Vladimir Putin: ప్రపంచాన్నే షేక్ చేసిన పుతిన్ ఇలా వణికిపోతున్నారేంటి? వైరల్ వీడియో
Vladimir Putin: ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచాన్నే గడగడలాడించిన పుతిన్.. కనీసం నిలబడలేక వణికిపోతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది.
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించిన మరో వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పుతిన్ కనీసం నిలబడలేక తెగ వణుకుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి పుతిన్ ఆరోగ్యంపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పుతిన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, ఎక్కువ రోజులు బతికి ఉండరని ఇలా చాలా పుకార్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ వీడియో బయటకు రావడంతో పుతిన్ ఆరోగ్యంపై మళ్లీ చర్చ మొదలైంది.
Putin’s legs shaking, he looks unsteady on his feet, fueling more speculation about his health. Video was taken Sunday. pic.twitter.com/TIVfK30tAp
— Mike Sington (@MikeSington) June 14, 2022
ఎక్కడ జరిగింది?
క్రెమ్లిన్‌లో ఇటీవల జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పుతిన్ నిలబడలేక ఇబ్బంది పడుతున్నట్లు, వణుకుతున్నట్లు (షేక్) న్యూయార్క్ పోస్టు ఓ కథనాన్ని ప్రచురించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పోడియం దగ్గర నిలబడ్డ పుతిన్ వణుకుతున్నట్లు కనిపించారు.
రష్యాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తి ఒకరు పుతిన్ ఆరోగ్యంపై స్పందిస్తూ పుతిన్ రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గత నెలలోనే తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఆయన వెన్నుకు శస్త్రచికిత్స జరిగిందని, ఉక్రెయిన్‌పై యుద్ధ ప్రకటనకు ముందు ఇది జరిగినట్లు చెప్పారు.
మరో విషయం
పుతిన్‌కు సంబంధించిన మరో విషయం ఇటీవల బయటకు వచ్చింది. పుతిన్‌కు ఓ ప్రత్యేకమైన ఒక బాడీగార్డ్ ఉన్నాడని.. ఆయన ప్రత్యేకమన సేవలు చేస్తారని తెలిసింది. ఆ బాడీగార్డ్ పుతిన్ మలమూత్రాలను సేకరిస్తాడట.
దీనిపై అంతర్జాతీయ మీడియా కీలక విషయాలు వెల్లడించింది. పుతిన్ ఆరోగ్య రహస్యాలు తెలియకుండా ఉండేందుకు.. బాడీగార్డు ఇలా ఆయన మలమూత్రాలను సేకరిస్తుంటాడని చెబుతున్నారు. ఎందుకంటే.. ఇతరులకు దొరకకుండా ఉండటానికి... ఛీ యాక్.. వాటిని ఇతరులు ఎందుకు తీసుకుంటారనే డౌట్ మనకు రావొచ్చు. కానీ పుతిన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్న కొన్ని దేశాలు వాటిని సేకరించి టెస్టులు చేస్తాయని అనుమానిస్తున్నారు.