Russia-Ukraine War: అమెరికా కాంగ్రెస్‌లో జెలెన్‌స్కీ ప్రసంగం- తక్షణ సాయం చేయాలని వినతి
Russia-Ukraine War: అమెరికా తమకు తక్షణ సాయం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ కోరారు.
Russia-Ukraine War: అమెరికా తమకు తక్షణ సాయం అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ ఆ దేశ కాంగ్రెస్ (సభ)ను కోరారు. అమెరికా కాంగ్రెస్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెలెన్‌స్కీ ఈరోజు మాట్లాడారు. ఈ ప్రసంగంలో పెర్ల్ హర్బర్, 9/11 ఉగ్రదాడిని ప్రస్తావించారు. తమ సార్వభౌమత్వాన్ని రష్యా సవాల్ చేస్తుందని జెలెన్‌స్కీ అన్నారు.
BREAKING: Ukrainian Pres. Zelenskyy addresses Pres. Biden in English at conclusion of his virtual address to U.S. Congress: "Being the leader of the world means to be the leader of peace." https://t.co/XC4D3WDLcN pic.twitter.com/wbI8rKSXgP
— ABC News (@ABC) March 16, 2022
యుద్ధం వల్ల తమ దేశంలో నెలకొన్న పరిస్థితులు, మారణహోమానికి సంబంధించిన వీడియోలను జెలెన్‌స్కీ చూపించారు.
జెలెన్‌స్కీ ప్రసంగం ప్రారంభం, ముగింపు సందర్భంగా స్టాడింగ్ ఒవెషన్ ఇచ్చారు కాంగ్రెస్ సభ్యులు.
దాడులు ఉద్ధృతం
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఉద్ధృతం చేసింది. రష్యా సేనల దాడిలో సామాన్య పౌరులు, జర్నలిస్టులు కూడా మరణిస్తున్నారు. తాజాగా రాజధాని కీవ్‌లో ఫాక్స్ న్యూస్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులు దుర్మరణం చెందారు. ఆ ప్రాంతంలో కవరేజ్ కోసం వెళ్లిన వారి వాహనంపై బాండు దాడి జరిగి మంటల్లో చిక్కుకోవడం వల్ల ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
పీర్రె జక్జెవ్స్కీ, ఒలెక్ సాండ్రా అనే ఇద్దరు జర్నలిస్టులు క్షేత్రస్థాయి పరిస్థితుల్ని టీవీ ద్వారా ప్రజలకు చూపేందుకు ప్రాణాలకు తెగించి ఉక్రెయిన్ వెళ్లారు. అయితే వీరిద్దరూ దాడిలో మృతి చెందారు.
Also Read: Hyperloop Technology: హైదరాబాద్ టూ విజయవాడ కేవలం 15 నిమిషాల్లో! రండి బాబు రండి!