NASA Feels ISRO Strong Competitor: ఇండియా చంద్రుడి మీద చేసిన ప్రయోగాలనే నాసా దాటాలనుకుంటుందా ?
ISRO and NASA: 21 వ శతాబ్దంలో సాంకేతికతను అందిపుచ్చుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో చంద్రుడిపై అప్పటివరకూ ఎవ్వరూ చేయని ప్రయోగాలను చేసింది.
చంద్రుడిపైకి మనిషి పంపి యాభై ఏళ్లు పూర్తి
1972తర్వాత చంద్రుడిపై ప్రయోగాలు చేయని నాసా
అపోలో మిషన్స్ నిలిపివేసి స్వస్తి పలికిన నాసా
చంద్రయాన్ ప్రయోగాలతో చంద్రుడిపై ఇస్రో జెండా
మామ్ ప్రయోగంతోనూ రికార్డులు బద్దలు కొట్టిన ఇస్రో
మిషన్ మార్స్ కు ఇస్రో పోటీ అని నాసా భావిస్తోందా..?
యాభై ఏళ్ల తర్వాత చంద్రుడిపై ప్రయోగాలు దేనికి సంకేతం
చంద్రుడి మీదకు మనిషిని నాసా పంపించి యాభై ఏళ్లు గడుస్తోంది. 1972 డిసెంబర్ తర్వాత చంద్రుడి వైపు చూడని నాసాకు ఇప్పుడెందుకు ఇన్నేళ్ల తర్వాత చంద్రుడు గుర్తొచ్చాడు. దీనికి కారణాలు మనం గత వీడియోలో చెప్పుకున్నాం. కానీ ఆ వీడియోలో మాట్లాడని అంశం ఒకటి ఉంది. అదే చంద్రుడి మీద భారత్ చేస్తున్న ప్రయోగాలు. చైనాలానో, రష్యాలోనో భారత్ ఏమీ అమెరికాకు శత్రుదేశం కాదు. జార్జ్ బుష్ తర్వాత వచ్చిన ఒబామా, ట్రంప్, ఇప్పుడు జో బెడైన్ అంతా భారత్ తో సఖ్యతో ఉన్నవారే. అయితే అగ్రరాజ్యం అమెరికాది వేరో ఓ తరహా. వాళ్లదంతా పెట్టుబడిదారీ విధానమే. 1972 లో వాళ్ల దేశాల నుంచి వినిపిస్తున్న వ్యతిరేకతలు, బడ్జెట్ లోటుతో చంద్రుడిపై ప్రయోగాలను నాసా ఆపేసింది. అయితే 21 వ శతాబ్దంలో సాంకేతికతను అందిపుచ్చుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో చంద్రుడిపై అప్పటివరకూ ఎవ్వరూ చేయని ప్రయోగాలను చేసింది.
2008లో చంద్రయాన్ 1..
2008 లో ప్రయోగించిన చంద్రయాన్ 1 ద్వారా మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ను పంపించి చంద్రుడి సౌత్ పోల్ ను ఢీకొట్టింది. అక్కడ చిన్న పాటి బొరియను ఏర్పరచి దానికి జవహర్ పాయింట్ అని పేరు పెట్టింది. రెండేళ్ల పాటు అక్కడ ప్రయోగాలు జరపటం ద్వారా చంద్రుడి లోపలి పొరల్లో ఉన్న నీటి జాడలను స్పష్టంగా గుర్తించింది భారత్. మూన్ మినరాలజీ మ్యాప్ ను తయారు చేయటం ద్వారా వాటర్ మాల్యుకూల్స్ ఉన్నాయా లేదా అన్న డౌట్స్ ను చెరిపి పారేశింది చంద్రయాన్ 1. ఈ ప్రాజెక్ట్ కోసం ఇస్రో పెట్టిన ఖర్చు 386 కోట్ల రూపాయలు. నాసా పెట్టే ఖర్చుతో పోలిస్తే ఇది ఇది చాలా తక్కువ.
