Karachi Police Head Quarter Attack: పాకిస్థాన్ లోని కరాచీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ పై దాడి -నలుగురు మృతి 19మందికి గాయాలు
కరాచీలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన ముగ్గురు ఉగ్రవాదులను మూడున్నర గంటల పాటు శ్రమించి భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
పాకిస్థాన్ కరాచీలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు మృతి చెందగా, నలుగురుగాయపడినట్లు సమాచారం. ఈ సంఖ్య కూడా పెరగవచ్చు. రాత్రి 19.10 గంటల సమయంలో పోలీసులు, భద్రతా బలగాలు పోలీసు హెడ్ క్వార్టర్స్ ను తమ ఆధీనంలోకి తీసుకొని ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపారు.
కరాచీ పోలీస్ ఆఫీస్ (కేపీఓ) భవనాన్ని ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైనట్టు సింధ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ముర్తజా వహాబ్ రాత్రి 10:42 గంటలకు ట్విటర్‌లో పేర్కొన్నారు. పాకిస్థాన్ సైనికులు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. జియో న్యూస్ తో విడివిడిగా మాట్లాడిన ఆయన భవనానికి భద్రత కల్పించామని పునరుద్ఘాటించారు.
ఉగ్రవాదులు టయోటా కరోలా కారులో వచ్చారు.
ఈ ఆపరేషన్ కు నేతృత్వం వహించిన సీనియర్ అధికారుల్లో ఒకరైన డీఐజీ ఈస్ట్ ముకద్దాస్ హైదర్ పాక్ మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం ముగ్గురు దుండగులు టయోటా కరోలా కారులో కేపీఓకు వచ్చారని తెలిపారు. దుండగుల్లో ఒకరు భవనం నాలుగో అంతస్తులో తనను తాను కాల్చుకోగా, మరో ఇద్దరు ఉగ్రవాదులను పైకప్పుపై సైనిక బలగాాలు కాల్చి చంపాయి' అని కరాచీ పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. అల్లా దయతో కేపీవో, పరిసర ప్రాంతాలు ఉగ్రవాదుల నుంచి పూర్తిగా విముక్తి అయిందని పేర్కొన్నారు.
పలు చోట్ల కాల్పులు జరిగినట్లు సమాచారం
శుక్రవారం రాత్రి 7:15 గంటల సమయంలో కరాచీ ప్రధాన రహదారి షరియా ఫైజల్‌తో పాటు ఫైజల్ బేస్ సహా పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన పలు వ్యూహాత్మక స్థావరాలపై కాల్పులు జరిపినట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. అదనపు పోలీసు బృందాలను, రేంజర్లను సంఘటనా స్థలానికి పిలిపించారు. అయితే రాత్రి 7.10 గంటల సమయంలో తొలి దాడి జరిగింది. ఉగ్రవాదులు పోలీసు హెడ్ క్వార్టర్స్ లోకి ప్రవేశించిన సమయంలో పోలీసులు లోపల లేరని చెబుతున్నారు.
ఉగ్రవాదులు పూర్తి సన్నద్ధతతో వచ్చారు.
రేంజర్స్, క్విక్ రెస్పాన్స్ ఫోర్స్ (క్యూఆర్ఎఫ్)తో పాటు నగరం నలుమూలల నుంచి పోలీసు బలగాలను సంఘటనా స్థలానికి పిలిపించినట్లు సౌత్జోన్ డీఐజీ ఇర్ఫాన్ బలోచ్ తెలిపారు. దుండగులు హ్యాండ్ గ్రెనేడ్లు కూడా విసిరారు. దాడి చేసినవారు ఫుల్ ప్రిపేర్డ్‌గా వచ్చి సైనిక బలగాలతో పోరాడారు.
జేపీఎంసీలో నలుగురు మృతి
జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్ (జేపీఎంసీ)కు తీసుకువచ్చిన నలుగురు మరణించారని, 19 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని సింధ్ ఆరోగ్య శాఖ ప్రతినిధి మెహర్ ఖుర్షీద్ తెలిపారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు, ఒక రేంజర్ అధికారి, ఒక పౌరుడు ఉన్నారని సింధ్ ప్రభుత్వ ప్రతినిధి ముర్తజా వహాబ్ తెలిపారు.