అన్వేషించండి

Pakistan Hindu Names: లాహోర్‌లో కృష్ణనగర్, లక్ష్మినగర్ కాలనీలు- వింత కాదు నిజమే- పాక్ ప్రభుత్వానికి తప్పట్లేదు!

Pakistan Lakshmi Chowk: విభజన తర్వాత పాకిస్థాన్‌లో అనేక ప్రాంతాల పేర్లను ఇస్లామీకరణ చేశారు. హిందూ పేర్లను తొలగించి ముస్లిం పేర్లను పెట్టారు. ఇప్పుడు మళ్లీ పాత పేర్లు పెడుతున్నారు. ఎందుకంటే ?

Pakistan Renaming Lahore Streets to Hindu Sikh Names: పాకిస్థాన్ సాంస్కృతిక రాజధాని లాహోర్‌లో గత కొద్దిరోజులుగా ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంటోంది. దశాబ్దాల క్రితం ఇస్లామిక్ పేర్లతో మార్చిన  వీధులు, కూడళ్లు మళ్ళీ తమ పాత హిందూ, సిక్కు , క్రైస్తవ పేర్లను తిరిగి పెడుతున్నారు.  విభజనకు ముందు ఉన్న చారిత్రక మూలాలను వెలికితీసే ఈ వినూత్న ప్రయత్నం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యింది.  

  విభజన తర్వాత పాకిస్థాన్‌లో అనేక ప్రాంతాల పేర్లను ఇస్లామీకరణ   చేశారు. హిందూ, సిక్కు సంస్కృతిని ప్రతిబింబించే పేర్లను తొలగించి ముస్లిం వీరులు లేదా ఇస్లామిక్ పేర్లను పెట్టారు. అయితే, సుమారు 79 ఏళ్ల తర్వాత లాహోర్ తన అసలు గుర్తింపును మళ్ళీ వెతుక్కుంటోంది. పంజాబ్ ముఖ్యమంత్రి  మర్యమ్ నవాజ్ నేతృత్వంలోని ప్రభుత్వం, లాహోర్ హెరిటేజ్ రివైవల్ ప్రాజెక్ట్ కింద పాత పేర్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది.

 ఏయే పేర్లు మారుతున్నాయి? 

గత రెండు నెలల్లో సుమారు 9 ప్రధాన ప్రాంతాలకు పాత పేర్లను అధికారికంగా ఖరారు చేశారు. ఇస్లాంపురా ఇప్పుడు మళ్ళీ కృష్ణ నగర్  అయ్యింది. సున్నత్ నగర్ పేరును సంత్ నగర్ గా మార్చారు. ముస్తఫాబాద్ మళ్ళీ తన పాత పేరు  ధర్మపుర ను దక్కించుకుంది. లక్ష్మీ చౌక్.. గతంలో దీనిని మౌలానా జాఫర్ అలీ ఖాన్ చౌక్ అని పిలిచేవారు, ఇప్పుడు అధికారికంగా లక్ష్మీ చౌక్ అని పిలుస్తున్నారు. జైన్ మందిర్ చౌక్ ను  బాబ్రీ మసీదు చౌక్ గా మార్చారు.  ఆ  పేరును తొలగించి, మళ్ళీ జైన్ మందిర్ చౌక్ అని నామకరణం చేశారు.  బ్రిటిష్ కాలం నాటి క్వీన్స్ రోడ్, లారెన్స్ రోడ్ వంటివి కూడా మళ్ళీ పాత పేర్లతోనే పిలుస్తున్నారు. 

 ఎందుకీ మార్పు? నవాజ్ షరీఫ్ వ్యూహం ఏంటి?    

ఈ మార్పు వెనుక మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్  ఆలోచన ప్రధానంగా కనిపిస్తోంది. దీనికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి:  లాహోర్ ఒకప్పుడు హిందూ, సిక్కు, ముస్లిం సంస్కృతుల సమ్మేళనం. ఆ వైభవాన్ని మళ్ళీ తీసుకురావడం ద్వారా లాహోర్  అసలు గుర్తింపును కాపాడాలని షరీఫ్ భావిస్తున్నారు. పాకిస్థాన్‌ను ఒక ఉదారవాద , మైనారిటీల పట్ల గౌరవం ఉన్న దేశంగా ప్రపంచానికి చూపించుకోవడం కోసం అలాగే..   ప్రభుత్వం అధికారికంగా పేర్లు మార్చినా, లాహోర్ ప్రజలు వాడుకలో ఇప్పటికీ లక్ష్మీ చౌక్ ,  కృష్ణ నగర్  వంటి పాత పేర్లనే వాడుతున్నారు. అందుకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.    

 సాంస్కృతిక వారధి.. క్రీడల పునరుద్ధరణ 

కేవలం పేర్లు మార్చడమే కాకుండా, మింటో పార్క్  గ్రేటర్ ఇక్బాల్ పార్క్  లోని చారిత్రక క్రికెట్ గ్రౌండ్లు,  కుస్తీ అఖారాలను కూడా పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకప్పుడు భారత దిగ్గజ క్రికెటర్ లాలా అమర్‌నాథ్ , స్టార్ రెజ్లర్  గామా పహిల్వాన్ వంటి వారు ఇక్కడే శిక్షణ పొందారు. విభజనకు ముందు ఉన్న క్రీడా స్ఫూర్తిని మళ్ళీ నింపాలని ప్రభుత్వం భావిస్తోంది.  ఈ నిర్ణయంపై పాకిస్థాన్‌లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. చరిత్రకారులు, సామాజిక వేత్తలు దీనిని ఆహ్వానిస్తుండగా, మత ఛాందసవాదులు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, భవిష్యత్తులో సింధ్ , ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతాల్లో కూడా ఇటువంటి చారిత్రక పేర్లను పునరుద్ధరించే అవకాశం ఉందని సమాచారం.

 పేరు మారినంత మాత్రాన వ్యవస్థ మారుతుందా అన్నది పక్కన పెడితే, చారిత్రక వాస్తవాలను అంగీకరించడం అనేది ఒక సానుకూల పరిణామమే. లాహోర్ వీధుల్లో మళ్ళీ కృష్ణ , లక్ష్మి  వంటి పేర్లు వినిపించడం అనేది ఒక చారిత్రక వింతే అని చెప్పాలి!

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget