అన్వేషించండి

Private Lander On Moon: జాబిలిపై ప్రైవేటు ల్యాండ‌ర్‌.. ఒడిస్సియ‌స్‌!

చంద‌మామ‌పై ఏముందో తెలుసుకునే కుతూహ‌లం స‌ర్వ‌త్రా పెరుగుతోంది. ఈక్ర‌మంలో చైనా, భార‌త్, అమెరికాలు పోటీ ప‌డుతున్నాయి. ఇక‌, వీటితోపాటు ప్రైవేటు సంస్థ‌లు సైతం చంద‌మామ అంచుల్ని తాకే ప్ర‌య‌త్నంచేస్తున్నాయి.

Private lander on Moon: చంద‌మామ(Moon) అందిన రోజు.. అనే పాట నిజంకానున్న‌ట్టు క‌నిపిస్తోంది. వెన్నెల‌రేడుపై ల్యాండర్ల(landers) పరంపర కొనసాగుతోంది. జపాన్(Japan) ‘మూన్ స్నైపర్’(moon snyper) తర్వాత తాజాగా చంద్రుడిపై అమెరికా(America)లోని టెక్సాస్(Texas) రాష్ట్రంలోని హూస్టన్(Hustan) కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు సంస్థ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’(Intutive mechines) రూపొందించిన ‘ఒడిస్సియస్’(Odysseus) (నోవా-సీ శ్రేణి) ల్యాండర్ చంద‌మామ‌ ఉపరితలంపై దక్షిణ ధ్రువం(South poll) చేరువలోని ‘మాలాపెర్ట్-ఏ’(Malapert-A) బిలంలో ల్యాండైంది. తొలుత ల్యాండర్ నేవిగేషన్ వ్యవస్థలోని లేజర్ రేంజిఫైండర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మిషన్ కంట్రోల్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు ఆందోళన చెందారు. దీంతో ల్యాండర్ దిగాల్సిన నిర్దేశిత సమయంలో కొంత జాప్యం సంభవించినప్పటికీ భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4:53 గంటలకు అది క్షేమంగా చంద్రుడిపై దిగింది. 

అస‌లేంటిది?

‘ఒడిస్సియస్’(Odysseus) (నోవా-సీ శ్రేణి) ల్యాండర్ చంద‌మామ‌(Moon) ఉపరితలం(Surface)పై దక్షిణ ధ్రువం చేరువలోని ‘మాలాపెర్ట్-ఏ’(Malapert-A) బిలంలో ల్యాండవ‌డంతో ‘మాలాపెర్ట్ -ఏ’ అనేది ఏంట‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. చంద్రుడి దక్షిణ ధృవానికి 300 కిలోమీటర్ల దూరంలో 85 డిగ్రీల దక్షిణ అక్షాంశ ప్రాంతంలో నెలకొన్న ఓ చిన్న బిలమే మాలాపెర్ట్‌-ఏ. బెల్జియంకు చెందిన 17వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్త చార్లెస్ మాలాపెర్ట్ పేరును దానికి పెట్టారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి అతి సమీపంలో దిగిన వ్యోమనౌకగా చరిత్ర సృష్టించిన ‘ఒడిస్సియస్` ఆ విషయంలో గత ఏడాది మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండర్ పేరిట ఉన్న రికార్డును అధిగ‌మించింది. ఈ మానవరహిత అంత‌రిక్ష‌యాత్రకు మిషన్ ‘ఐఎం-1’గా నామకరణం చేశారు. జీవితకాలం ఏడు రోజులే కావ‌డం గ‌మ‌నార్హం. పూర్తిగా ఓ ప్రైవేటు కంపెనీ తయారీ-నిర్వహణలో ల్యాండర్ ఒకటి చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగడం ఇదే తొలిసారి. ‘ఒడిస్సియస్’ నిటారుగా దిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.  100 కిలోల బరువైన ఐదు ‘నాసా’ పరికరాలు, ఇతర వాణిజ్య సంస్థలకు చెందిన ఆరు శాస్త్రీయ పరికరా(పేలోడ్స్)ల‌ను ఇది మోసుకు వెళ్లింది. 

డేటా సేక‌ర‌ణే కీల‌కం!

