News
News
X

Ukraine Crisis: ఉక్రెయిన్‌లో ఇంకా భారతీయులు - వారి కోసం అందుబాటులోకి ప్రత్యేక ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్

ఉక్రెయిన్‌లోనే ఉండిపోయిన భారతీయుల కోసం కీవ్‌లోని భారత్ ఎంబసీ ప్రత్యేకంగా మూడు ఫోన్ నెంబర్లు, ఓ ఈ మెయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది.ఆ వివరాలు ఇవే..

FOLLOW US: 

Ukraine Crisis:  ఉక్రెయిన్‌లో యుద్ధం ఆగడం లేదు . ఇంకా ఉక్రెయిన్‌లో కొన్ని వందల మంది భారతీయులు ఉండిపోయారు. వారి కోసం ఉక్రెయిన్‌లోని భారత్ ఎంబసీ ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంది. ఎవరికైనా సహాయం అవసరం అయితే వెంటనే స్పందిస్తోంది. తాజాగా ఉక్రెయిన్‌లో ఉండిపోయిన భారత పౌరుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది.  ఇరవై నాలుగు గంటలు పని హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది.

ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎంబసీని సంప్రదించడానికి మూడు వాట్సాప్ నెంబర్లను ప్రకటించారు. 
ఆ నెంబర్లు ఇవి 
1. +380933559958
2. +919205290802
3. +917428022564 

అలాగే ప్రత్యేకంగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు... ఆపదలో ఉన్న వారిన ిఆదుకునేందుకు ప్రత్యేకంగా ఈ మెయిల్ కూడా అందుబాటులోకి తెచ్చారు. ఆ ఈ మెయిల్  అడ్రస్ ఇది. 
ons1.kyiv@mea.gov.in 

మూడు వారాలు దాటిపోయినా  ర‌ష్యాన్ దళాలు..ఉక్రెయిన్ పై విచ‌క్ష‌ణ ర‌హితంగా బాంబుల వ‌ర్షం కురిపిస్తునే ఉన్నాయి. ఇప్పటికే పలు ప్ర‌ధాన ప‌ట్ట‌ణాలు స్మశానదిబ్బలుగా మారాయి. త‌మ న‌గ‌రాల‌ను కాపాడుకోవడాని ఉక్రెయిన్ సైన్యం కూడా పోరాటం సాగిస్తున్నాయి. ర‌ష్యాన్ సేన‌ల‌కు దీటుగా  ప్రతి ఘటనను కనబరుస్తున్నాయి.  ఇలా చేయ‌డం వ‌ల్లే. ఇప్పటికి ఉక్రెయిన్ దేశాన్ని.. రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకొలేక పోయింది.

ఇప్పటికే కీవ్, మరియూపోల్,ఖర్కివ్, ఖేర్సన్, ఇర్ఫిన్ ను లోనిపలు భవనాలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు బాంబుల దాడులకు ధ్వంస మయ్యాయి. ఐక్య‌రాజ్య‌స‌మితి నివేదికల ప్ర‌కారం.. దాదాపు.. 30 లక్షల మంది వరకు ఉక్రెయిన్ ను విడిచి పొరుగు దేశాల‌కు వెళ్ళిపోయారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 6.5 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.  విదేశీయులు ఇంకా కొంత మంది ఉండటంతో వారి కోసం ఆయా దేశాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

ఇప్పటికే పెద్ద ఎత్తున ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయుల్ని కేంద్రం స్వదేశానికి తరలించింది. దాదాపుగా పది వేలకు మందికిపైగా వైద్య విద్యార్థులు భారత్ చేరుకున్నారు. అయితే  ఇప్పటికీ వివిధ కారణాలతో అనేక మంది ఉక్రెయిన్‌లోనే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారి కోసం ఎంబసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. 

Published at : 19 Mar 2022 01:03 PM (IST) Tags: Russia Vladimir Putin Russia-Ukraine war Indian Embassy in Kiev Embassy of Ukraine in India

సంబంధిత కథనాలు

NTRUHS PG Admissions: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌, చివరితేది ఇదే!

NTRUHS PG Admissions: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌, చివరితేది ఇదే!

Pawan Kalyan Yatra : అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ టూర్

Pawan Kalyan Yatra :  అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ టూర్

Bandi Sanjay: ఈడీని వాడితే ఒక్కరూ మిగలరు, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు - గన్‌ ఫైరింగ్‌పై కూడా

Bandi Sanjay: ఈడీని వాడితే ఒక్కరూ మిగలరు, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు - గన్‌ ఫైరింగ్‌పై కూడా

Independence Day 2022: కోనసీమ జిల్లాలో ఆ గ్రామానికి ఇండిపెండెన్స్ డే వెరీ వెరీ స్పెషల్, ఈ విశేషాలు మీకు తెలుసా

Independence Day 2022: కోనసీమ జిల్లాలో ఆ గ్రామానికి ఇండిపెండెన్స్ డే వెరీ వెరీ స్పెషల్, ఈ విశేషాలు మీకు తెలుసా

Independence Day 2022 Wishes: మీ ఫ్రెండ్స్‌కి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Independence Day 2022 Wishes: మీ ఫ్రెండ్స్‌కి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి

టాప్ స్టోరీస్

Revanth Reddy : మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరిండు - రేవంత్ రెడ్డి

Revanth Reddy : మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరిండు - రేవంత్ రెడ్డి

Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్

Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్

JK Rowling Death Threat: డోంట్ వర్రీ నెక్స్ట్ టార్గెట్ నువ్వే, హ్యారీపాటర్ రైటర్‌కి బెదిరింపులు

JK Rowling Death Threat: డోంట్ వర్రీ నెక్స్ట్ టార్గెట్ నువ్వే, హ్యారీపాటర్ రైటర్‌కి బెదిరింపులు

Indian National Flag: జాతీయ జెండా గురించి మహాత్మా గాంధీజీ ఏం చెప్పారో తెలుసా?

Indian National Flag: జాతీయ జెండా గురించి మహాత్మా గాంధీజీ ఏం చెప్పారో తెలుసా?