Luna-25: రష్యా పంపిన లూన్-25లో సాంకేతిక సమస్య, ఆఖరిదశలో గుర్తింపు - ల్యాండింగ్‌పై నో క్లారిటీ
చంద్రుడిపై పరిశోధనల కోసం ఆగస్టు 10న రష్యా లూన్ 25 ను ప్రయోగించిన సంగతి తెలిసిందే.
చంద్రుడిపై అన్వేషణ కోసం రష్యా పంపిన స్పేస్ క్రాఫ్ట్ లూన్ 25లో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా ఆ దేశ స్పేస్ ఏజెన్సీ రోస్‌కాస్మోస్ ప్రకటించింది. శనివారం లూన్ 25ను ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తుండగా ఈ గ్లిట్చ్‌ను గుర్తించినట్లుగా రోస్‌కాస్మోస్ వెల్లడించింది. అన్ని సక్రమంగా జరిగితే సోమవారం నాడు (ఆగస్టు 21) న లూన్ 25 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండ్ కావాల్సి ఉంది.
‘‘ఈ మిషన్‌లో భాగంగా ఒక అసాధారణ పరిస్థితి (abnormal situation) స్పేస్ క్రాఫ్ట్‌లో తలెత్తింది. దీనివల్ల స్పేస్ క్రాఫ్ట్ నిర్దేశిత కక్ష్య చేయడానికి వీలుపడడం లేదు. ప్రీ-ల్యాండింగ్ ఆర్బిట్‌లోకి స్పేస్‌క్రాఫ్ట్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి థ్రస్ట్‌ని రిలీజ్ చేశాం. ఈ సమయంలో అందులోని అటామిక్ స్టేషన్‌లో ఒక ఎమర్జెన్సీ సిట్యువేషన్ తలెత్తింది. దీనివల్ల నిర్దేశిత విధానంలో నిర్దేశిత కక్ష్యలోకి వెళ్లడానికి వీలుపడడం లేదు’’ అని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ ప్రకటన విడుదల చేసింది. ఈ సమస్య వల్ల ప్రయోగ లక్ష్యంపై ఏదైనా ప్రభావం పడుతుందా అనే అంశంపై రోస్‌కాస్మో్స్ క్లారిటీ ఇవ్వలేదు.
చంద్రుడిపై పరిశోధనల కోసం ఆగస్టు 10న రష్యా లూన్ 25 ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. దాదాపు 50 ఏళ్ల క్రితం ఆపేసిన చంద్రుడిపై అన్వేషణను లూనా 25తో మళ్లీ రష్యా మొదలుపెట్టింది. కేవలం 11 రోజుల్లోనే చంద్రుడిపై రష్యా దిగడానికి ప్లాన్ చేసింది. మరోవైపు, భారత్ చేపట్టిన చంద్రయాన్ 3 ఆఖరిదశలో ఉన్న సంగతి తెలిసిందే. ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ చంద్రుడికి మరింత దగ్గర అయి దక్షిణ ధ్రువంపై దిగడానికి రెడీ అవుతోంది. అన్ని సవ్యంగా జరిగితే ఆగస్టు 23 సాయంత్రం సమయంలో చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగాల్సి ఉంది. ఈ క్షణాల కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చేస్తోంది.