Russia Ukraine War: ఎటెళ్లాలో తెలియడం లేదు, ఎటు చూసినా బాంబు పేలుళ్లే- ఖార్కివ్‌లో విద్యార్థుల ఆవేదన
Russia Ukraine War: ఉక్రెయిన్ ఖార్కివ్ పేలుడులో ఓ భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆ ప్రాంతంలో భారత విద్యార్థులు 30 మంది వరకు చిక్కుకున్నారు. అక్కడి పరిస్థితిని ఓ విద్యార్థి ఏబీపీకి వివరించాడు.
Russia Ukraine War: ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధంలో కర్ణాటకకు చెందిన నవీన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఖార్కివ్ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య జరిగిన పేలుళ్లలో నవీన్ చనిపోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే ఆ ప్రాంతంలో మంగళవారం ఉదయం నుంచి భారత విద్యార్థులు ఎటెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. భారత ఎంబసీ కూడా వారికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అక్కడి విద్యార్థులు చెబుతున్నారు. ABP దేశంతో అజయ్ అనే ఓ విద్యార్థి అక్కడి పరిస్థితుల గురించి వివరించాడు.
పడిగాపులు
రష్యా భీకర దాడులు చేస్తోన్నందున్న భారత విద్యార్థులంతా పశ్చిమ వైపునకు వెళ్లాలని భారత ఎంబసీ సూచించింది. దీంతో అజయ్ సహా 20-30 మంది విద్యార్థులు.. ఖార్కివ్ నగరానికి మంగళవారం ఉదయమే చేరుకున్నారు. అయితే ఇక్కడ నుంచి ఎలా వెళ్లాలనే దానిపై వారికి ఎంబసీ ఎలాంటి సూచనలు ఇవ్వలేదు.
దాడికి దగ్గర్లోనే
ఖార్కివ్ పేలుడు జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే తాము ఉన్నట్లు అజయ్ తెలిపాడు. తమ పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. భారత ఎంబసీ అధికారులు వెంటనే తమకు సాయం చేయాలని కోరాడు. ఈ విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి వీరిని క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని వారు కోరుతున్నారు.
విద్యార్థి మృతి
ఖార్కివ్ పేలుడులో మృతి చెందిన విద్యార్థి కర్ణాటక హవేరి జిల్లాకు చెందిన నవీన్ జ్ఞానగౌడార్గా గుర్తించారు. నవీన్ ఉక్రెయిన్‌లో వైద్య విద్య నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.
Also Read: Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి- భారత విదేశాంగ శాఖ ప్రకటన
Also Read: Ukraine Russia War: ఈయూ దేశాలపై పుతిన్ ప్రతీకారం- రష్యా గగనతలంలోకి ఆ దేశ విమానాలు వస్తే!