ఉడుతా.. ఉడుతా.. ఎంత పని చేశావ్!
అమెరికాలోని వర్జీనియాలో ఉన్న ఒక విద్యుత్ సబ్ స్టేషన్ కు సంబంధించిన పరికరాలలో ఉడుత దూరటంతో అక్కడ కొన్ని ఇళ్లల్లో కరెంటు పోయింది. రెండు పాఠశాలల్లోనూ కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
Squirrel blamed for transformer failure:
ఒక ఉడుత. అమెరికాలో 10 వేల మందికి పైగా వినియోగదారుల్ని చీకట్లోకి నెట్టింది. అమెరికాలోని వర్జీనియాలో ఉన్న ఒక విద్యుత్ సబ్ స్టేషన్ కు సంబంధించిన పరికరాలలో ఉడుత దూరటంతో అక్కడ కొన్ని ఇళ్లల్లో కరెంటు పోయింది. సర్క్యూట్ బ్రేకర్, ట్రాన్స్ ఫార్మర్ మధ్య ఉడుత ఇరుక్కుపోవటంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని అధికారులు తెలిపారు. దీంతో కొన్ని ఇళ్లతో పాటు రెండు పాఠశాలల్లోనూ కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
వర్జీనియాలో బుధవారం ఉదయం 8.45 గంటలకు సబ్ స్టేషన్ లోని సర్క్యూట్ బ్రేకర్, ట్రాన్స్ ఫార్మర్ మధ్యలోకి ఉడుత వచ్చింది. దీంతో ట్రాన్స్ ఫార్మర్ విఫలమైంది. దీని వలన కనీసం 10 వేల మంది వరకు విద్యుత్ లేకుండా ఇబ్బందులు పడ్డారు. కెంప్ విల్లే హైస్కూలు, ఫెయిర్ ఫీల్డ్ ఎలిమెంటరీ పాఠశాలల్లోనూ కరెంట్ సరఫరా నిలిచిపోయింది అని డొమినియన్ ఎనర్జీ అధికార ప్రతినిథి బోనిటా బిల్లింగ్లీ హారిస్ తెలిపారు. ఒక గంట 9 నిమిషాల తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు హారిస్ చెప్పారు. ఈ ప్రమాదం నుంచి ఆ ఉడుత బయటపడిందో లేదో తెలియదని అన్నారు.
ఈ ఏడాది జూన్ లో మరొక ఉడుత ఇదే విధంగా ఉత్తర కరోలినాలో కనీసం 3,000 మంది వినియోగదారులకు కరెంట్ లేకుండా చేసింది. బున్ కోంబ్ కౌంటీ కార్యాలయం ఆరోజంతా విద్యుత్ సరఫరాను కోల్పోయింది.