అన్వేషించండి

ప్రియురాలికి సంకెళ్లు వేసి.. కారు టాప్‌‌కు కట్టేసిన ప్రియుడు, ఇదేం ప్రేమ పరీక్ష?

ఓ ప్రియుడు తన ప్రియురాలిని కారు టాపుకు కట్టేశాడు. ఆ వీడియో చూసిన నెటిజనులు.. ‘అరె ఏంట్రా ఇదీ?’ అంటు అతడిని తిట్టిపోస్తున్నారు.

వరైనా ప్రియురాలి బైకు వెనుక లేదా కారు పక్కన కూర్చుబెట్టుకుని లాంగ్ డ్రైవ్‌కు వెళ్తారు. కానీ, ఇతడు మాత్రం ఆ టైపు కాదు.. ప్రియురాలిని కారు టాప్‌కు కట్టేసి.. సంకెళ్లు వేసి మరీ షికారుకు తీసుకెళ్లాడు. రోడ్డుపై వెళ్లేవారు ఆమెను అలా చూసి నోరెళ్లబెట్టారు. వార్నీ.. ఎందుకలా చేస్తున్నావని ప్రశ్నిస్తే.. ఇది కూడా ఒకరకమైన ప్రేమ పరీక్షే అని సమాధానం ఇచ్చాడు. 

రష్యాకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ సెర్గే కొసెన్కో తన ప్రియురాలితో కలిసి వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లు 5.1 మిలియన్‌కు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. అతడు ఏం చేసినా సరే చాలా కొత్తగా ఉంటుంది. అయితే, ఈ సారి చేసిన పని మాత్రం చాలా పిచ్చిగా ఉండటంతో నెటిజనులకు బాగా నచ్చేసింది. ప్రియురాలికి తన మీద ఎంత నమ్మకం ఉందో పరీక్షిస్తానంటూ.. ఆమెను కారు టాపుకు కట్టేశాడు. ఆ తర్వాత ఆమె చేతికి, తన చేతికి సంకెళ్లు వేసుకున్నాడు. 

అంతటితో ఆగకుండా.. ఒంటిచేత్తో కారు స్టీరింగ్ అందుకుని మాస్కోలోని బెంట్లే వీధుల్లో షికారు చేశాడు. చిత్రం ఏమిటంటే.. కారు ముందుకు కదులుతున్నా ఆమె ఏ మాత్రం భయపడలేదు. దాన్ని ఆమె ఓ సరికొత్త అనుభూతిలా ఫీలైంది. అయితే, రోడ్డు మీద వెళ్లే జనాలకు మాత్రం.. వారు  కాసేపు వింత జీవుల్లా కనిపించారు. రోడ్డుపై పిచ్చి వేషాలు ఏమిటనట్లుగా వారిని చూశారు. వారు అలాంటి చిందులేస్తుంటే పోలీసులు ఊరుకుంటారా? వెంటనే ఆ జంటను అదుపులోకి తీసుకుని రూ.760 జరిమానా విధించారు. అయితే, వారు చాలా ప్రమాదకరమైన స్టంట్ చేశారని, ఆ జరిమానా సరిపోదని కొంతమంది నెటిజనులు అంటున్నారు. దీంతో మాస్కో స్టేట్ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘ఓ యువకుడు కారు టాపుకు ఓ అమ్మాయిని కట్టేసిన డ్రైవింగ్ చేస్తున్న వీడియోపై విచారణ జరుపుతున్నాం. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆమెను అలా కారు కట్టేసి డ్రైవింగ్ చేయడమంటే.. హత్యాయత్నంతో సమానమని ఓ న్యాయవాది తెలిపారు. అతడికి జరిమానాతోపాటు జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయన్నారు. 

నెటిజనులు కూడా కొసెన్కోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చిన్నపిల్లల ఆట కాదని, ఆమె ప్రాణాలకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి స్టంట్లు పిల్లలు, యువకులు చూస్తే అనుకరించేందుకు ప్రయత్నిస్తారని మరికొందరు అంటున్నారు. ఈ ఘటనపై స్థానిక పత్రికలు సైతం కొసెన్కోపై విమర్శలు గుప్పించాయి. దీంతో అతడు అందరికీ క్షమపణలు చెప్పాడు. రూ.759 జరిమానా కట్టినందుకు సిగ్గుగా ఉందన్నాడు. మీ ప్రియురాలిపై కోపం ఉన్నా లేదా ఆమె ప్రేమను పరీక్షించాలన్నా.. ఇలాంటి మార్గాలను మాత్రం ఎంచుకోకండి. తర్వాత మీరే చిక్కుల్లో పడతారు. 

వీడియో:

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Embed widget