2014లో మంగళ్‌యాన్ మిషన్
2014 లో మార్స్ ఆర్బిటర్ మిషన్ - మామ్ లేదా మంగళ్ యాన్ పేరుతో ఓ స్పేస్ క్రాఫ్ట్ ను 2014 సెప్టెంబర్ లో మార్స్ కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగింది ఇస్రో. నాసా, రష్యన్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా నిలిచింది భారత్. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం భారత్ చేసిన ఖర్చు 450 కోట్ల రూపాయలు. ఇప్పటివరకూ మార్స్ కక్ష్యలోకి పెట్టిన స్పేస్ క్రాఫ్ట్స్ లో అతి తక్కువ ఖర్చుతో చేరుకుంది మంగళ్ యాన్ మాత్రమే.
2019లో ఇస్రో చంద్రయాన్ 2..
2019లో ఇస్రో మరో ప్రయోగం కూడా చేసింది. అదే చంద్రయాన్ 2. ఇప్పటివరకూ మనిషి కాలు మోపేందుకు సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని టార్గెట్ చేసింది భారత్. అక్కడ రోవర్‌ను నడిపించటం ద్వారా పరిస్థితులను తెలుసుకోవాలని భావించింది. కానీ విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ అయేప్పుడు ఏర్పడిన టెక్నికల్ గ్లిచ్ కారణంగా ప్రజ్ఞాన్ రోవర్ క్రాష్ బయటకు రాక... చంద్రయాన్ 2 అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఈ పరిణామాలన్నింటినీ నాసా గమనిస్తూనే ఉంది.
2030 కల్లా అంగారకుడిపైకి అంతరిక్ష యాత్రికులను పంపించాలనేది నాసాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్లాన్. ఈ లోపు డీప్ స్పేస్ మీద పరిశోధనలకు ఎక్కువ నిధులు కేటాయించటం, ఫెడరల్ గవర్నమెంట్స్ తో ఉన్న ఇబ్బందులు కారణంగా నాసా తిరిగి చంద్రుడి మీద కాన్సట్రేట్ చేయలేకపోయింది. ఇఫ్పుడు ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు పోటీలోకి వచ్చేశాయి. ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్, జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్, రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ ఎలా ఎవరికి వారే అంతరిక్ష పోటీల్లో మాకు మేమే పోటీ అని చెప్పుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ లాంటి దేశాలకు కూడా అవకాశాలను వదిలేసి తమకున్న క్రెడిబులిటీనీ, కెపాసిటీని నాసా కోల్పోవాలని అనుకోవట్లేదనేది విశ్లేషకుల అంచనా.
యాభై సంవత్సరాల తర్వాత ఆర్టెమిస్ ప్రాజెక్ట్ ద్వారా వరుసగా మూడు రాకెట్ ప్రయోగాలు జరిపి చంద్రుడిని భూమికి ఆల్టర్నేటివ్ లాంచ్ ప్యాడ్ లా మార్చుకోవాలనేది ఇప్పుడు నాసా ముందున్న లక్ష్యం. అందుకే ప్రపంచదేశాలకు ఆహ్వానం పంపి మరీ తన ఆర్థిక ఇబ్బందులను దాటుకుంటూ ఆర్టెమిస్ ప్రాజెక్ట్ ద్వారా మరో సారి తన సత్తా చాటాలని చూస్తోంది.
Also Read: NASA Artemis 1: నాసా ఆర్టెమిస్ 1లో మనుషులని ఎందుకు పంపట్లేదు - 2&3 దశలలో ఏం చేస్తారు ?
Also Read: NASA Artemis 1: 1972 తర్వాత చంద్రుడిపైకి ఎవరూ ఎందుకెళ్లలేదు ! 50 ఏళ్ల తర్వాత మళ్లీ నాసానే ప్రయోగాలు