అన్వేషించండి

Ukrain Drone Attack: రష్యాకు హాలీవుడ్ మూవీని లైవ్‌లో చూపించిన యుక్రెయిన్‌- ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ ఎలా చేశారంటే..?

Ukrain War:గ్రీకు మైథాలజీలో ట్రోజన్ హార్స్ అనే ఘట్టం ఉంటుంది. హాలీవుడ్ మూవీ Troy సినిమాలో కూడా చూపిస్తారు. అచ్చం అలాంటి సినిమాను చూపించింది రష్యాకు యుక్రెయిన్. మన ఊహకు కూడా అందని రీతిలో ప్లాన్ చేసింది

Ukrain Drone Attack: యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయంలో .. ఓ శత్రు దేశంలోకి చెక్కపెట్టెల్లో  డ్రోన్లను స్మగుల్ చేసి.. వాళ్ల సెక్యూరిటీ ఏజన్సీ ఆఫీసు దగ్గరే ఓ సీక్రెట్ కమాండ్ సెంటర్ పెట్టి.. అక్కడ నుంచి అర్థరాత్రి  భారీ ట్రక్కులలో ఈ ఉడెన్ కంటెనర్లను ఆ దేశంలోని వైమానిక స్థావరాల వద్దకు చేర్చి..  రిమోట్ కంట్రోల్ ద్వారా ఉడెన్ కంటెనర్లు  తెరిచి..  అందులో నుంచి ఒక్కసారిగా చిన్న చిన్న డ్రోన్లను పైకి లేపి.. ఒకే సారి ఐదు ప్లేసుల్లో 40 విమానాలను బాంబులతో పేల్చేస్తే… ? ఊహిస్తుంటే ఇదొక హాలీవుడ్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీలా ఉంది కదా.. కానీ యుక్రెయిన్ ఈ సినిమాను రష్యాకు ఆదివారం రాత్రి నిజంగా లైవ్‌లో  చూపించింది…

యుక్రెయిన్‌ ఒకేసారి ఐదు ప్రాంతాల్లో రష్యాలోని వైమానిక స్థావరాలపై దాడులు జరపడం రష్యానే కాదు.. అందరినీ షాక్‌కు గురి చేసింది. 18 నెలల ఈ మెటిక్యులస్ టాస్క్‌ను యుక్రెయిన్ అధ్యక్షుడు  జెలెన్‌స్కీ Volodymyr Zelenskyy “బ్రిలియంట్ ఆపరేషన్” అని పొగిడారు. ఈ టాస్స్‌ను విజయవంతంగా పూర్తి చేయడమే కాదు.. దానిని చేసిన వాళ్లు సేఫ్‌గా తిరిగి యుక్రెయిన్ కూడా వచ్చేశారు.

అచ్చం.. హాలీవుడ్‌ మూవీలాగానే..

నిన్న రాత్రి రష్యా మీద యుక్రెయిన్  అమలు పరిచిన  చేసిన ప్లాన్ ముందు ఏ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్స్ కూడా సరిపోవు.. KGB కి దొరక్కుండా ఏడాదిన్నర పాటు ఒక ప్లాన్ execute చేయడం అంటే మాటలు కాదు..  అసలు ఈ ప్లాన్ Modern warfare ఏ విధంగా మారి పోయిందో  కూడా చెప్తోంది. వాళ్ళ భూమి పై నుంచే వాళ్ళ మీద ఎటాక్ చేయాలనుకోవడం మామూలు విషయం కాదు.. ఇది ఏమాత్రం బయటకు వచ్చినా ఇక అంతే సంగతులు. ఎంత మెటిక్యులస్ ప్లాన్ అంటే.. ఇది.. ఈ ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ రష్యా  సెక్యూరిటీ ఏజన్సీ FSB కార్యాలయానికి సమీపంలోనే ఉండటం అసలైన హైలైట్. ఇక ఫ్యూచర్ లో వార్ అంటే మనం పెళ్లిళ్లలో ఎగరేసేంత చిన్న డ్రోన్ తో చేయొచ్చు అని ఉక్రెయిన్ నిరూపించింది. రష్యాకు 117డ్రోన్స్ స్మగ్లింగ్ చేసి.. అక్కడ నుంచే వాటిని ట్రక్స్‌లో airbase ల వద్దకి పంపి.. వాటి పక్కన నుంచే పేల్చేశారు.  పెద్ద పెద్ద చెక్క కంటైనర్స్ లో డ్రోన్స్ రిమోట్ ద్వారా తలుపు తెరిస్తే.. పైకి లేవడం ..  మామూలుగా ఐతే సినిమాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. కానీ ఉక్రెయిన్ నిజంగానే అలా చేసింది. కనీసం ఆ ట్రక్కుల డ్రైవర్లకు కూడా అందులో ఏమున్నాయో తెలిసే అవకాశం లేదు.


