News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Taiwanese Shipping Firms: ఉద్యోగులకు షిప్పింగ్ కంపెనీల బంపర్ ఆఫర్లు, మందగమనంలో ఉన్నా మస్తు బోనస్‌లు

Taiwanese Shipping Firms: గ్లోబల్ కార్గోలో మందగమనం ఉన్నా.. తైవానీస్ షిప్పింగ్ కంపెనీలు ఉద్యోగులకు భారీ బోనస్‌లు ఇస్తున్నాయి.

FOLLOW US: 
Share:

Taiwanese Shipping Firms: కంపెనీ ఆదాయం పెరిగినప్పుడో, పండుగల సమయాల్లోనూ, సంవత్సరానికొకసారో, యజమాని పుట్టిన రోజుల వేళ కంపెనీలు బోనస్ లు ఇస్తుంటాయి. మా.. అంటే జీతంలో 10 లేదా 25 శాతం, లేదంటే.. ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వడం తెలిసిందే. ఇంకొన్ని కంపెనీలు రివార్డ్స్, ఇతర కానుకలు అందిస్తుంటాయి. నష్టాల సమయంలో బోనస్‌ల ఊసెత్తవు కంపెనీలు. కరోనా సమయంలో, ప్రస్తుతం ఆర్థిక మందగమనం వేళ ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా పెంచడం లేదు చాలా సంస్థలు. కానీ తైవాసీస్ కంపెనీలు మాత్రం ఉద్యోగులకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. గ్లోబల్ కార్గోలో తీవ్ర మందగమనం ఉన్నప్పటికీ తైవానీస్ షిప్పింగ్ కంపెనీలు బోనస్‌లు ప్రకటిస్తున్నాయి. ఒక నెల, రెండు నెలలు కాదు ఓ షిప్పింగ్ కంపెనీ తమ ఉద్యోగులకు ఏకంగా 30 నెలల జీతాన్ని బోనస్‌గా అందిస్తోంది. 

30 నెలల జీతం బోనస్‌గా ఇస్తున్న యాంగ్ మింగ్ 

యాంగ్ మింగ్ మెరైన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ సంస్థ తమ ఉద్యోగులకు 30 నెలల జీతాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం NT$2.3 బిలియన్(US$75 మిలియన్) బోనస్ ఇవ్వడానికి షేర్‌ హోల్డర్లు ఆమోదించారని, తదుపరి పే డేలో ఈ బోనస్ ను అందించనున్నట్లు ఎకనామిక్ డైలీ న్యూస్ నివేదిక పేర్కొంది. ఈ సంవత్సరం ప్రారంభంలో బోనస్‌గా ఇచ్చిన 12 నెలల జీతానికి ఇది అదనమని స్పష్టం చేసింది.

లాభంలో 1 శాతం ఉద్యోగులకు ఇవ్వాలని కంపెనీ రూల్

గత సంవత్సరంలో పొందిన లాభాల్లో ఒక శాతం ఉద్యోగులకు పరిహారంగా ఇవ్వాలన్నది కంపెనీ నియమమని యాంగ్ మింగ్ బ్లూమ్‌బెర్గ్‌కి పంపిన ఇమెయిల్‌లో పేర్కొంది. అలాగే ఏ ఉద్యోగికి ఎంత ఇవ్వాలన్నది పూర్తిగా కంపెనీ ఇష్టమని స్పష్టం చేసింది. 

ఎవర్‌గ్రీన్ కంపెనీ NT$1.9 బిలియన్ల బోనస్

షేర్‌హోల్డర్ లు బోనస్‌ను ఆమోదించిన తర్వాత ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్బొరేషన్ తన 3,100 మంది కార్మికులకు మరో NT$1.9 బిలియన్లను ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇది దాదాపు 12 నెలల జీతానికి సమానం. 

