అన్వేషించండి

ఏపీ వ్యవసాయంలో సరికొత్త శకం!ఈ ఖరీఫ్‌ నుంచే 'డిజిటల్ వ్యవసాయం' అరచేతిలోనే రైతన్న భవిష్యత్తు... 

ఖరీఫ్ 2025 నుంచి ఏపీలో వ్యవసాయ కార్యకలాపాలు పూర్తిగా డిజిటల్‌గా మారనున్నాయి. ఈ విప్లవాత్మక మార్పునకు ఏపీఏఐఎంఎస్ 2.0' (APAIMS 2.0) అనే శక్తివంతమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్ నాంది పలుకుతోంది.

Amaravati: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం దేశంలోనే ఒక చరిత్రాత్మక అడుగు ముందుకు వేస్తోంది. విత్తనాలు, ఎరువుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలకు.. పంట అమ్ముకోవడానికి పడే తిప్పలకు స్వస్తి పలికేలా ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తోంది. విత్తనం నాటిన దగ్గర నుంచి.. పంట అమ్మే వరకూ ప్రతి సేవ ఇకపై రైతన్న సెల్‌ఫోన్‌లోనే అందుబాటులోకి రానుంది.APAIMS 2.0 (Andhra Pradesh Agriculture Information Management System) తో వ్యవసాయ సేవలన్నీ డిజిటలైజ్ అవ్వనున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఉపగ్రహ చిత్రాలు వంటి అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే ఈ వ్యవస్థ, వ్యవసాయాన్ని సులభతరం చేయడమే కాకుండా, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడనుంది.

60లక్షల మంది రైతులకు ప్రయోజనం

అమెరికాకు చెందిన వాసర్ ల్యాబ్ Vassar Lab ఈ సాంకేతికతను రూపొందించింది. MIT ఇందుకు తోడ్పాటునిస్తోంది.రాష్ట్రంలో 60,02,607 మంది రైతుల్లో 37,65,463 మంది రైతుల గుర్తింపు కార్డులు ఇప్పటికే తయారయ్యాయి. 80లక్షల హెక్టార్ల పంట సాగు దీని పరిధిలోకి రానుంది. 18వేల గ్రామాల్లో ఈసేవలు అందుబాటులోకి వస్తాయి. 

రైతుకు అందే ప్రయోజనాలివే!

ఇంతకీ ఈ కొత్త విధానం వల్ల రైతుకు ఏం లాభం? వ్యవసాయ శాఖ చెబుతున్న దాని ప్రకారం ప్రయోజనాలు ఇలా ఉన్నాయి:

వ్యక్తిగత సలహాలు: ఇకపై రైతు తన పొలానికి ఏ పురుగు ఆశించనుంది, ఏ ఎరువు ఎప్పుడు వేయాలి, నీరు ఎప్పుడు పెట్టాలి వంటి కీలక సమాచారాన్ని తన సెల్‌ఫోన్‌లోనే తెలుసుకోవచ్చు. ప్రతి రైతు పొలానికి ప్రత్యేకంగా సలహాలు అందుతాయి.
అన్నీ ఒక్కచోటే: విత్తనాల బుకింగ్, ఎరువుల సబ్సిడీ, పంటల బీమా, ఈ-క్రాప్ బుకింగ్, మార్కెట్‌లో పంట అమ్ముకోవడం వరకు అన్ని సేవలు ఈ యాప్ ద్వారానే జరుగుతాయి. దీనివల్ల సమయం, శ్రమ ఆదా అవుతాయి.
పారదర్శకత: సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల అవినీతికి, జాప్యానికి ఆస్కారం ఉండదు. రైతులకు అందాల్సిన ప్రయోజనాలు నేరుగా, వేగంగా అందుతాయి.
నష్ట నివారణ: తుపానులు, తెగుళ్ల వంటి వాటి గురించి ముందుగానే హెచ్చరికలు అందడం వల్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

ఈ మార్పుపై వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లి రావు మాట్లాడుతూ, "ఖరీఫ్ 2025 నుంచి ఆఫ్‌లైన్ సేవలు అనేవే ఉండవు. ప్రతిదీ APAIMS 2.0 వేదిక ద్వారానే జరుగుతుంది. ఇది పారదర్శకతను పెంచి, రైతులకు వేగంగా సేవలు అందిస్తుంది," అని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా ఇప్పటికే ఫలితాలు వస్తున్నాయి. Vassar  ల్యాబ్ సూచనలు పాటించడం వల్ల ఎరువుల వినియోగం 7.5శాతం తగ్గింది. అంతే కాదు..వేరు శనగ పంట కాలాన్ని జూన్ నుంచి జూలై 15కు మార్చడం వల్ల చీడపీడల సమస్య తగ్గి దిగుబడి పెరుగుతోంది. 

ఏపీ మోడల్‌కు అంతర్జాతీయ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న ఈ డిజిటల్ నమూనా కేవలం రాష్ట్రానికే పరిమితం కాలేదు. దీనిపై అధ్యయనం చేసేందుకు ఇటీవల  ఇథియోపియా ప్రతినిధుల బృందం రాష్ట్రాన్ని సందర్శించింది. ఇక్కడి విధానాలను చూసి అబ్బురపడిన వారు, తమ దేశంలో కూడా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రశంసించారు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 45 దేశాలు ఏపీ మోడల్‌పై ఆసక్తి చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ప్రాజెక్టును ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) "ఛాంపియన్" అవార్డుకు నామినేట్ చేసింది.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 187.58 కోట్లు స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్‌ను సిఫార్సు చేసింది

మొత్తం మీద, ఈ డిజిటల్ పరివర్తన ద్వారా వ్యవసాయాన్ని మరింత పారదర్శకంగా, లాభసాటిగా, సుస్థిరంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టెక్నాలజీని రైతన్నకు చేరువ చేసి, వారి కష్టాలను తగ్గించడమే ఈ  ప్రణాళిక ముఖ్య ఉద్దేశం.

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget