Pakistan Punjab : పాకిస్థాన్‌లో అంతే - అసెంబ్లీలో స్పీకర్‌నే చెప్పులతో కొట్టారు !
పాకిస్థాన్‌లోని పంజాబ్ ఫ్రావిన్స్ కు కొత్త ముఖ్యమంత్రి ఎంపిక సందర్భంగా ఘర్షణ చోటు చేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ సభ్యులు స్పీకర్‌పై దాడి చేసి కొట్టారు.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్ అసెంబ్లీ రణరంగంగా మారింది. ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్‌పై దాడి చేశారు. పీటీఐ నేతల దాడిలో డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజ్రీ గాయపడ్డారు. పీటీఐ ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్‌ను చెప్పులతో కొట్టి , జుట్టుపట్టుకుని ఈడ్చేశారు. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శనివారం సమావేశమైన అసెంబ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Chaotic scenes from the legislative assembly of Pakistan's Punjab province. Assembly met to vote for new Chief Minister but legislators attacked each other. pic.twitter.com/zadceTxJCk
— Sidhant Sibal (@sidhant) April 16, 2022
ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.
‘Lotas’ thrown at Deputy Speaker Punjab Assembly Dost Muhammad Mazari, he was also apparently slapped by PTI members. He has been escorted by Sergeant-At-Arms. #Pakistan pic.twitter.com/S2VZrmsyWV
— Smita Prakash (@smitaprakash) April 16, 2022
More visuals from the legislative assembly of Pakistan's Punjab province:pic.twitter.com/nTEqybYEZZ
— Sidhant Sibal (@sidhant) April 16, 2022
#Punjab #Pakistan #پولیس_راج
— A J _ 109 💙 (@Banisai) April 16, 2022
We know who and why this is happening . You all have to answer sooner or later pic.twitter.com/gPS1m4HNts
పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజ్రీ సభకు అధ్యక్షత వహించడానికి వచ్చారు. ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పీటీఐ ఎమ్మెల్యేలు అతనిని అడ్డుకుని తీవ్రంగా కొట్టారు. ఇమ్రాన్‌ఖాన్ పార్టీని వీడి ప్రతి పక్షాలకు మద్దతిచ్చిన నేతలపై తిట్ల దండకం వినిపించారు. తర్వాత దాడులకు దిగారు.
Election of new Chief Minister: Punjab Assembly session tumultuous,attack on Deputy Speaker
— Ali Taha (@Ali_Taha_Jatoi) April 16, 2022
Khawaja Asif said that the Deputy Speaker of the Punjab Assembly was attacked and he was subjected to the worst kind of torture, the worst example in the parliamentary history of Pakistan pic.twitter.com/00aT9azXiJ
ఇమ్రాన్ ఖాన్ పదవి పోగొట్టుకున్న తరహాలోనే పంజాబ్ ముఖ్యమంత్రి పదవి కూడా రిస్క్‌లో పడింది. లాహోర్ హైకోర్టు ఆదేశాలను అనుసరించి, పంజాబ్‌లో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం సభ నిర్వహించారు. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి ఉండగా కొట్టుకున్నారు. ఏకంగా స్పీకర్‌నే కట్టడంతో ముఖ్యమంత్రి ఎన్నిక వాయిదా పడింది. తనను కొట్టిన వారిని వదిలి పెట్టబోనని స్పీకర్ ప్రకటించారు. ఆయనకు తీవ్ర గాయాలతో ఆస్పత్రి కట్లు కట్టించారు.
Chaudhry Pervaiz Elahi says he will never forgive the people who attacked him. #Punjab #PunjabAssembly pic.twitter.com/qNXE0RgLe4
— The Pakistan Daily (@ThePakDaily) April 16, 2022