Viral Video: ఏం ఎంజాయ్ చేస్తున్నావ్ రా బుడ్డోడా- వాన పడితే ఇట్టుండాలి మరి!
Viral Video: ఓ బుడ్డోడు వర్షంలో హాయిగా ఎంజాయ్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Viral Video: వర్షం పడితే ఎంత హాయిగా ఉంటుంది కదా. అసలు వర్షం పడే ముందు తొలకరి జల్లు భూమిని ముద్దాడితే వచ్చే ఆ మట్టి వాసన ఎంత బాగుంటుంది. వర్షాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా ఎంజాయ్ చేస్తారు. కొంతమందికి వర్షంలో వేడివేడి పకోడీలు తినడం ఇష్టం. మరికొందరికి ఇంట్లోనే కూర్చొని వర్షాన్ని కిటికీలో నుంచి చూడటం ఇష్టం.
కానీ కొంతమందికి మాత్రం వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేయడం ఇష్టం. ముఖ్యంగా పిల్లలు వర్షంలో ఎంజాయ్ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ బుడ్డోడు వర్షాన్ని ఎంజాయ్ చేస్తోన్న విధానం చూస్తే మనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి.
Meanwhile in The Netherlands.. pic.twitter.com/QnSqDL4FXB
— Buitengebieden (@buitengebieden) June 8, 2022
భలే బుడ్డోడు
ఈ వీడియోలో ఓ బుడ్డోడు వర్షపు నీటిలో ఆటలు ఆడుతున్నాడు. ఈ పిల్లాడు వర్షాన్ని ఆస్వాదిస్తున్న తీరు చూస్తే ముచ్చటేస్తుంది. వీడియోలో పసుపు రంగు రెయిన్ కోట్ ధరించిన బడ్డోడు వర్షాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అది కూడా వర్షపు నీటిలో పడుకుని మరీ తడుస్తున్నాడు. ఈ వీడియో నెదర్లాండ్స్‌లో చిత్రీకరించారు.
Kids just wanna have fun.. 😂
— Buitengebieden (@buitengebieden) June 8, 2022
Sound on pic.twitter.com/7lCembEcsx
.Work out.. 😅 pic.twitter.com/WqFsitRHQj
— Buitengebieden (@buitengebieden) June 15, 2022
Poor baby so cold and rain there ….. where is the parente ????
— Marcia Sueko Osugi ( Mimi Mizobe) (@MimiMizobe) June 8, 2022
నెటిజన్లు ఈ క్యూట్ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. వీడియోకు తమదైన స్టైల్‌లో కామెంట్లు పెడుతున్నారు. మీకూ ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి.
Also Read: Covid Update: బాబూ చిట్టి! మాస్కు పెట్టు నాయనా- ఒక్కరోజే 12వేల కేసులు
Also Read: Infectious Disease In North Korea: ఉత్తర కొరియాలో అంతుచిక్కని అంటువ్యాధి- కిమ్ బాబాయ్ ఏం చేస్తాడో!