అన్వేషించండి

బాలికపై అత్యాచారం చేసి, ఆపై కాల్చి చంపి - హమాస్‌ ఉగ్రవాదుల దారుణాలు

Israel Palestine Attack: హమాస్ దాడుల సమయంలో జరిగిన దారుణాల గురించి ఓ వైద్యుడు షాకింగ్ విషయాలు చెప్పాడు.

Israel Palestine War:

బాలికపై అత్యాచారం..

అక్టోబర్ 7వ తేదీన తెల్లవారుజామున ఉన్నట్టుండి ఇజ్రాయేల్‌పై దాడులు మొదలు పెట్టారు హమాస్ ఉగ్రవాదులు. ఈ దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇజ్రాయేల్. వెంటనే పౌరులను రక్షించేందుకు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపింది. ఈ సమయంలో కొంత మంది వైద్యులూ రంగంలోకి దిగి గాయపడ్డవారికి చికిత్స అందించారు. వీళ్లలో ఒకరు సంచలన విషయాలు వెల్లడించారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వైద్యుడు హమాస్ ఉగ్రవాదులు ఎలా దాడి చేశారో చెప్పాడు. ఆ సమయంలో తన కళ్లారా కొన్ని దారుణాలనూ చూసినట్టు వివరించాడు. ఓ బాలికను హమాస్ ఉగ్రవాదులు బంధించి అత్యాచారం చేసి ఆ తరవాత చంపేసినట్టు షాకింగ్ విషయాలు చెప్పాడు. ఆ తరవాత సౌత్ ఇజ్రాయేల్‌లో పరిస్థితులు మరింత ఆందోళకరంగా మారాయని అన్నాడు. గాజా, ఇరాన్‌, హిజ్బుల్లా ఇలా మూడు వైపుల నుంచి దాడులు మొదలయ్యాయి. అయినా తమ టీమ్‌ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అందరికీ వైద్యం అందించేందుకే ప్రయత్నించామని చెప్పాడు ఆ వైద్యుడు. ఇజ్రాయేల్‌లోని ప్రజలు ప్రశాంతంగా బతకాలన్నదే తమ లక్ష్యమని, అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నామని వివరించాడు. మిగతా దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఉంటే ప్రపంచం మౌనంగా ఉండేదా అని అసహనం వ్యక్తం చేశాడు. ఇరాన్ ప్రభుత్వం హమాస్ ఉగ్రవాదులతో మాట్లాడి ఈ దాడులు చేయకుండా ఆపుతుందన్న నమ్మకం ఉందని అంటున్నాడు. ఇప్పటికే చాలా మంది ఎక్స్‌పర్ట్‌లు ఈ యుద్ధాన్ని తక్షణమే ఆపేయాలని సూచించారు. అన్ని దేశాలూ ఒక్కతాటిపైకి వచ్చి ఈ దాడుల్ని కట్టడి చేయాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget