అన్వేషించండి

Giorgia Meloni: బార్‌లో వెయిటర్ దగ్గర నుంచి ఇటలీ ప్రధాని వరకూ - జార్జియా మెలోనీ సక్సెస్ స్టోరీ అవాక్కయ్యేలా చేస్తుంది !

Meloni Biography : ఇటలీ ప్రధాని జార్జియో మెలోనీ స్ట్రాంగ్ ఉమెన్. ఆమెకు ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మురికివాడలో పెరిగిన ఆమె చిన్న వయసులోనే సొంత పార్టీతో అధ్యక్షురాలు అయ్యారు.

Giorgia Meloni Inspiring Life Story:  జార్జియా మెలోనీ.  రాజకీయాలపై ఆసక్తి లేని వారికీ ఈ పేరు బాగా పరిచితం. ఎంత అందంగా నవ్వుతారో.. అంత కంటే ఎక్కువ స్ట్రాంగ్ గా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు.  సాదాసీదా మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా ఆమె ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం.    

రాజకీయం అంటే కేవలం వారసత్వం కాదు, అది ఒక నిరంతర పోరాటం అని నిరూపించారు జార్జియా మెలోని. ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రి. అక్కడి వరకూ చేరుకోవడానికి  ఆమె  పట్టుదల, కన్నీళ్లు ,  దశాబ్దాల కష్టం చాలా మందికి తెలియదు. ఒక సామాన్య వెయిట్రెస్‌గా కెరీర్ ప్రారంభించి, నేడు ఒక దేశాన్ని నడిపించే స్థాయికి ఆమె ఎలా చేరుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

 చిన్నప్పుడే తండ్రి వదిలేసినా.. ఒంటరి పోరాటం! 

1977లో రోమ్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో మెలోని జన్మించారు. ఆమెకు కేవలం ఏడాది వయసున్నప్పుడే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయారు. తల్లి అన్నా పెంపకంలో, ఆర్థిక ఇబ్బందుల మధ్య ఆమె బాల్యం గడిచింది. నివసించే ఇల్లు అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో, రోమ్‌లోని ఒక మురికివాడ  లో ఆమె పెరగాల్సి వచ్చింది. ఆ చిన్నతనంలో పడ్డ కష్టాలే ఆమెలో పోరాట పటిమను పెంచాయి.

 వెయిట్రెస్‌గా, నానీగా పనిచేస్తూనే.. 

మెలోని తన చదువు కోసం, కుటుంబం కోసం రకరకాల పనులు చేశారు. రోమ్‌లోని ప్రసిద్ధ నైట్‌క్లబ్‌లలో బార్టెండర్‌గా, వెయిట్రెస్‌గా పనిచేశారు. అంతేకాదు,  పిల్లలను చూసుకునే వ్యక్తి గా కూడా పనిచేశారు. ఇలా ఏ పనిని తక్కువగా చూడకుండా కష్టపడ్డారు. 15 ఏళ్ల వయసులోనే రాజకీయాల పట్ల ఆకర్షితురాలై, విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అప్పట్లోనే ఆమె మాటతీరు, నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

 అతి పిన్న వయసులోనే మంత్రిగా.. 

మెలోని రాజకీయ ప్రయాణం జెట్ స్పీడ్‌తో సాగింది. 21 ఏళ్లకే కౌన్సిలర్‌గా ఎన్నికైన ఆమె, 31 ఏళ్ల వయసులో ఇటలీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా రికార్డు సృష్టించారు. 2012లో తన సొంత పార్టీ  బ్రదర్స్ ఆఫ్ ఇటలీ ని స్థాపించి, కేవలం 10 ఏళ్లలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఆమె రాజకీయ చతురతకు నిదర్శనం. నేడు ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా ఆమె నిలిచారు.

 ప్రధాని మోదీతో స్నేహం..  మెలొడీ  ట్రెండ్! 

భారతదేశంలో మెలోనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రధాని నరేంద్ర మోదీతో ఆమెకు ఉన్న స్నేహపూర్వక సంబంధం సోషల్ మీడియాలో  Melodi  పేరుతో వైరల్ అవుతుంటుంది. ఆమె ఆత్మకథ  ఐ యామ్ జార్జియా కు ప్రధాని మోదీ ముందుమాట రాశారు. దౌత్యపరమైన బంధాల కంటే మిన్నగా, ఇద్దరు నేతల మధ్య ఉన్న గౌరవం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది.  నా మూలాలు నాకు తెలుసు, నా సిద్ధాంతాలే నా బలం అని చెప్పే మెలోని జీవితం ప్రతి మహిళకు ఒక గొప్ప లెసన్. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Strait of Hormuz: హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
US Iran Peace Deal: ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల పరిహారం..! యుద్ధంతో డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించారు?
ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల పరిహారం..! యుద్ధంతో డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించారు?
British Kashmiris Protest outside UK parliament: ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
Strait of Hormuz opens after Iran war: యుద్ధం ముగిసినా పెట్రోల్ ధరలు ఇప్పుడే దిగిరావు - ట్రంప్ చేసిన పని అలాంటిది మరి !
యుద్ధం ముగిసినా పెట్రోల్ ధరలు ఇప్పుడే దిగిరావు - ట్రంప్ చేసిన పని అలాంటిది మరి !
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Delimitation 2026: ఏపీలో కూటమి చేరికల పర్వం - పవన్ కల్యాణ్ స్పెషల్ కమిటీ.. వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమేనా?
ఏపీలో కూటమి చేరికల పర్వం - పవన్ కల్యాణ్ స్పెషల్ కమిటీ.. వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమేనా?
Strait of Hormuz: హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
Jnaneshwari Missing Case Tuni:జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
IPL Business Update: ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
PM Modi Investment Scheme Fact Check: ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
Visakhapatnam Techie Gayatri Death: ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
Wife Killed Husband: భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్‌తో క్రైమ్ స్టోరీ లీక్!
భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్‌తో క్రైమ్ స్టోరీ లీక్!
Embed widget