Fact Check: షాహిద్ అఫ్రిది మరణించారా? కరాచీలో ఖననం చేశారా? వైరల్ అవుతున్న వార్తలో నిజం ఎంత?
Shaheed Afridi: షాహిద్ అఫ్రిది మరణంపై వస్తున్న వార్తల్లో నిజమెంత? మాజీ క్రికెటర్ అఫ్రిది చనిపోయారంటూ వదంతులు వ్యాప్తికి కారణమేంటీ?

Fact Check Shahid Afridi Death News: పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరణించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి, సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మాజీ పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరణించారని అందులో పేర్కొన్నారు. అఫ్రిది కొన్ని రోజుల క్రితం వరకు భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో ఉంటూ వచ్చారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో ఆయన భారత సైన్యం, భారతీయులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.
ఈ వైరల్ వీడియోలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరణించారని చెబుతున్నారు. కరాచీలో ఖననం చేశారని, విజన్ గ్రూప్ ఛైర్మన్‌తో సహా పలువురు అధికారులు సంతాపం తెలిపారని కూడా పేర్కొన్నారు. విచారణలో ఈ వైరల్ వీడియోను AIతో తయారు చేసినట్లు తేలింది, ఇందులో ఏ మాత్రం నిజం లేదు. అఫ్రిది ఆరోగ్యంగా ఉన్నారు. అతని మరణం గురించిన తప్పుడు వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయని తేలింది..
View this post on Instagram
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యలను షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్‌తో సహా పలువురు పాకిస్తాన్ క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు , విమర్శలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ ప్రభుత్వం వారి సోషల్ మీడియా ఖాాతాలపై నిషేధం విధించింది. అఫ్రిది చాలా సంవత్సరాల క్రితం క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు . చాలా కాలంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.
షాహిద్ అఫ్రిది క్రికెట్ కెరీర్‌ను పరిశీలిస్తే, అతను 2017లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతను తన అంతర్జాతీయ కెరీర్‌లో పాకిస్తాన్ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ 11 వేల కంటే ఎక్కువ పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్‌లలో మొత్తం 541 వికెట్లు కూడా తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇప్పటికీ అతని పేరిటే ఉంది. అతను తన ODI కెరీర్‌లో 351 సిక్సర్లు కొట్టాడు, ఈ విషయంలో భారత స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ కేవలం 7 సిక్సర్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు.





