Ukrain Drone Attack: రష్యాకు హాలీవుడ్ మూవీని లైవ్‌లో చూపించిన యుక్రెయిన్‌- ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ ఎలా చేశారంటే..?

Operation Spider’s Web:

యుక్రెయిన్ అత్యంత సీక్రెట్‌గా నిర్వహించిన ఈ ఆపరేషన్‌కు Operation Spider’s Web అని పేరు పెట్టారు. దాదాపు ఏడాదిన్నర పాటు నిర్వహించిన ఈ కోవర్ట్ ఆపరేషన్‌ లో ఒకేసారి దాడులు మొదలు పెట్టింది యుక్రెయిన్. ఈ దాడిలో 41 రష్యన్ బాంబర్లు ధ్వంసం అయినట్లు యుక్రెయిన్ సెక్యూరీటీ ఏజన్సీ SBU ప్రకటించింది.  రష్యాకు 60వేల కోట్ల రూపాయలకు  (7 బిలియన్ డాలర్లు)పైగా నష్టం వాటిల్లింది.  Belaya (4700 km from Ukraine), Dyagilevo (700 km), Olenya (2000 km), Ivanovo (900 km) ల్లోని లక్ష్యాలను ఒకేసారి చేధించారు. యుక్రెయిన్‌లో నుంచే సైబీరియాలో ఉన్న ఎయిర్‌బేస్‌ను కూడా ధ్వంసం చేశారు. ఈ దాడిలో Tu-95  Tu-22 స్ట్రాటజిక్ బాంబర్లతో పాటు.. A-50 రాడార్ డిటెక్షన్ సెంటర్లు నాశనం అయ్యాయి. డ్రోన్లు రష్యా ఎయిర్‌ క్రాఫ్ట్‌లను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఇంటర్‌నెట్ లో కనిపిస్తున్నాయి.

 

ట్రోజన్ హార్స్- Trojan Horse:

ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గ్రీకు మైథాలజీలో ఓ కథను గుర్తుకు తెస్తుంది. Troy నగరంపై దాడి చేయడానికి గ్రీకు వీరులు ఏ విధంగా వెళ్లారో ఆ కథ చెబుతుంది. Bradpitt నటించిన Troy మూవీలో కూడా ఆ సీన్ ఉంటుంది. ట్రాయ్ నగరంతో సంధి కుదుర్చుకున్నాం అని చెప్పిన గ్రీకులు తాము యుద్ధాన్ని విరమించాం అనడానికి గుర్తుగా.. వారి కోట గోడ ముందు ఓ కొయ్య గుర్రాన్ని ఉంచుతారు. దానిని ట్రాయ్ సైనికులు లోపలకు తీసుకెళ్తారు. కానీ ఆ కొయ్య గుర్రంలోనే దాక్కున్న గ్రీకు వీరులు.. ట్రాయ్ నగరం లోపల ఊచకోత కోస్తారు. ఇది అచ్చం అలాగే ఉందని వార్ విశ్లేషకులు అంటున్నారు.


Ukrain Drone Attack: రష్యాకు హాలీవుడ్ మూవీని లైవ్‌లో చూపించిన యుక్రెయిన్‌- ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ ఎలా చేశారంటే..?

ఆధునిక యుద్ధం మారిపోయిందా..?

యుక్రెయిన్ దాడి చేసిన రీతి చూసిన తర్వాత.. Modern Warfare పూర్తిగా మారిపోయిందన్న మాట వినిపిస్తోంది. యుక్రెయిన్ ఈ దాడికి చాలా చిన్న డ్రోన్లను వినియోగించింది. మనం ఫంక్షన్లు, పెళ్లిళ్లలో వాడుతున్న డ్రోన్లనే ఇందుకు ఉపయోగించారు. చాలా చోట్ల యుద్ధాల్లో వాడుతున్న UAVలను ఇక్కడ వాడలేదు. ఓ కంటెనర్లలో పదుల కొద్దీ డ్రోన్లను ప్యాక్ చేసి రష్యాకు పంపారు. ఈ విషయాన్ని యుక్రెయిన్ తనకు సాయం చేస్తున్న అమెరికాకు కూడా చెప్పలేదు.. రష్యా చేత యుద్ధాన్ని ఆపుచేయించడానికి ఏం చేయాలో అదంతా చేస్తాం.. అని యుక్రెయిన్ అధ్యక్షుడు  జెలెన్స్ స్కీ అంటున్నారు. “ రష్యా యుద్ధాన్ని మొదలుపెట్టింది. రష్యానే యుద్ధాన్ని ఆపాలి” అని స్టేట్‌మెంట్ ఇచ్చారు.  అంతేకాదు… యుక్రెయిన్ ఈ దాడి విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. యుక్రెయిన్‌పై మిస్సైల్ అటాక్ చేస్తున్న యుద్ధ విమానాలనే వీళ్లు టార్గెట్ చేసుకున్నారు. రష్యా వద్ద 100 వరకూ బాంబర్స్ ఉన్నాయంటున్నారు. 40కి పైగా విమానాలను ధ్వంసం చేయడం అంటే.. వాళ్ల సామార్థ్యాన్ని మూడోవంతుకు తగ్గించడమే. అంతే కాదు… TU  విమానాల ఉత్పత్తిని కూడా ఇప్పుడు రష్యా ఆపేసింది. అంటే వీటిని భర్తీ చేయడం కూడా సాధ్యం కాదు.

ఈ ఆపరేషన్ కోసం యుక్రెయిన్ 117 ఫస్ట్ పర్సన్ వ్యూ FPV డ్రోన్లను వాడింది. వీటి కాస్ట్ ఒక్కోటి జస్ట్ 4000 డాలర్లు మాత్రమే. అంటే మూడున్నర లక్షలు మాత్రమే.  వాణిజ్య పరంగా వాడే ఈ డ్రోన్లను మిలట్రీ  కోసం మార్చేసింది యుక్రెయిన్. చాలా తక్కువ ఖర్చుతో ఇతిపెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.  రష్యాకు జరిగిన భారీ నష్టంతో పోలిస్తే.. యుక్రెయిన్ ఖర్చు చేసింది.. చాలా చాలా తక్కువ.

  • సరిహద్దుల నుంచి 4300 కిలోమీటర్ల లోపలకు వెళ్లి దాడి చేయడం
  • డ్రోన్లను రష్యాలోకి డంప్ చేయడం
  • మూవింగ్ ప్లాట్ ఫామ్ మీద నుంచి డ్రోన్లను ప్రయోగించడం..

ఇలా అన్ని రకాలుగా యుక్రెయిన్ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ ఇందులో కనిపిస్తుంది.  అంతే కాదు.. ఆ దాడులు చేసిన టైమింగ్ కూడా ముఖ్యమే. కచ్చితంగా రెండో విడత శాంతి చర్చలు టుర్కియేలో మొదలవుతున్న రోజు జెలెన్‌స్కీ ఈ ప్లాన్ అమలు పరిచాడు. దీని ద్వారా చర్చల్లో పై చేయి సాధించాలన్నది అతని ఉద్దేశ్యం.

మనం ఎందుకు ఆందోళన చెందాలి..?

కేవలం యుక్రెయన్ యుద్ధ నైపుణ్యం గురించి మాత్రమే కాదు.. మనం కూడా దీని గురించి ఆలోచించాల్సింది ఉంది. అతిచిన్న డ్రోన్లతో ఇంత పెద్ద దాడి జరిగినప్పుడు.. ఈ ప్లాన్ ను ఇదే విధంగా మన శత్రువులు అమలు చేసే వీలుంది. ముఖ్యంగా పాకిస్థాన్ గురించి..! అక్రమంగా ఇండియాలోకి ఆయుధాలు పంపుతున్న ఆ దేశం ఇలాంటి డ్రోన్లను పంపితే.. జరిగే నష్టం ఎక్కువ.  ఈ నష్టాన్ని ఎలా నివారించాలి.. అన్న దానిపై మన  మిలటరీ వ్యూహకర్తలు చర్చించాలి.మనకే కాదు.. చాలా దేశాలకు ఇది సమస్య అవుతుంది. దీనిని ఎదుర్కోవడం మిలటరీ వ్యూహకర్తలకు చాలా పెద్ద టాస్క్ గా మారనుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Maruti Brezza లేదా Nissan Magnite లలో ఏ SUV బెటర్- ధర, ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Maruti Brezza లేదా Nissan Magnite లలో ఏ SUV బెటర్- ధర, ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Shocking News: పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Embed widget