జనవరిలో 50 నెలల జీతాన్ని బోనస్‌గా ఇచ్చిన ఎవర్‌గ్రీన్

తైపీకి చెందిన ఎవర్‌గ్రీన్ షిప్పింగ్ కంపెనీ, సంవత్సరాంతపు బోనస్‌గా 50 నెలల జీతాన్ని ఈ ఏడాది జనవరిలో ఇచ్చింది. ఉద్యోగి హోదా, పనితీరు ఆధారంగా ఈ బోనస్‌ మొత్తం మారుతుంది. తైవాన్ ఆధారిత ఒప్పందాలు ఉన్న సిబ్బందికి మాత్రమే ఈ బోనస్‌లు ఇచ్చింది ఎవర్‌గ్రీన్‌. గత రెండు సంవత్సరాలుగా షిప్పింగ్‌ బిజినెస్‌ ఊహించని స్థాయిలో పెరిగింది. ఫలితంగా, ఈ రెండు సంవత్సరాల్లో ఎవర్‌గ్రీన్‌ మెరైన్ కార్పొరేషన్ కూడా భారీ స్థాయిలో వ్యాపారం చేసింది, లాభాలను ఆర్జించింది. 2022లో దీని ఆదాయం 20.7 బిలియన్ల డాలర్లకు పెరగనుందని అంచనా. 2020తో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. అయితే, విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఎవర్‌గ్రీన్ నికర ఆదాయం ఈ ఏడాది 94 శాతం తగ్గి NT$18.6 బిలియన్‌లకు చేరుకుంటుంది. యాంగ్ మింగ్ లాభం 99 శాతం క్షీణించి NT$2.2 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా.

సూయజ్‌ కాల్వలో చిక్కుకున్న నౌక

ఈ ఎవర్‌గ్రీన్‌ మెరైన్ కార్పొరేషన్‌ మనకు దాదాపు రెండేళ్ల క్రితమే తెలుసు. 2021 ప్రారంభంలో, ఈ కంపెనీ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో, ఈ కంపెనీకి చెందిన ఒక ఓడ సూయజ్ కాల్వలో అడ్డంగా నిలిచిపోయింది. దాని వల్ల సూయస్‌ కాల్వలో రోజుల తరబడి రాకపోకలు ఆగిపోయాయి. ఫలితంగా,నౌకా వాణిజ్య సంస్థలకు కోటానుకోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ నౌకను తిరిగి కదిలించేసరికి సదరు కంపెనీకి, సూయజ్‌ కాల్వ నిర్వహణ సంస్థలకు తల ప్రాణం తోకకు చేరింది. నౌక వల్ల వాటిల్లిన వాణిజ్యం నష్టానికి పరిహారం కోరుతూ, ఈ ఎవర్‌గ్రీన్‌ మెరైన్ కార్పొరేషన్‌ మీద కోర్టులో కేసులు కూడా నడిచాయి.

Published at : 03 Jun 2023 05:35 PM (IST) Tags: Taiwanese Shipping Firms Mid-Year Huge Bonuses Despite Slump Evergreen

ఇవి కూడా చూడండి

India Vs Canada: ఇండియా కెనడా గొడవపడితే లక్షల కోట్లు ఆవిరే! మాటల యుద్ధం ముదిరితే ఇక అంతే

India Vs Canada: ఇండియా కెనడా గొడవపడితే లక్షల కోట్లు ఆవిరే! మాటల యుద్ధం ముదిరితే ఇక అంతే

ఖలిస్థాన్ వివాదం భారత్‌ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?

ఖలిస్థాన్ వివాదం భారత్‌ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?

Indian Medical Graduates: భారతీయ వైద్య విద్యార్థులు ఇక విదేశాల్లోనూ ప్రాక్టీస్‌ చెయ్యొచ్చు

Indian Medical Graduates: భారతీయ వైద్య విద్యార్థులు ఇక విదేశాల్లోనూ ప్రాక్టీస్‌ చెయ్యొచ్చు

వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్

వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్

ఖలిస్థాన్‌ అల్లర్లతో NIA అప్రమత్తం, దాడులు చేసిన వాళ్లపై స్పెషల్ ఫోకస్ - మోస్ట్ వాంటెడ్‌ లిస్ట్ విడుదల

ఖలిస్థాన్‌ అల్లర్లతో  NIA అప్రమత్తం, దాడులు చేసిన వాళ్లపై స్పెషల్ ఫోకస్ - మోస్ట్ వాంటెడ్‌ లిస్ట్ విడుదల

టాప్ స్టోరీస్

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?