Fifth layer of Earth : భూగ్రహం ఐదో పొరలో ఊహించని లోహం - భూకంపాల పరిశోధనల్లో సంచలన విషయాలు !
భూమికి ఐదో పొర ఉందని పరిశోధకులు గుర్తించారు. ఇటీవల వస్తున్న భూకంపాల పై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు కొత్త విషయాలను కనిపెట్టారు.
Fifth layer of Earth : భూగ్రహం గురించి ఎన్ని పరిశోధనలు చేసినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. తెలుసుకున్నది గోరంత.., తెలుసుకోవాల్సింది కొండంత ఉటుది. తాజాగా జరిపిన పరిశోధనల్లో భూమి భూగర్భ శాస్త్ర రహస్యాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్న పరిశోధకులు గ్రహానికి ఐదో పొర ఉందనిగుర్తించారు. భూకంపాల ద్వారా ఉత్పన్నమయ్యే భూకంప తరంగాలు భూమి లోపలి లోతైన భాగాల గురించి లోతుగా పరిశోధించడం ద్వారా ఈ ఐదో పొర గురించి బయటకు వెల్లడయింది.
భూమిలో ఐదో పొర ఉన్నట్లుగా శాస్త్రవేత్తల గుర్తింపు
ఇప్పటి వరకూ స్కూల్, కాలేజీ పాఠాల్లో భూమి గురించి వివరించేటప్పుడు నాలుగు పొరల గురించే చెబుతారు. అంతే ఉన్నాయని ప్పటివరకూ అనుకుంటున్నారు. ఐదో పొర కూడా ఉందని.. ఇదిఎవరూ ఊహించనంత గట్టిగా ఉందని సాక్ష్యాలు వెల్లడవుతున్నాయి. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బృందం భూమి లోపలకు చొచ్చుకుపోయే భూకపంతరంగాలను లోపలికి పంపి.. కొత్త పొరను గుర్తించారు. ఈ భూకంప తరంగాలు భూమి లోపలి కోర్ గుండా చొచ్చుకుపోయే వేగాన్ని కొలుస్తాయి. ఇలా తరంగాలు లోపలకు వెళ్లిన తీరును విశ్లేషించిన శాస్త్రవేత్తలు అంతర్గతంగా మరో పొర ఉందని గుర్తించారు. పరిశోధకులు గత దశాబ్దంలో సుమారు 200 తీవ్రత-6 మరియు అంతకంటే ఎక్కువ భూకంపాల నుండి డేటాను విశ్లేషించి ఈ నిర్ణయానికి వచ్చారు.
ఐదో పొర ఘనమైన మెటాలిక్ బాల్ తరహాలో ఉంటుందన్న శాస్త్రవేత్తలు
ఈ పొర చాలా గట్టిగా ఉంటుందని ఒక ఘనమైన 'మెటాలిక్ బాల్' లా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధ్యయనం యొక్క ఫలితాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఇది గ్రహాల నిర్మాణం , రిణామాన్ని అర్థం చేసుకోవడానికి భూమి కేంద్రాన్ని పరిశీలించడం చాలా కీలకమని పరిశోధక బృందం విశ్లేషించింది. భూమి లోపల ఇలాంటి బలమైన ప౧ర ఉంటుందని గత రెండు దశాబ్దాలుగా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే దానికి సంబంధించి సరైన సాక్ష్యం మాత్రం ఇంత వరకూ లభించలేదు. ఇప్పుడు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బృందం ఈ విషయం ముందడుగు వేసింది.
భూకపంప తరంగాల ద్వారా గుర్తింపు
పరిశోధకులు భూమి అంతర్గత కోర్ లోపలి భాగాన్ని కలిగి ఉన్న ఇనుము-నికెల్ మిశ్రమం ని అధ్యయనం చేశారు. భూకంప తరంగాలు అవి ప్రయాణించే దిశను బట్టి భూమి లోపలి కోర్ పదార్థం ద్వారా ఎలా వేగాన్ని పెంచుతాయి లేదా నెమ్మదిస్తాయో వివరించడానికి అనిసోట్రోపిని ఉపయోగిస్తారు. వివిధ భూకంపాల కోసం భూకంప తరంగాల ప్రయాణ సమయాల వైవిధ్యాన్ని బృందం విశ్లేషించింది. లోపలి కోర్ అంతర్గత ప్రాంతంలోని స్ఫటికీకరించిన నిర్మాణం బయటి పొర నుండి భిన్నంగా ఉంటుందని కనుగొన్నారు.