చంద‌మామ‌పై ‘ఒడిస్సియస్’(Odysseus) జీవితకాలం కేవలం ఏడు(Seven) రోజులు(Days) మాత్ర‌మే. మరో వారం రోజుల్లో అది దిగిన ప్రదేశంలో సూర్యాస్తమయం(Sunsets) అవుతుంది. దీనిని బ‌ట్టి ల్యాండర్ పనిచేయడానికి సౌరశక్తి(Solarpower) లభించదు. చంద్రుడి ఉపరితలంతో అంతరిక్ష వాతావరణం చర్యనొందే విధానం, రేడియో ఆస్ట్రానమీ, చంద్రావరణానికి సంబంధించిన డేటాను ‘నాసా’ పేలోడ్స్ సేకరించనున్నాయి.  ఈ నేపథ్యంలో ‘ఒడిస్సియస్’ సేకరించే సమాచారం కీలకం కానుంది. చంద్రుడిపైకి ప్రైవేటు ల్యాండర్లను ప్రయోగించడానికి ఉద్దేశించిన తన కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రాజెక్టులో భాగంగా ‘నాసా’ వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఈ మిషన్ కాంట్రాక్టును ‘ఇంట్యూటివ్ మెషీన్స్’కు అప్ప‌గించింది.

పారామీట‌ర్స్ ఇవీ..

‘ఒడిస్సియస్’ ల్యాండర్ ఎత్తు(Hight) 4 మీటర్లు కాగా, వెడల్పు(Width) సుమారు 2 మీటర్లు. ప్రయోగ సమయంలో ల్యాండర్ బరువు(Weight) 1,908 కిలోలు. ఈ నెల 15న ఫ్లోరిడా(Florida)లోని కేప్ కెనెవరాల్ నుంచి కెన్నెడీ అంతరిక్ష కేంద్రం వేదికగా ఇలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్-ఎక్స్’కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో దాన్ని ప్రయోగించారు. భూమి నుంచి చూస్తే చంద్రుడిలో కనిపించే 62 దశలు, అంతరిక్షంలోని ఇతర ప్రాంతాల నుంచి చూస్తే చంద్రుడిలో అగుపించే మరో 62 దశలు, ఒక చంద్రగ్రహణం... మొత్తం కలిపి చంద్రుడి 125 దశలను ప్రతిబింబించే సూక్ష్మ శిల్పాలను ల్యాండరులో అమర్చిన‌ట్టు తెలిపారు.  ఈ శిల్పాలకు అరిస్టాటిల్, లియోనార్డో డా విన్సీ, గాంధీ, డేవిడ్ బౌయీ, బిల్లీ హాలిడే తదితరుల పేర్లు పెట్టారు. 

ప‌క్క‌కు ఒరిగిందా?

ఒడిస్సియ‌స్(Odysseus) ల్యాండ్‌ అయ్యే సమయంలో చంద్రుని ఉపరితలాన్ని నిర్దేశించని రీతిలో తాకింది. దీంతో ల్యాండర్‌ కాస్త పక్కకు ఒరిగినట్లు నాసా తెలిపింది. చంద్రుని దక్షిణ ధృవంలోని క్రేటర్‌ మలాపెర్ట్ -ఏ సమీపంలో ఒడిస్సియస్‌ ల్యాండ్‌ అయింది.  ల్యాండ్‌ అయిన తర్వాత భూమికి సిగ్నల్స్‌ పంపేందుకు ఒడిస్సియస్‌ కొంత సమయం తీసుకుంది. అయితే ల్యాండింగ్‌ సమయంలో తలెత్తిన ఇబ్బందితో కాస్త పక్కకు ఒరిగినప్పటికీ ఒడిస్సియస్‌లోని అన్ని కమ్యూనికేషన్‌ వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నట్లు ఇంట్యూటివ్‌ మెషిన్స్‌ సీఈవో స్టీవ్‌ ఆల్టిమస్‌ తెలిపారు. ఒడిస్సియస్‌ ల్యాండ్‌ అయిన చోట నీరు గడ్డకట్టి మంచు రూపంలో ఉండటంతో భవిష్యత్తు పరిశోధనలకు ఇది ఒక లూనార్‌ బేస్‌గా పనికొస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాంమంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Rave తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
PSLV C60: ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
Best Annual Prepaid Plans: ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే 365 రోజులు తిరిగి చూడక్కర్లేదు - ఏది బెస్ట్ ప్లాన్?
ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే 365 రోజులు తిరిగి చూడక్కర్లేదు - ఏది బెస్ట్ ప్లాన్?
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Embed widget