ్య లాల్‌ను హత్య చేసిన హంతకులను గౌస్ మహ్మద్, రియాజ్ అహ్మద్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ ఖంజీపీర్‌లోని ఓ వెల్డింగ్‌ షాపులో పనిచేస్తున్నారు. భిల్వారాకు చెందిన రియాజ్ ఖాన్జీపీర్ ఉదయపుర్‌లో అద్దెకు ఉండగా, గౌస్ రాజస్మాండ్‌లోని భీమా ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. వారి మూలాల ప్రకారం నిందితులు ఇద్దరికీ పాకిస్థాన్‌లోని ఒక ముస్లిం ఛాందసవాద సంస్థ దావత్-ఎ-ఇస్లామీతో సంబంధాలున్నాయి.

ఇదీ జరిగింది

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ టైలర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. రాజస్థాన్ ఉదయ్‌పుర్‌ మాల్దాస్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.

ఉగ్ర సంస్థ ఐసిస్ ముష్కరులను తలపించేలా టైలర్ గొంతు కోసి క్రూరంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.  భాజపా సస్పెండ్‌ చేసిన నుపుర్‌ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామని హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలానే చేస్తామని హెచ్చరించారు.

వెంటనే అరెస్ట్

ఈ దారుణానికి తెగబడిన నిందితులను రియాజ్‌ అక్తర్‌, గౌస్‌ మొహమ్మద్‌గా పోలీసులు గుర్తించారు. రియాజ్‌.. టైలర్ గొంతు కోయగా, గౌస్‌ దీనిని అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు.

మరోవైపు సీఎం అశోక్‌ గహ్లోత్ సహా పోలీస్‌ శాఖ నిందితుల వీడియోలను వైరల్‌ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుక సహకరించాలని కోరారు.

Also Read: Udaipur Murder Case: ఉదయ్‌పుర్ హత్యతో ఉలిక్కిపడిన దేశం- రంగంలోకి NIA, నెల రోజులు 144 సెక్షన్!

Also Read: Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- 30 మంది మృతి

Published at : 29 Jun 2022 02:15 PM (IST) Tags: Udaipur killing beheaded Hindu man Pak extremist organization Udaipur Murder Case

సంబంధిత కథనాలు

Railway New Coaches : భారతీయ రైల్వేకు కొత్త బోగీలు, సౌకర్యాలతో పాటు స్పీడ్ పెరిగిందోచ్!

Railway New Coaches : భారతీయ రైల్వేకు కొత్త బోగీలు, సౌకర్యాలతో పాటు స్పీడ్ పెరిగిందోచ్!

Raigad Suspicious Boat: సముద్రంలో కొట్టుకొచ్చిన AK-47ల పడవ- హోంశాఖ హై అలర్ట్‌!

Raigad Suspicious Boat: సముద్రంలో కొట్టుకొచ్చిన AK-47ల పడవ- హోంశాఖ హై అలర్ట్‌!

Prashant Kishor:ఫెవికాల్‌తో సీఎం కుర్చీకి అతుక్కుపోయారు, బిహార్ సీఎం నితీశ్‌పై పీకే విమర్శలు

Prashant Kishor:ఫెవికాల్‌తో సీఎం కుర్చీకి అతుక్కుపోయారు, బిహార్ సీఎం నితీశ్‌పై పీకే విమర్శలు

Jammu Kashmir Elections: స్థానికేతరులూ ఓటు వేయొచ్చు, కొత్తగా 25 లక్షల మందికి అవకాశం - కశ్మీర్ ఈసీ

Jammu Kashmir Elections: స్థానికేతరులూ ఓటు వేయొచ్చు, కొత్తగా 25 లక్షల మందికి అవకాశం - కశ్మీర్ ఈసీ

YouTube Channels Blocked: ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేంద్రం వేటు, అసత్య ప్రచారాలు చేసినందుకే

YouTube Channels Blocked: ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేంద్రం వేటు, అసత్య ప్రచారాలు చేసినందుకే

టాప్ స్టోరీస్

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు