Viral Video : మన సీరియల్స్ అంటే నైజీరియన్లకు అంత కామెడీనా ? ఏం చేశారో తెలుసా ?
భారత సీరియళ్లలో సీన్లను కామెడీ చేసి లక్షల వ్యూస్ సంపాదించుకుంటున్నారు నైజీరియన్లు. వారి వీడియోలు ఇండియాలోనూ వైరల్ అవుతున్నాయి.
హిందీ టీవీ సీరియల్స్ ఒక్క ఇండియాలోనే కాదు చాలా దేశాల్లో పాపులర్. అనేక దేశాల్లో తమ భాషలోకి డబ్బింగ్ చేసుకుని ఆయా దేశాల్లోని చానెళ్లు టెలికాస్ట్ చేస్తూంటాయి . అంత పాపులారిటీ ఉన్న టీవీ సీరియళ్ల మీద సెటైర్లు కూడా రావడం సహజమే. తాజాగా నైజీరియాకు చెందిన కొంత మంది భారత టీవీ సీరియళ్లపై ఓ స్కిట్ రూపొందించి సోషల్ మీడియాలో పెట్టారు. అంతే అది ఒక్క సారిగా బ్లాస్ట్ అయిపోయింది. కామెడీ గా వైరల్ అయిపోయింది. అది చూడటానికి ఆతిశయోక్తిలా ఉంటుంది కానీ.. టీవీ సీరియల్స్‌లో అలాగే ఉంటుందని ఎక్కువ మంది కామెంట్లు పెడుతున్నారు.
డైలీ సీరియల్స్‌లో స్లోమోషన్స్ చాలా ఎక్కువ. అదే సమయంలో కొన్ని క్యారెక్టర్లు స్లో మోషన్లో... మరికొన్ని క్యారెక్టర్లు సూపర్ ఫాస్ట్‌గా ఉంటూంటాయి. అలాంటి సీన్లనే నైజీరియన్లు మాకింగ్ చేశారు. టీవీ సీరియల్‌లో కోడలు మెట్లు ఎక్కుతూ ఉంటుంది. కామె ఆమె కాలు జారి కిందపడబోతూ ఉంటుంది. ఆ పడేది వెంటనే పడిపోరు.. స్లో మోషన్‌లో మూవ్ అవుతూ ఉంటారు. ఈ లోపు ఆమె కింద పడుతున్నారని తెలుసుకుని .. అత్తనో.. అమ్మనో హీరోకి ఫోన్ చేసి చెబుతారు. హీరో శరవేగంగా ఎక్కడ ఉన్నా సరే వచ్చి పడిపోతున్న హీరోయిన్ నడుం మీద చేయి వేసి కాపాడతారు. ఇలాంటి సీన్లు సినిమాల్లోనూ చూసి ఉండవచ్చు. అందుకే నైజీరియన్లు ఈ కాన్సెప్ట్‌తో కామెడీ వీడియో చేశారు.
To Ekta Kapoor, with love, from Nigeria pic.twitter.com/lqMS957yyj
— Khalid Baig (@KhalidBaig85) April 1, 2022
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద ఎత్తున నెటిజన‌్లు స్పందిస్తున్నారు. భారత టీవీ సీరియళ్ల గురించి తెలిసిన వారందరూ నిజమేనని రియాక్ట్ అవుతున్నారు. చాలా మంది బాలాజీ టెలీఫిల్మ్ ఓనర్ ఏక్తాకపూర్‌కు ఈ కామెడీ వీడియోను ట్యాగ్ చేస్తున్నారు.
Better than Indian serial 🤣🤣🤣 Part 2 pic.twitter.com/5RmAWXE5Pi
— Donald Duck (@kkcement678) April 3, 2022
నిజానికి సీరియళ్లలో ఆ సీన్లు ఎంత మాత్రం కామెడీ కాదు. ప్రేక్షకులు సీన్ అయిపోయే ఉగ్గబట్టుకుని చూస్తారు. ఆమె కింద పడుతుందా లేదా. హీరో వచ్చి కాపాడుతారా లేదా అని ఒకటే ఉత్కంఠకు గురవుతున్నారు. అందుకే ఆ సీరియళ్లు ఇక్కడ హిట్టవుతున్నాయి. బయట కామెడీ అవుతున్నాయి.