అన్వేషించండి

Israel-Hamas War: గాజాలో బిస్కెట్ ప్యాకెట్‌ ధర 2400 రూపాయలు! ద్రవ్యోల్బణం దుస్థితిపై సోషల్ మీడియా పోస్టు వైరల్

Israel Hamas War Effect: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం గాజాలో ప్రజల జీవితాలను దుర్భరం చేసింది. ఆహార ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Israel Hamas War Effect: ఈ ద్రవ్యోల్బణం సమయంలో భారతదేశంలో 5 రూపాయల బిస్కెట్ ప్రజల ఆకలిని తీరుస్తుంది. అయితే, ప్రపంచంలో 5 రూపాయల బిస్కెట్ ధర 2400 రూపాయలకు చేరుకున్న ప్రదేశం కూడా ఉంది. గాజాకు చెందిన మహ్మద్ జవాద్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజాలో కరవు ఏర్పడింది. గాజాలో బిస్కెట్ 2400 రూపాయలకు అమ్ముడవుతోంది. గాజా నుంచి ఇటీవల వైరల్ అయిన ఒక పోస్‌లో ఒక వ్యక్తి ఒక బిస్కెట్ 24 యూరోలు అంటే రూ.2,342 కంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతోందని పేర్కొన్నాడు. బిస్కెట్ ధర తెలుసుకున్న చాలా మంది సోషల్ మీడియాలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మహ్మద్ జవాద్ పోస్ట్ వైరల్ అవుతోంది

గాజాకు చెందిన మహ్మద్ జవాద్ తన X ఖాతాలో పోస్ట్ చేస్తూ, "చాలా కాలం తర్వాత, ఈ రోజు నేను రవిఫ్ కోసం తనకు ఇష్టమైన బిస్కెట్లు ఇవ్వగలిగాను. అయితే, దాని కాస్ట్‌ కూడా 1.5 యూరోల నుంచి 24 యూరోలకు పెరిగింది, కాని నేను రవిఫ్‌కు ఇష్టమైన  బిస్కెట్ ఇవ్వడానికి నిరాకరించలేకపోయాను." అని పోస్టు చేశాడు.  దీనికి తోడు తన చిన్న కుమారుడితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. అందులో తన బిడ్డ బిస్కెట్‌లు పట్టుకున్నట్టు ఉంది.  


Israel-Hamas War: గాజాలో బిస్కెట్ ప్యాకెట్‌ ధర 2400 రూపాయలు! ద్రవ్యోల్బణం దుస్థితిపై సోషల్ మీడియా పోస్టు వైరల్

గాజాలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది

అక్టోబర్ 2023లో ఉద్రిక్తతలు పెరగడం, వెంటనే ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభమైన తరువాత, గాజా ఆహార పదార్థాలకు ప్రాధాన్యత తగ్గింది. ఈ సంవత్సరం మార్చి 2 నుంచి మే 19 వరకు, దిగ్బంధంలో ఉన్న పాలస్తీనా ప్రాంతం ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. చాలా వరకు అంతర్జాతీయ ఒత్తిడితో పరిమిత సంఖ్యలో ట్రక్కులను మాత్రమే అనుమతించారు,  

అంతేకాకుండా గాజాలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. కొన్ని ముఖ్యమైన వస్తువులను భారతదేశంలో ధరలతో పోల్చి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకు, ఒక కిలో చక్కెర గాజాలో దాదాపు 5 వేల రూపాయలకు అమ్ముడవుతోంది. వంట నూనె దాదాపు 4100 రూపాయలకు లీటరు. ఒక కిలో బంగాళాదుంపలు దాదాపు 2 వేల రూపాయలు, ఒక కిలో ఉల్లిపాయలు దాదాపు 4500 రూపాయలు.

అసలు ఏం జరిగింది?

2023 అక్టోబర్‌ 7న గాజా స్ట్రిప్‌లోని హమాస్‌ ఉగ్రవాద సంస్థ 'ఆపరేషన్ అల్‌-ఆక్సా ఫ్లడ్‌' పేరిట దక్షిణ ఇజ్రాయెల్‌పై భారీ దాడి ప్రారంభించింది. వేల రాకెట్లు ప్రయోగించడమే కాకుండా గాజా-ఇజ్రాయెల్‌ సరిహద్దు కంచెను ధ్వంసం చేసి, హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ గ్రామాల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో సుమారు 1200 మంది ప్రజలు, ముఖ్యంగా సాధారణ పౌరులు, చిన్నారులు, మహిళలు, 360 మంది యువతులు ఒక్క మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌ దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లింది. అక్కడి నుంచి ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా!

దాదాపు ఏడాదిన్నర తర్వాత 2025 జనవరిలో ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా మిగిలిన బందీలను దాదాపు 1900 పాలస్తీనియన్‌ ఖైదీలను కూడా  విడుదల చేశారు. మానవీయ సహాయం గాజాకు చేరేలా చర్యలు తీసుకున్నారు. కాల్పులు విరమణ ఒప్పందం జరిగినా మళ్లీ మళ్లీ దాడులు జరుగుతున్నాయి.  

గాజాలో ఇప్పటికీ మిలియన్లు మంది నిరాశ్రయులుగా మారారు. ఆహార కొరత,, వైద్య సదుపాయాల లేమితో బాధపడుతున్నారు. ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య సంబంధాలు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. భద్రతా పరిస్థితి మెరుగుపడలేదు. యుద్ధం కారణంగా వందల గ్రామాల, పట్టణాలు శిథిలమయ్యాయి. పునర్నిర్మాణం, పునరావాసం పెద్ద సవాలుగా మారింది. యుద్ధ నేరాల ఆరోపణలు, అంతర్జాతీయ విచారణ కొనసాగుతున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget