అన్వేషించండి

TG Outer Ring Rail Project: తెలంగాణలో గేమ్ ఛేంజర్‌గా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు- 392 కి.మీ, 26 స్టేషన్లతో ఎలైన్‌మెంట్ ఖరారు

Hyderabad News | రీజనల్ రింగ్ రోడ్డుకు మణిహారంగా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రాబోతోంది. 8 జిల్లాల పరిధిలో మొత్తం 392 కిలోమీటర్ల దూరం 26 కొత్త స్టేషన్లు రానున్నాయి.

Outer Ring Rail Project Latest News | హైదరాబాద్: దేశంలోనే తొలి ఔటర్ రింగ్ రైలు (Outer Ring Rail) ప్రాజెక్టు అలైన్‌మెంట్ ఖరారైంది. మొత్తం 392 కిలోమీటర్ల పొడవుతో ఈ రైలు మార్గం రానుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 26 కొత్త స్టేషనులు ఏర్పాటు కానున్నాయి. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు 12 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. తెలంగాణలోని 8 జిల్లాలు, 14 మండలాలను కలుపుతూ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు చేయాలని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) నిర్ణయించింది. వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో పరిధిలో ఈ ప్రాజెక్టు వస్తుంది. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు సంబంధిత అగ్ర ప్రాజెక్టు నివేదిక (Outer Ring Rail DPR) రైల్వే బోర్డు కు దక్షిణ మధ్య రైల్వే పంపించాలని భావిస్తోంది.

మూడో ప్రతిపాదనకు అంగీకారం..

గతంలో రైల్వే శాఖ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది సర్వేకు ఆమోదం తెలిపినప్పుడు మొత్తం దూరం 508 కిలోమీటర్లు. అయితే దక్షిణ మధ్య రైల్వే అధికారులు 508.45 కిలోమీటర్ల, 511.51 కిలోమీటర్లు, 392.02 కిలోమీటర్లుగా మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి రెండు ప్రతిపాదనలు రీజినల్ రింగ్ రోడ్డుకు దూరంగా ఉంటాయని, మూడో ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. సారీ సూచనతో దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేసి అలైన్మెంట్ ఖరారు చేసింది. రెండేళ్ల కిందటితో పోలిస్తే 120 కిలోమీటర్ల దూరం తగ్గినా అభివృద్ధికి అధిక అవకాశం ఉన్న ప్రాంతంలో ఔటర్ రింగు రైలు ప్రాజెక్టు రాబోతుంది.

6 చోట్ల రైల్‌ ఓవర్‌ రైల్‌ వంతెనలు
ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టులో ఆరు చోట్ల ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’(ఆర్వోఆర్‌) వంతెనలు వస్తాయి. కొత్త లైన్‌ను చాలా ఎత్తుగా ఫ్లైఓవర్‌లో నిర్మిస్తారు. మాసాయిపేట, గుళ్లగూడ, బూర్గుల, వలిగొండ, వంగపల్లి, గజ్వేల్‌ లను ROR ప్రాంతాలుగా ప్రతిపాదించారు. హైదరాబాద్‌ చుట్టూ 361 కి.మీ. మేర రీజనల్ రింగ్ రోడ్ వస్తుండగా, దానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉండేలా ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్ట్ ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. ఆర్ఆర్ఆర్‌కు ఒకట్రెండు చోట్ల పది కిలోమీటర్ల దూరం ఉండనుంది.

రైల్వే లైన్                          ఏ స్టేషన్ల మధ్యలో ఆర్వోఆర్ 
సికింద్రాబాద్-కాజీపేట  -   వంగపల్లి- ఆలేరు
సికింద్రాబాద్-వాడి        -   గుళ్లగూడ- చిట్టిగడ్డ
సికింద్రాబాద్-డోన్         -   బూర్గుల- బాలానగర్
సికింద్రాబాద్-ముర్ఖడ్     -   మాసాయిపేట- శ్రీనివాసనగర్
సికింద్రాబాద్-గుంటూరు  -   వలిగొండ- రామన్నపేట
సికింద్రాబాద్-కొత్తపల్లి   -  గజ్వేల్- కొడకండ్ల


ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఎన్నో లాభాలు
ఓవైపు రీజనల్ రింగ్ రోడ్డుతో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు సరిహద్దు జిల్లాల్లో అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అలాంటిది ఆర్ఆర్ఆర్ ను కవర్ చేసేలా వస్తున్న ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఆ ప్రాజెక్టుతో రోడ్డు, రైలు మార్గంతో కనెక్టివిటీ పెరిగి రవాణా ఆధారిత అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. రింగ్‌ రైలు ప్రాజెక్టుతో కొత్త రైల్వే రైల్వేస్టేషన్ల నుంచి హైదరాబాద్ కు బస్సులు, మెట్రో రైలు సేవలతో మల్టీమోడల్‌ కనెక్టివిటీ వస్తుంది. ఈ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అందుబాటులోకి వస్తే ప్రైవేట్ వాహనాలకు బదులు దీన్ని ఎంచుకుంటారు. దాంతో కాలుష్యం సైతం తగ్గుతుందని భావిస్తున్నారు. కనెక్టివిటీ లేని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రైలు పరుగులు, కొత్త రైల్వే స్టేషన్లతో ఆ ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
Embed widget