NASA Artemis 1: నాసా ఆర్టెమిస్ 1లో మనుషులని ఎందుకు పంపట్లేదు - 2&3 దశలలో ఏం చేస్తారు ?
NASA's Artemis 1 Mission: ఆర్టెమిస్ ప్రాజెక్టులో నాసా ది కీలక భాగమైన్పపటికీ మిగతా స్పేస్ ఏజెన్సీలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. నాసానే ఈ అవకాశాన్ని కల్పించింది.
ఆర్టెమిస్ 1 ప్రయోగానికి సర్వం సిద్ధం
నేడు (ఆగస్టు 29న) నింగికెగసేందుకు రెడీ
మూడు దశల్లో నాసా ఆర్టెమిస్ ప్రాజెక్ట్
ఆర్టెమిస్ 2 కోసం 2024లో ఏర్పాట్లు
ఆర్టెమిస్ 3 కోసం 2025లో ఏర్పాట్లు
ఓ మహిళను, ఓ నల్లజాతీయుడిని చంద్రుడిపైకి
మానవ ప్రత్యామ్నాయ స్థావరంగా ఆర్టెమిస్
2025 నాటి కల్లా చంద్రుడి మీద ఉన్న సౌత్ పోల్ మీదకు మనిషిని చేర్చటమే ఆర్టిమెస్ మిషన్ లక్ష్యం. అందుకే దాదాపు యాభై ఏళ్ల తర్వాత మళ్లీ నాసా ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ ను చేపట్టింది. చంద్రుడి మీద స్థావరాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే, అక్కడి నుంచి మార్స్ సహా అనేక అంతరిక్ష పరిశోధనలు చేసేందుకు వీలవుతుంది. అదే నాసా ప్లాన్.
ఆర్టెమిస్ అంటే..
ముందుగా ఆర్టెమిస్ అంటే ఓ గ్రీకు దేవత. ఇంతకు ముందు నాసా చంద్రుడి మీదకు ప్రయోగాలు చేసిన ప్రాజెక్ట్ పేరు అపోలో. ఆ అపోలోకు ఈ ఆర్టెమిస్ గ్రీకు పురాణాల ప్రకారం సోదరి వరుస. సో అందుకే అపోలో తర్వాతి ప్రాజెక్ట్ కు ఆర్టెమిస్ పేరు పెట్టారు. గ్రీకు పురాణాల ప్రకారం చంద్రుడి అధిదేవత కూడా ఆర్టెమిస్.
నాసాతో పాటు మరిన్ని స్పేస్ ఏజెన్సీలు..
ఆర్టెమిస్ ప్రాజెక్టులో నాసా ది కీలక భాగమైన్పపటికీ మిగతా స్పేస్ ఏజెన్సీలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. నాసానే ఈ అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు ఆర్టెమిస్ లో కీలకంగా వ్యవహరించనున్న ఓరియన్ క్యాప్యూల్స్ నిర్వహణలో కీలకపాత్ర పోషించేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అంతే కాదు ఆర్టెమిస్ అకార్డ్స్ పేరుతో మిగిలిన దేశాలు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావచ్చని ఎప్పుడూ లేని విధంగా నాసా ఓ ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చింది.
ఆర్టెమిస్ లక్ష్యాలు..
ఆర్టెమిస్ మెయిన్ టార్గెట్ మనం అనుకున్నట్లు 2025 నాటికి చంద్రుడి మీద ఇప్పటివరకూ వెళ్లని దక్షిణ భాగం మీద మనిషి కాలు మోపించాలని. అంతే కాదు తొలిసారిగా ఓ మహిళను, ఓ నల్లజాతీయుడిని కూడా చంద్రుడి మీదకు పంపించాలనేది ఆర్టెమిస్ లో లక్ష్యాల్లో ఒకటి.
మొత్తం మూడు స్టేజ్ ల్లో ఆర్టెమిస్ ప్రాజెక్ట్ ను చేపట్టాలని నాసా భావిస్తోంది
ఆర్టెమిస్ 1, 2 అండ్ 3.
ఆర్టెమిస్ -1 ను ఆగస్ట్ 29న ప్రయోగించనున్నారు
ఆర్టెమిస్-2 మిషన్ 2024లో ప్రయోగం
ఆర్టెమిస్-3 మిషన్ 2025లో ప్రయోగించేందుకు ప్రణాళికలు
నేడు ప్రయోగం..
