Nobel Prize Literature: నార్వే రచయిత జాన్ ఫోసేకి నోబెల్ సాహిత్య పురస్కారం, ప్రకటించిన అకాడమీ
Nobel Prize Literature: నార్వేకి చెందిన జాన్ ఫోసేకి సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారం వరించింది.
Nobel Prize Literature 2023:
ఒక్కో రంగానికి సంబంధించి నోబెల్ పురస్కారాలు ప్రకటిస్తోంది స్వీడిష్ అకాడమీ. ఈ ఏడాదికి సాహిత్య రంగంలో ( Nobel Prize in Literature) నార్వేకి చెందిన రచయిత జాన్ ఫోసేకి ( Author Jon Fosse) ఈ పురస్కారం అందజేశారు. సాహిత్యంలో ఆయన చేసిన విశేష సేవలకు గానూ...నోబుల్ పురస్కారం ఇస్తున్నట్టు ప్రకటించింది.
This year’s #NobelPrize laureate in literature Jon Fosse was born in 1959 on the Norwegian west coast. His immense œuvre is written in Norwegian Nynorsk and spans a variety of genres consisting of plays, novels, poetry collections, essays, children’s books and translations. pic.twitter.com/0esbbHi88A
— The Nobel Prize (@NobelPrize) October 5, 2023
నార్వేలోని వెస్ట్‌కోస్ట్‌లో 1959లో జన్మించారు జాన్ ఫోసే. ప్రస్తుతం ఆయన వయసు 64 ఏళ్లు. ఎన్నో నాటకాలు, నవలలు, కవితలు, వ్యాసాలతో పాటు బాల సాహిత్యాన్నీ అందించారు. కొన్ని అనువాద రచనలూ చేశారు. ఈయన రచించిన నాటకాలను ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ప్రదర్శించారు. నాటకాలతో పాటు ఆయన నవలలూ బాగా ప్రాచుర్యం పొందాయి. జానర్ ఏదైనా ఆయన రచనలన్నీ మనిషి ఎదుర్కొంటున్న రకరకాల పరిస్థితుల చుట్టూనే ఉంటాయని, అదే థీమ్‌తో ఆయన అద్భుతమైన రచనలు అందించారని స్వీడిష్ అకాడమీ ప్రశంసించింది. ఆయన రైటింగ్ స్టైల్‌కి చాలా మంది అభిమానులున్నారు. అంతే కాదు. ఆయన రచనా శైలికి "Fosse minimalism" అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఈ పురస్కారం రావడంపై జాన్ ఫోసే స్పందించారు. ఈ ప్రకటన వినగానే ఒక్కసారిగా భయం వేసిందని వెల్లడించారు."ఈ పురస్కారం రావడం నిజంగా నమ్మలేకపోతున్నాను. వినగానే మొదట భయం వేసింది. ఇది నాకు వచ్చిన పురస్కారంగా కాకుండా..సాహిత్యానికి వచ్చిన అవార్డుగానే భావిస్తున్నాను"
- జాన్ ఫోసే, నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత
Jon Fosse – awarded the 2023 #NobelPrize in Literature – is today one of the most widely performed playwrights in the world and has become increasingly recognised for his prose.
— The Nobel Prize (@NobelPrize) October 5, 2023
The human condition is the central theme of Fosse’s body of work, irrespective of genre.
రసాయన శాస్త్రంలో అత్యుత్తమ సేవలు అందించిన ముగ్గురు శాస్త్రవేత్తలను ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డు వరించింది. కెమిస్ట్రీలో ఈ ఏడాదికి గానూ ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను అమెరికా శాస్త్రవేత్తలు మౌంగి బవెండి, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్ లకు నోబెల్ బహుమతి ప్రకటించారు. క్వాంటమ్ డాట్స్ కనుగొనడంతో పాటు వాటి విశ్లేషణపై ప్రయోగాలు చేసినందుకు ఈ ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ వరించింది. అతి సూక్ష్మమైన నానో పార్టికల్స్ ఈ క్వాంటమ్ డాట్స్. వీటిని కనుగొనడం, విశ్లేషించడంలో పరిశోధనలు చేసినందుకుగానూ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలను కెమిస్ట్రీలో నోబెల్ వరించింది.
Also Read: మగాడు మగాడే మహిళ మహిళే, జెండర్‌పై రిషి సునాక్ వివాదాస్పద వ్యాఖ్యలు