South Korea: సియోల్‌లో ఆయన 4 నిమిషాలు బాత్‌రూంకెళ్తే 125 రైళ్లు ఆగిపోయాయి - అక్కడేం చేశాడో తెలుసా ?
Seoul: టైం అంటే టైమ్ అనే పంక్చువాలిటీ పాటించే సియోల్ ట్రైన్స్ కు ఒక్క సారిగా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దీనికి కారణం ఓ వ్యక్తి వాష్‌రూంకు వెళ్లడమే.
South Korean train conductor 4 minute bathroom break in Seoul Subway causes 125 train delays: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో లోకల్ ట్రైన్స్ అన్నీ పంక్చువాలిటీకి మారు పేరు. ఎంతగా అంటే పది సెకన్లు ఆలస్యం అయినా సరే పెద్ద తప్పుగా చూస్తారు.అయితే రెండు రోజుల కిందట ఒకే సారి 125 ట్రైన్లు ఆలస్యం అయ్యాయి. దీనికి సాంకేతిక తప్పిదం కారణం కాదు. ఓ వ్యక్తి బాత్ రూంకు వెళ్లడం వల్లనే ఈ ట్రైన్స్ అన్నీ ఆలస్యం అయ్యాయి. ఆ వ్యక్తి ప్రయాణికుడు కాదు. ఓ ట్రైన్ ఆపరేటర్.
సియోల్ సబ్ వే సిస్టమ్‌లో రైళ్లు చాలా బిజీగా తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఓ ట్రైన్ ఆపరేటర్ కు కడుపులో తిప్పింది. అర్జంట్ గా బాత్ రూమ్‌కు వెళ్లకపోతే ట్రైన్ అంతా పావనం అయిపోతుందని ఓ స్టేషన్‌లో రైలు ఆపేసి పక్క ఫ్లోర్ లో ఉన్న బాత్ రూంకు వెళ్లారు. వీలైనంత త్వరగా పని పూర్తి చేసి వచ్చారు. ఎంత త్వరగా అంటే కేవలం నాలుగంటే నిమిషాలే. కానీ ఈలోపు చూస్తే.. మొత్తం రైలు వ్యవస్థ స్ట్రక్ అయిపోయింది. ఎక్కడి రైళ్లు అక్కడ ఆగిపోయాయి. ఇలా మొత్తం 125 రైళ్లు ఆగిపోయాయి. వెంటనే తన ట్రైన్ ను మళ్లీ నడిపించాడు కానీ.. ఆ ఎఫెక్ట్ వల్ల మిగిలిన 125 రైళ్లు ఆలస్యంగా నడవాల్సి వచ్చింది.
సియోల్ సబ్ వే సిస్టమ్‌లో ట్రైమ్ ఆపరేటర్లు నాలుగైదు గంటల పాటు ఏకధాటిగా పని చేయాల్సిఉంటుంది. మధ్యలో వారికి అత్యవసరంగా లండన్ వెళ్లాల్సి వస్తే మొబైల్ ఏర్పాట్లు ఉంటాయి కానీ వాటిని అన్ని సందర్భాల్లోనూ ఉపయోగించుకోలేరు. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇంత బిజీ రూట్లలో ట్రాక్ పై ఏదైనా ట్రైన్ నాలుగు నిమిషాలు ఆలస్యం అయితే వందలాది రైళ్లను రీ షెడ్యూల్ చేయాల్సి వస్తోంది.ఇలాంటి పరిస్థితి సాధారణంగా రాదు.కానీ మౌలిక వసతుల్ని మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని మాత్రం ఇలాంటి ఘటనలు నిరూపిస్తూ ఉంటాయి.
సియోల్ సబ్ వే ట్రైన్ ఆపరేటర్లు తాము అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో పని చేస్తున్నామని చెప్పి స్ట్రైక్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి ఘటనలో తమకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని తమనే తప్పు పడుతున్నారని వారంటున్నారు.