అన్వేషించండి

Gaddafi Murder: లిబియాలో గడాఫీ కొడుకు దారుణ హత్య - అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని కాల్చి చంపిన దుండగులు

Libiya: లిబియా నింత గడాఫీ కుమారుడ్ని దుండగులు కాల్చి చంపారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఈ హత్య జరిగింది.

Saif al Islam Gaddafi assassinated at his home:  లిబియా మాజీ నియంత   గడ్డాఫీ కుమారుడు మరియు ఆ దేశ రాజకీయాల్లో కీలక వ్యక్తి అయిన  సైఫ్ అల్-ఇస్లాం గడ్డాఫీ దారుణ హత్యకు గురయ్యారు.  పశ్చిమ లిబియాలోని జింతాన్ నగరంలో ఉన్న ఆయన నివాసంలో ఈ అటాక్ జరిగింది. గడ్డాఫీ మరణాన్ని ఆయన తరపు న్యాయవాది ఖలీద్ అల్-జైదీ ,  ఆయన రాజకీయ బృందం అధికారికంగా ధృవీకరించాయి. 2011లో తన తండ్రి పతనం తర్వాత లిబియా రాజకీయాల్లో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న తరుణంలో ఈ హత్య జరగడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది.

ఈ హత్య అత్యంత పక్కా వ్యూహంతో జరిగినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం సుమారు నలుగురు ముసుగు ధరించిన దుండగులు సైఫ్ అల్-ఇస్లాం నివాసంలోకి చొరబడ్డారు. లోపలికి ప్రవేశించే ముందే వారు అక్కడి నిఘా కెమెరాలను  నిలిపివేశారు. ఆ తర్వాత జరిగిన ప్రత్యక్ష ఘర్షణలో దుండగులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన సైఫ్ అల్-ఇస్లాం అక్కడికక్కడే మరణించగా, నిందితులు వేగంగా పరారయ్యారు. ఈ ఘటనను ఆయన కార్యాలయం ఒక  పిరికిపంద చర్య గా అభివర్ణించింది.

సైఫ్ అల్-ఇస్లాం గడ్డాఫీ జీవితం అనేక మలుపులతో సాగింది. ఒకప్పుడు తన తండ్రికి వారసుడిగా, లిబియాలో సంస్కరణవాదిగా గుర్తింపు పొందిన ఆయన, 2011 విప్లవం తర్వాత తిరుగుబాటుదారులకు చిక్కారు. ఆ తర్వాత ఆరేళ్ల పాటు జింతాన్ జైలులోనే గడిపారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయనపై యుద్ధ నేరాల కింద అరెస్ట్ వారెంట్ జారీ చేసినప్పటికీ, 2017లో అమ్నెస్టీ కింద విడుదలైనప్పటి నుంచి ఆయన జింతాన్‌లోనే అజ్ఞాతంగా ఉంటూ రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. 2021లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి మళ్లీ వార్తల్లో నిలిచారు.               

లిబియా అటార్నీ జనరల్ కార్యాలయం ఈ హత్యపై అధికారిక దర్యాప్తు ప్రారంభించింది. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆయన మరణం తుపాకీ కాల్పుల వల్లే జరిగిందని నిర్ధారించారు. అయితే, ఈ హత్య వెనుక ఎవరున్నారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ హత్య వల్ల లిబియాలో ఇప్పటికే ఉన్న రాజకీయ అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గడ్డాఫీ మద్దతుదారులు మరియు ప్రత్యర్థి వర్గాల మధ్య మళ్లీ హింస చెలరేగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.                           

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget