Nitish Reddy Injury India vs England | టెస్ట్ సిరీస్ నుంచి నితీశ్ ఔట్
ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇండియా ప్లేయర్లకు గాయాలు వెంటాడుతున్నాయి. ఆల్ రౌండర్ నితీశ్ రెడ్డి గాయం కారణంగా ఈ సిరీస్ కు దూరం కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జిం సెషన్ లో నితీష్ గాయపడ్డాడని... లిగ్మెంట్ దెబ్బతినట్టుగా తెలుస్తుంది. దాంతో మిగితా రెండు టెస్టులకు నితీష్ రెడ్డి దూరం కాక తప్పదు అని అంటున్నారు.
ఇప్పటికే నాలుగో టెస్టులో బుమ్రా ఆడతాడో లేదో అన్న డౌట్ ఉంది. మూడో టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో రిషబ్ పంత్ గాయపడ్డాడు. దీంతో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా వ్యవహరించగా.. పంత్ బ్యాటింగ్ మాత్రమే చేశాడు. మరోవైపు లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ కూడా గాయం కారణంగా సిరీస్ కు కానున్నట్లు తెలుస్తోంది. అర్షదీప్ సింగ్ కు కూడా ప్రాక్టీస్ సెషన్ లో బౌలింగ్ చేసే ఎడమ చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. గాయం తీవ్రతను బట్టి అర్షదీప్ ఆడతాడో లేదో తెలియాల్సి ఉంది. ఇలా ప్లేయర్స్ గాయాలపాలవుతుండడంతో యువ పేసర్ అన్షుల్ కాంభోజ్‌ను టీంలోకి తీసుకున్న బీసీసీఐ.. అతణ్ని ఇంగ్లాండ్‌కు పంపించింది. మరి నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.





















