అన్వేషించండి

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట విషాదం- KSCA కార్యదర్శి, ట్రెజరర్ల రాజీనామా

RCB Victory Parade Stampede | సీనియర్ అధికారులు KSCA ప్రెసిడెంట్ కు రాజీనామాలు సమర్పించారు. బెంగళూరులో 11 మంది మరణించిన విషాద ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) కార్యదర్శి ఎ. శంకర్, ట్రెజరర్ ఇ.ఎస్. జయరామ్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని PTI రిపోర్ట్ చేసింది. బెంగళూరులో జరిగిన విషాదకరమైన తొక్కిసలాటలో 11 మంది చనిపోవడంతో వీరిద్దరూ KSCA ప్రెసిడెంట్కు తమ రాజీనామా లేఖలు సమర్పించారు. గత కొన్ని రోజులుగా కర్ణాటక క్రికెట్ అసోయేషన్ సభ్యులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

బెంగళూరు తొక్కిసలాటతో సీనియర్ అధికారులు రాజీనామా

ఒక ఉమ్మడి ప్రకటనలో శంకర్, జైరామ్ కొన్ని విషయాలు వెల్లడించారు. “గత రెండు రోజులుగా జరిగిన ఊహించని, దురదృష్టకర సంఘటనల కారణంగా, మా పాత్ర చాలా పరిమితమైంది. అయినప్పటికీ నైతిక బాధ్యతను స్వీకరిస్తూ, మేము నిన్న రాత్రి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) కార్యదర్శి, ట్రెజరర్ పదవులకు రాజీనామా చేశాం. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌కు జూన్ 6వ తేదీన’  రాజీనామా లేఖలు సమర్పించాం అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అంతకుముందు, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) ప్రెసిడెంట్ రఘురామ్ భట్, కార్యదర్శి ఎ. శంకర్, ట్రెజరర్ ఇ.ఎస్. జయరామ్ తో కలిసి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ప్రజలు గుమిగూడటం, చిన్నస్వామి స్టేడియంలో గేట్ నిర్వహణ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ బాధ్యత కాదని పేర్కొన్నారు.

కర్ణాటక విధాన సౌధలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో విజేతగా నిలవడంతో విక్టరీ పరేడ్ నిర్వహించడానికి వారు అనుమతి కోరారు. ఇది ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించారు. 

చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటతో విషాదం..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సోషల్ మీడియా ఆహ్వానం మేరకు జట్టు విజయయాత్ర, వేడుకలలో పాల్గొనేందుకు జూన్ 4న లక్షలాది మంది అభిమానులు ఎం. చిన్నస్వామి స్టేడియం వద్దకు తరలివచ్చారు. ఈ క్రమంలో కొందరు గోడలు దూకి మరి లోపలకి వెళ్లే ప్రయత్నం చేశారు. కొందరు స్టేడియం బయట ఉన్న బారీకేడ్లు మీద నుంచి సైతం వెళ్లిపోయారు. స్టేడియం లోపల నిండిపోయి ఉందని, మరెవర్నీ అనుతించకపోవడంతో ఫ్యాన్స్ లోపలకి వెళ్లేందుకు చొచ్చుకొచ్చారు. జనాల రద్దీ కంట్రోల్ చేయడానికి పోలీసులు స్టేడియం బయట లాఠీఛార్జ్ చేశారు. దాంతో ఒక్కసారిగా తోపులాట జరిగి, తొక్కిసలాటకు దారి తీసింది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక 11 మంది చనిపోయారు. మరోవైపు స్టేడియం లోపల ఆర్సీబీ విజయానికి సంబంధించిన వేడుకలు, ఆటగాళ్లకు సన్మానం కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Embed widget