(Source: ECI/ABP News/ABP Majha)
UK PM Election: బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న రిషి
UK PM Election: ఇంగ్లాండ్ ప్రధానమంత్రి రేసులో రిషి సునక్ జైత్రయాత్ర కొనసాగుతోంది
UK PM Election: బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ దూసుకుపోతున్నారు. బ్రిటన్ కొత్త ప్రధాని కోసం కన్జర్వేటివ్ పార్టీ నిర్వహించిన ఎన్నికల్లో రిషి జైత్రయాత్ర కొనసాగించారు.
మొదటి రెండు దశల్లో విజయం సాధించిన రిషి మూడో రౌండ్‌లోనూ సత్తా చాటారు. మొత్తం 115 ఓట్లతో తన ప్రత్యర్థుల కన్నా ముందు వరుసలో నిలిచారు. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని రేసులో నలుగురు అభ్యర్థులు పోటీలో మిగిలారు. ఈ దశలో బ్రిటన్ ప్రధాని పదవి కోసం మంగళవారం నాలుగో రౌండ్ ఓటింగ్ జరగనుంది.
రిషి సునక్
రిషి సునక్ బ్రిటన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతుల నిర్వర్తించారు. మనందరికీ సుపరిచితులైన ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి రిషి స్వయానా అల్లుడు. నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని సునక్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునక్ ఉన్నారు.
కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా రిషి సునక్.. తీసుకున్న చర్యలకు మంచి పేరు వచ్చింది. ఆయన నిర్ణయాల వల్లే బ్రిటన్ ఆర్థికంగా కోలుకోగలిగిందని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఎన్నో సార్లు చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం 10 బిలియన్ పౌండ్ల విలువైన భారీ ప్యాకేజీని ప్రకటించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.
తొలి వ్యక్తి
తదుపరి బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి కనుక ప్రధాని అయితే ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కుతారు. 42 ఏళ్ల రిషి సునక్‌ను ప్రధాని బోరిస్ జాన్స్ ఫిబ్రవరి 2020లో ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్‌గా నియమించారు.
ఫలితంగా తొలిసారి పూర్తిస్థాయి కేబినెట్ హోదా పొందారు. కరోనా సమయంలో డౌనింగ్ స్ట్రీట్‌లోని జరిగిన ప్రధాని బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నందుకు గాను జరిమానాను కూడా ఎదుర్కొన్నారు. రిషి సునక్ తాతలు పంజాబ్ నుంచి వచ్చారు.
Also Read: NEET 2022 Dress Code: లోదుస్తులు తీస్తేనే పరీక్ష రాయడానికి అనుమతి- కేరళలో దారుణం!
Also Read: Haryana DSP Killed: మైనింగ్ మాఫియా దారుణం- DSPని లారీతో ఢీకొట్టి హత్య!