By: ABP Desam | Updated at : 28 Apr 2022 04:56 PM (IST)
Edited By: Murali Krishna
పార్లమెంటులో ఇవేం పనులురా సామీ! మహిళా ఎంపీ పక్కనుండగానే!
UK minister: చట్టసభల పరువు తీశాడు ఓ ఎంపీ. దేశ ప్రజల భవిష్యత్తును నిర్మించాల్సిన పార్లమెంటులో బూతు బొమ్మలు చూశాడు. అది కూడా పక్కన ఓ మహిళా ఎంపీ ఉండగానే. బ్రిటన్ పార్లమెంటులో జరిగిందీ ఘటన.
ఓ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ పార్లమెంటు లోపల తన ఫోన్‌లో పోర్న్ ఫిల్మ్ చూస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీనిపై అక్కడే ఉన్న మహిళా ఎంపీ నిరసన వ్యక్తం చేశారు.
కొత్తేం కాదు
యూకే పార్లమెంట్‌లో ఓ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ఫోన్‌లో పోర్న్ ఫిల్మ్ చూస్తున్నారని ఓ మహిళా ఎంపీ నిరసన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వార్త పత్రికల నివేదిక ప్రకారం, సంఘటన తర్వాత మహిళా ఎంపీ ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పలువురు ఎంపీలు కూడా స్పందించారు.
కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఓ మహిళా మంత్రితో పాటు ఇతర మహిళా ఎంపీలు ఈ విషయంపై కన్జర్వేటివ్ చీఫ్ విప్ క్రిస్ హీటన్-హారిస్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఇలాంటి పనులు చేసిన ఎంపీలు ఎవరనేది మాత్రం బయటకు కాలేదు. అయితే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు ఇంతకు ముందు కూడా ఇలాంటి పని చేశారని, అప్పుడు ఎవరూ అంతగా పట్టించుకోలేదని వార్తలు వస్తున్నాయి.
కఠిన చర్యలు
ఈ ఘటనపై కన్జర్వేటివ్ విప్స్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. చీఫ్ విప్ క్రిస్ హీటన్ హారిస్ ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇటువంటి ప్రవర్తనను సహించబోమని పేర్కొంది. అదే సమయంలో కేసు నివేదిక రాగానే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. సదరు సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇతర సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే నిరసన చేపడతామని వెల్లడించారు. చట్టాలు చేయాల్సిన సభలో ఇలాంటి పనులు చేయడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Viral News: బాల్కనీలో బట్టలు ఆరేశారా? వెంటనే తీసేయండి, లేకపోతే రూ. 20 వేలు ఫైన్!
Also Read: Elon Musk About Coca-Cola: మస్క్ నుంచి మరో సంచలన ప్రకటన- ఆ కంపెనీ కొనేస్తారట!
Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!
Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ
China Plane Crash: ఎంత పనిచేశారు పైలట్లు! 132 మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు!
Cannes Film Festival: మరో చాప్లిన్ రావాలి, పుతిన్‌ను ప్రపంచం ప్రశ్నించాలి: కేన్స్ చలన చిత్రోత్సవంలో జెలెన్స్కీ
Covid 19 in North Korea: ఉత్తర కొరియాను ఊపేస్తోన్న కరోనా వైరస్- మిలటరీని రంగంలోకి దింపిన కిమ్
Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?
YSRCP Politics : సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !
Gyanvapi Mosque Survey Report: జ్ఞానవాపి మసీదులో ఆలయ అవశేషాల గుర్తింపు- వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేకులు!
RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!