Mass Shooting In New York: అమెరికాలో మరోసారి కాల్పుల మోత- పది మంది చనిపోయినట్టు సమాచారం
అమెరికా కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లింది. న్యూయార్క్‌లోని మార్కెట్‌లో జరిగిన ఘటనలో పది మంది వరకు మరణించినట్టు తెలుస్తోంది.
న్యూయార్క్‌లోని బఫెలోలోని ఒక సూపర్ మార్కెట్‌లో శనివారం మధ్యాహ్నం ముష్కరుడు కాల్పులు జరపడంతో పది మంది మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముష్కరుడు రైఫిల్, బాడీగార్డ్‌ను ధరించాడు. టాప్స్ ఫ్రెండ్లీ మార్కెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన వ్యక్తికి సహరించిన వారి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.
షూటింగ్‌కు పాల్పడిన వ్యక్తి... తాను చేస్తున్న పనిని వీడియో షూట్ చేశాడని... ఆ విజువల్స్‌ను వేరే వ్యక్తులు చూస్తూ ఉండవచ్చని.. ఈ సంఘటన మొత్తం లైవ్ ద్వారా వాళ్లు చూసి ఉంటారని అధికారులు తెలిపారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, ఈ సంఘటనకు ప్రధాన ఉద్దేశం ఇంకా తెలియలేదని అధికారి వెల్లడించాడు. జాతి విద్వేషంతో కాల్పులు జరిపారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.
BREAKING: BPD on scene of a mass shooting at the Tops in the 1200 block of Jefferson Avenue. Police say multiple people have been struck by gunfire. The shooter is in custody. Motorists and residents are urged to avoid the area.
— Buffalo Police Dept (@BPDAlerts) May 14, 2022
తన స్వస్థలమైన బఫెలోలోని కిరాణా దుకాణంలో షూటింగ్ దుర్ఘటనను నిశితంగా పరిశీలిస్తున్నట్లు గవర్నర్ కాథీ హోచుల్ ట్వీట్ చేశారు.
నల్లజాతీయుల పరిసరాల్లో బఫెలో డౌన్‌టౌన్‌కు ఉత్తరాన 5 కి.మీ దూరంలో సూపర్ మార్కెట్ ఉంది. ఫ్యామిలీ డాలర్ స్టోర్, అగ్నిమాపక కేంద్రం దీనికి సమీపంలో ఉన్నాయని AP వార్తా సంస్థ తెలిపింది.
I am closely monitoring the shooting at a grocery store in Buffalo. We have offered assistance to local officials. If you are in Buffalo, please avoid the area and follow guidance from law enforcement and local officials.
— Governor Kathy Hochul (@GovKathyHochul) May 14, 2022
షూటర్ అదుపులో ఉన్నారని ఒక ట్వీట్‌లో బఫెలో పోలీసులు ధృవీకరించారు, కానీ అతనిని గుర్తించలేదన్నారు. సాక్షులను ఉటంకిస్తూ... నిందితుడు "మిలిటరీ తరహా దుస్తులు" ధరించినట్లు ఒక అధికారి AP వార్త సంస్థకు తెలిపారు.
షూటర్ వెళ్లిపోతున్నప్పుడు స్థానికులు అతన్ని గమనించారు. అతను పాతికేళ్ల లోపు వాడని.. తెల్లగా ఉన్నాడని తెలిపారు. అతను నల్లటి హెల్మెట్ ధరించి, రైఫిల్‌గా కనిపించిన దానిని మోసుకెళ్లాడని పేర్కొన్నారు.
"అతను గడ్డం మీద తుపాకీ పెట్టుకొని నిలబడి ఉన్నాడు. ఏం జరుగుతుందో అని మేము అలా ఉండిపోయాం. ఈ పిల్లవాడి ముఖానికి తుపాకీ ఎందుకు ఉంది అని ఆలోచిస్తూ చూస్తున్నామని ?" కెఫార్ట్ చెప్పినట్లు ఏపీ వార్తా సంస్థ తెలిపింది. పోలీసులు దగ్గరకు రాగానే నిందితుడు మోకాళ్లపై పడిపోయాడు. "తన హెల్మెట్‌ను తీసివేసి అతని తుపాకీని పక్కన పెట్టేశాడు. తర్వాత అతన్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు."