NASA OSIRIS-REx: భూమిని చేరిన గ్రహశకలం నమూనా- ఫలించిన ఏడేళ్ల నిరీక్షణ, నాసా మొదటి మిషన్ సక్సెస్
నాసా సేకరించిన గ్రహశకలం నామూనా భూమిని చేరింది. ఏడేళ్ల క్రితం సేకరించిన ఈ గ్రహశకలం నమూనాలు... మూడేళ్ల ప్రయాణం తర్వాత భూమికి చేరాయి. ఉటా ఎడారిలో పారాచూట్ ద్వారా భూమిపై ల్యాండ్ అయ్యాయి.
అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక ఘట్టం జరిగింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా... అంతరిక్ష నౌక బెన్నూ అనే గ్రహశకలం నుంచి కొన్ని నమూనాలు సేకరించింది. ఆ శాంపిల్స్ భూమిని చేరాయి. ఈ గ్రహశకలం నమూనాను పరిశీలిస్తే... 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం సూర్యుడు మరియు గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి అనే దాని గురించి మరింత సమాచారం సేకరించే అవకాశం ఉంటుందని నాసా భావిస్తోంది.
గ్రహశకలం నమూనాలు తీసుకొచ్చేందుకు OSIRIS-REx అనే మిషన్‌ను సెప్టెంబర్ 8, 2016న ప్రారంభించింది నాసా. ఇది డిసెంబర్ 2018లో బెన్నూను చేరుకుంది. OSIRIS-REx రెండు సంవత్సరాల పాటు గ్రహశకలాన్ని మ్యాప్ చేసిన తర్వాత... 2020లో బెన్నూ నుండి రాళ్లు, ధూళిని సేకరించింది. మే 10, 2021న... OSIRIS-REx బెన్నూ పరిసరాల నుండి బయలుదేరింది. బెన్నూ అంతరిక్షంలో ఏడేళ్లు గడిపారు.
OSIRIS-REx మిషన్‌లో ప్రత్యేకత ఏమిటంటే అంతరిక్ష నౌక భూమిపైకి దిగదు. భూమికి సుమారు లక్ష కిలోమీటర్ల ఎత్తులో నుంచే నమూనా క్యాప్సూల్ విడుదల చేసింది. సరిగ్గా ఈ సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకు ఈ ప్రక్రియ జరిగింది. OSIRIS-REx మిషన్ విడుదల చేసిన గ్రహశకలం నమూనా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల 25నిమిషాలకు ఉటా ఎడారిలో పారాచూట్ ద్వారా ల్యాండ్ అయ్యింది. అంతరిక్ష నౌక నమూనాను విడుదల చేసిన 20 నిమిషాల తర్వాత ఇంజిన్లను మండించుకుని... అపోఫిస్ ఆస్టరాయిడ్ పయనమైంది. ఈ వ్యోమనౌక 2029లో ఆస్టరాయిడ్‌ను చేరుకుంటుంది.
బెన్నూని ముందుగా 1999 RQ36 అని పిలిచేవారు. OSIRIS-REx అంటే ఆరిజిన్స్, స్పెక్ట్రల్ ఇంటర్‌ప్రెటేషన్, రిసోర్స్ ఐడెంటిఫికేషన్ అండ్ సెక్యూరిటీ- రెగోలిత్ ఎక్స్‌ప్లోరర్. OSIRIS-REx భూమి వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత... నమూనా రిటర్న్ క్యాప్సూల్‌ను విడుదల చేసింది. అవి ప్యారాచూట్ ద్వారా ఉటా ఎడారిలో ల్యాండింగ్ అయ్యాయి. వీటిని ముందుగా ఉటా ఎడారి పరిధిలోని తాత్కాలిక క్లీన్ ల్యాబ్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత... క్లోజ్‌చేసిన కంటైనర్‌లో ఉంచి హ్యూస్టన్‌కు తరలిస్తారు. గ్రహశకలం నమూనా బరువు 250 గ్రాములు ఉంటుందని అంచనా. క్యాప్సూల్‌లోని 75శాతం భాగాన్ని భవిష్యత్ పరిశోధన కోసం... హ్యూస్టన్‌లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో భద్రపరుస్తారు. మిగిలిన నమూనాను పరిశోధిస్తారు. వాటి ఫలితాలు 2025లోపు వచ్చే అవకాశం ఉంది. OSIRIS-REx మిషన్ను కూడా OSIRIS-APEXగా పేరు మార్చించింది నాసా.
TOUCHDOWN! The #OSIRISREx sample capsule landed at the Utah Test and Training Range at 10:52am ET (1452 UTC) after a 3.86-billion mile journey. This marks the US's first sample return mission of its kind and will open a time capsule to the beginnings of our solar system. pic.twitter.com/N8fun14Plt
— NASA (@NASA) September 24, 2023
బెన్నూ గ్రహశకలం నమూనాలు పరిశోధిచి.. సౌర వ్యవస్థ ఎలా ఏర్పడింది..? ఎప్పుడు ఏర్పడింది అనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్తులో భూమిపై ప్రభావం చూపగల గ్రహశకలాలను బాగా అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుందని చెప్తున్నారు. OSIRIS-REX యొక్క నమూనా తిరిగి రావడం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థకు మైలురాయిగా నిలుస్తుంది. ఎందుకంటే ... గ్రహశకలం నమూనాను భూమికి తిరిగి తెచ్చిన మొట్టమొదటి మిషన్ ఇదే.