ముందు ఆర్టెమిస్ 1 ను ఈ ఆగస్టు 29న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. ఆ రాకెట్‌ను స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) అని పిలుస్తున్నారు. దాదాపు 100 మీటర్ల పొడవున్న ఈ రాకెట్‌ను కెన్నడీ స్పేస్ సెంటర్‌లోని తయారీ భవనం నుంచి భారీ ట్రక్ మీద పెట్టి లాంచ్ పాడ్ 39బికి తరలించారు.
వ్యోమగాములు, సిబ్బంది ఎవరూ ఉండరు..
నేడు (ఆగస్టు 29న) జరుగుతున్న రాకెట్ ప్రయోగంలో వ్యోమగాములు, సిబ్బంది ఎవరూ రాకెట్‌లో ఉండరు. ఇది జస్ట్ టెస్ట్ ట్రయిల్ లా అన్నమాట. బట్ తర్వాతి మిషన్లలో అంతరిక్షయాత్రికులను చంద్రుడి మీదకు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అపోలో మిషన్ల కోసం ఉపయోగించిన 'సాటర్న్ 5' రాకెట్ల కన్నా కొత్త ఎస్‌ఎల్ఎస్ రాకెట్లకు 15 పర్సెంట్ ప్రెషర్ ఎక్కువ బేర్ చేయగలుగుతుంది. సో కేవలం వ్యోమగాములను మాత్రమే కాకుండా.. వారు ఎక్కువ కాలం పాటు భూమికి దూరంగా ఉండటానికి అవసరమైన పరికరాలు, సరకులను కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్లగలదు. అంతే కాదు వ్యోమగాములు ఉండే క్రూ కాప్స్యూల్ సామర్థ్యం కూడా పెరిగింది. దీనిని 'ఓరియాన్' అని పిలుస్తున్నారు. 1960లు, 70ల నాటి కమాండ్ మాడ్యూళ్లతో పోలిస్తే.. ఓరియాన్ వెడల్పు మరో మీటరు పెరిగింది. ప్రజెంట్ ఓరియాన్ వెడల్పు 5 మీటర్లుగా ఉంది.
నేడు (సోమవారం) రాకెట్ ను ప్రయోగిస్తారు. ఒకవేళ వాతావరణం ప్రతికూలించి పోస్ట్ పోన్ అయితే సెప్టెంబర్ 2వ తేదీన ప్రయోగించటానికి ప్రయత్నిస్తారు. ఆ రోజు కూడా వీలు కాకపోతే సెప్టెంబర్ 5న మూడోసారి ప్రయత్నిస్తారు. మొదటి స్టేజ్ లో మనం ఇందాక క్యాప్సూల్ అనుకున్నాం కదా ఓరియాన్ దాన్ని చంద్రుడి వెనుక కక్ష్యలోకి పంపించి.. అక్కడి నుంచి తిరిగి భూమి మీదకు రప్పించటానికి ప్రోగ్రామ్ చేశారు. ఆర్బిట్ లోకి వెళ్లిన తిరిగి ఓరియాన్ భూమ్మీదకు వచ్చేస్తుంది. కాలిఫోర్నియా దగ్గర పసిఫిక్ సముద్రంలోకి పడేలా చేయటంతో ఈ ఆర్టిమెస్ 1 సక్సెస్ అయినట్లు అవుతుంది.
రెండేళ్ల తర్వాత 2024లో ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా వ్యోమగాములను పంపిస్తాం. 2025లో ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా మళ్లీ మనుషులు చంద్రుడు మీద దిగుతారని నాసా భావిస్తోంది. ఆర్టెమిస్ 3 లో మొదటిసారిగా ఓ మహిళను చంద్రుడి మీదకు పంపాలని ప్లాన్ చేస్తోంది నాసా. ఇందాక మాట్లాడుకున్నాం కదా....2030ల నాటికి అంగారకుడి మీదకు అంతరిక్షయాత్రికులను పంపించటానికి సంసిద్ధమయ్యే క్రమంలో భాగంగా నాసా ఈ మూన్ మిషన్‌ను పునఃప్రారంభించిందనేది స్పష్టం.
Also Read: NASA Artemis 1: 1972 తర్వాత చంద్రుడిపైకి ఎవరూ ఎందుకెళ్లలేదు ! 50 ఏళ్ల తర్వాత మళ్లీ నాసానే ప్రయోగాలు