Kinzhal Hypersonic Missile: ఉక్రెయిన్‌పై ఉక్కుపాదం - తొలిసారి హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రయోగించిన రష్యా
Russia used new hypersonic missile Kinzhal: ఆయుధాలు స్టోరేజ్ చేసే కేంద్రాన్ని ధ్వసం చేయడంలో భాగంగా రష్యా ఆ హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు సమాచారం. రష్యా అధికారులు దీనిపై ఏ ప్రకటన చేయలేదు.
Kinzhal Hypersonic Missile: ఉక్రెయిన్‌లో రష్యా మారణహోమం ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడు వారాలు దాటినా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆపడం లేదు. ఓ వైపు చర్చలు జరుపుతూనే మరోవైపు క్షిపణి దాడులతో ఉక్రెయిన్ నగరాలలో విధ్వంసానికి పాల్పడుతోంది రష్యా సైన్యం. ఉక్రెయిన్‌లో దాడులను మరింతగా పెంచుతూ తొలిసారిగా హైపర్ సోనిక్ మిస్సైల్ (Russia used new hypersonic missile In Ukraine)ను ఉక్రెయిన్ సైనిక ఆయుధాగారంపై రష్యా ప్రయోగించింది. ఈ విషయాన్ని రష్యా మీడియా రిపోర్ట్ చేసింది. కింజల్ హైపర్ సోనిక్ మిస్సైల్‌ను ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో రష్యా ప్రయోగించింది.
ఆయుధ కేంద్రంపై దాడి..
ఆయుధాలు స్టోరేజ్ చేసే కేంద్రాన్ని ధ్వసం చేయడంలో భాగంగా రష్యా ఆ హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు సమాచారం. రష్యా అధికారులు దీనిపై ఇప్పటివరకూ ఏ ప్రకటన చేయలేదు. అయితే కింజల్ ఏవియేషన్ మిస్సైల్ (Kinzhal Hypersonic Missile)ను పెద్ద భూభాగంలో విధ్వంసం చేయడానికి వినియోగిస్తారని రష్యా మీడియా ఆర్ఐఏ నోవోస్టి తెలిపింది. హైపర్‌సోనిక్ క్షిపణులతో ఇవానో-ఫ్రాంకివ్‌స్క్ ప్రాంతంలో మందుగుండు సామాగ్రి నిల్వ ఉంచిన స్టోరేజీ సెంటర్‌ను నాశనం చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. క్షిపణులు, వైమానిక ఆయుధాలను నిల్వ చేసే భారీ భూగర్భ ఆయుధ కేంద్రం ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
ధ్వని కంటే 10 రెట్లు వేగం..
హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రయోగించడంపై స్పందించేందుకు రష్యా రక్షణశాఖ ప్రతినిధులు నిరాకరించారు. ఇది తమకు అంత్యంత అవసరమైన ఆయుధంగా కింజల్ మిస్సైల్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలో పేర్కొన్నారు. ఈ హైపర్ సోనిక్ క్షిపణి ధ్వని కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకుపోతుంది. 2018లో పుతిన్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. తమ కొత్త ఆయుధాల శ్రేణిలో కింజాల్ క్షిపణి ఒకటి అని పేర్కొన్నారు.
కార్పాతియా పర్వతాల దిగువన ఉన్న గ్రామం డెలియాటిన్‌పై రష్యా ఆర్మీ తాజాగా హైపర్ సోనిక్ మిస్సైల్‌తో దాడులను తీవ్రతరం చేసింది. ఈ ప్రాంతం నాటో సభ్య దేశమైన రొమేనియాతో దాదాపు 50 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటుంది. మరోవైపు నాటో సభ్యత్వంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెనక్కి తగ్గకపోవడం, మరోవైపు తమ లక్ష్య సాధనకు రష్యా అధినేత పుతిన్ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా యుద్ధాన్ని ఆపడం లేదు.
Also Read: Volodymyr Zelenskyy: అస్సాంలోని ఓ టీ పొడికి ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరు, త్వరలో ఆన్‌లైన్లో అమ్మకానికి