Pakistan Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్సులోని అట్టోక్ సమీపంలో భూకంపం సంభవించినట్లు తెలిపింది. దీనివల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లుగా ఇప్పటికింకా నమోదు కాలేదు.
పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, భూకంప లోతు 150 కిలో మీటర్ల వద్ద ఉందని, భూకంప కేంద్రం తజికిస్తాన్ అని ప్రకటించారు. ఇది మధ్యాహ్నం 12:54 గంటలకు సంభవించింది. భూకంపాల ట్రాకింగ్ చేసే స్వతంత్ర సంస్థ యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ రిపోర్టు ప్రకారం.. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్సులోని అట్టోక్ సమీపంలో భూకంపం సంభవించినట్లు తెలిపింది. దీనివల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లుగా ఇప్పటికింకా నమోదు కాలేదు. కొంత మంది పాకిస్థాని జర్నలిస్టులు చేస్తున్న ట్వీట్లలో మాత్రం వారు భూకంపాలు భారీ తీవ్రతతో (Very Strong) వచ్చాయని పేర్కొంటున్నారు.
#Earthquake possibly felt 2 min 1 sec ago in #Pakistan. Felt it? Tell us via:
— EMSC (@LastQuake) January 29, 2023
📱https://t.co/LBaVNedgF9
🌐https://t.co/AXvOM7I4Th
🖥https://t.co/wPtMW5ND1t
⚠ Automatic crowdsourced detection, not seismically verified yet. More info soon! pic.twitter.com/nXeJIW2YJ1