Imran Khan : ఇమ్రాన్ రన్ అవుట్ ఖాయం - ఆర్మీ అడ్డం పడినా మ్యాచ్ నిలబడటం కష్టమే !
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. వచ్చే వారం జరగనున్న అవిశ్వాస పరీక్షలో గట్టెక్కడం కష్టంగా మారింది. సొంత పార్టీ ఎంంపీలు తిరుగుబాటు చేస్తున్నారు.
![Imran Khan : ఇమ్రాన్ రన్ అవుట్ ఖాయం - ఆర్మీ అడ్డం పడినా మ్యాచ్ నిలబడటం కష్టమే ! Pak PM Imran Khan Faces Revolt From His Own Party Ahead Of No-Trust Vote Imran Khan : ఇమ్రాన్ రన్ అవుట్ ఖాయం - ఆర్మీ అడ్డం పడినా మ్యాచ్ నిలబడటం కష్టమే !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/24/ced137a589d1da47f8602fff509708de_original.webp?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పాకిస్తాన్ ( Pakistan ) ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ( Imran Khan ) పదవి కాలం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుంది. ఆయన పదవి నిలబడటం కష్టమని తేలిపోయింది. ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ( PTI ) కి చెందిన 24 మంది ఎంపీలు ప్రతిపక్షంతో కలిసి వెళ్లాలని నిర్ణయించకున్నారు. అంటే వారు రెబల్‌గా మారారన్నమాట. వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఇమ్రాన్ ఖాన్ ఇంటిముఖం పట్టాల్సిందే. ఈ 24 మంది ఎంపీలు చివరి రోజు అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసే వరకూ సురక్షిత ప్రాంతంలో ఉండాలని నిర్ణయించుకున్నారు.
స్టెల్త్ ఒమిక్రాన్ భారతదేశంలో మరొక వేవ్‌కు కారణం కావచ్చు, చెబుతున్న ఏపీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్
అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాలంటే 68 మంది ఎంపీల సంతకాలు అవసరం. అయితే, ప్రతిపక్ష పార్టీలకు చెందిన 100 మంది సభ్యులు ఇప్పటికే సంతకం చేశారు. ప్రస్తుతం 342 మంది సభ్యులున్న పాక్ పార్లమెంటులో( Pak Parlament ) 172 మంది ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే ప్రధాని కుర్చీ నుంచి ఆయన దిగిపోవాల్సిందే. వచ్చేవారం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇమ్రాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. నవాజ్‌షరీఫ్ సారథ్యంలోని పాకిస్తాన్ ముస్లింలీగ్ -నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలకు కలిపి 163 మంది సభ్యులు ఉన్నారు. ఇమ్రాన్ పార్టీ ఎంపీలు రెబల్స్ గా మారడంతో ఇప్పుడు ఖాన్ పదవికి గండం ఏర్పడింది.
ముఖం కాలిపోయింది, గుండె జబ్బు వేధిస్తోంది, అయినా మిస్ వరల్డ్ పోటీల్లో నిలిచి గెలిచింది
ప్రభుత్వ నిర్వహణలోనూ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో, విదేశాంగ విధానంలోనూ ఇమ్రాన్‌ఖాన్ విఫలం అయ్యారని విపక్షం ఆరోపిస్తోంది. ఇప్పటికే భారీ ర్యాలీలు నిర్వహించారు. అయితే ఇమ్రాన్ ఖాన్‌కు ఆర్మీ ( Pak Army ) సపోర్ట్ ఉంది. ఈ కారణంగా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగకుండానే ఏదో విధంగా గట్టెక్కుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రెబల్ ఎంపీలను ( Rebel MPs ) ఆర్మీ ద్వారా కిడ్నాప్ చేయించి తీసుకు రావడం లేా.. ఇతర వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒక వేళ ఆర్మీ పూర్తి స్థాయిలో సహకరించకపోతే.. ఇమ్రాన్ ఖాన్ ఇన్నింగ్స్ మధ్యలోనే క్లీన్ బౌల్డ్ అయినట్లవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)