అమెరికాలో పాలస్తీనా మద్దతుదారుల నిరసనలు, వందలాది మంది అరెస్ట్
Israel Palestine Attack: యుద్ధం ఆపేయాలంటూ అమెరికాలో పాలస్తీనా మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.
Israel Palestine Attack:
పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన..
హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో (Israel Hamas War) ఇజ్రాయేల్‌కి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది అమెరికా. ఇప్పటికే జో బైడెన్ ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో (Benjamin Netanyahu) భేటీ అయ్యారు. టెల్ అవీవ్‌లో పర్యటించారు. అయితే..అటు అమెరికాలో మాత్రం పాలస్తీనా మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. తక్షణమే ఇజ్రాయేల్, హమాస్ యుద్ధాన్ని ఆపేయాలని నినదించారు. వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 300 మందిని అదుపులోకి తీసుకున్నారు. యుద్ధాన్ని ఆపేయాలంటూ నినదించారు. ఆందోళనలు చేసిన వారిలో కొందరు జూదులు కూడా ఉన్నారు. ఈ నిరసనల కారణంగా US Capitol వద్ద గందరగోళం నెలకొంది. లోపలికి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. మెయిన్ ఎంట్రెన్స్ మూసేశారు. ఎవరూ లోపలికి రాకుండా ఆంక్షలు విధించారు. విజిటర్స్‌కి కూడా లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చారు. కేవలం ఒకే ఒక తలుపుని తెరిచి ఉంచారు. అందులో నుంచే లోపలకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. క్యాపిటల్ బిల్డింగ్‌ని వీలైనంత వరకూ సేఫ్‌గా ఉంచేందుకు ప్రయత్నించారు పోలీసులు. పెద్ద ఎత్తున మొహరించారు. చుట్టూ కంచెలు, బారికేడ్‌లు ఏర్పాటు చేశారు.
#WATCH | Washington, DC: A large group of protesters have taken over inside the US Capitol. Access to US Capitol, restricted after arrests at Gaza ceasefire protest.
— ANI (@ANI) October 18, 2023
US Capitol Hill Police says "Arrests in the Canon Rotunda and the rolling road closures are ongoing. Amongst… pic.twitter.com/4n3pURept5
ఆ దాడి తరవాతే..
గాజాలో హాస్పిటల్‌పై దాడి జరిగిన ఘటనలో 500 మంది పౌరులు బలి అయ్యారు. దీన్ని నిరసిస్తూనే పాలస్తీనా మద్దతుదారులు ఈ ఆందోళనలు చేపట్టారు. ఎవరూ లోపలికి రావడానికి వీల్లేదని అధికారులు తేల్చి చెప్పారు. క్రమంగా అందరినీ అరెస్ట్ చేశారు. ఉద్రిక్తతలు చోటు చేసుకుండా జాగ్రత్తపడ్డారు. అమెరికాలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిరసనలు జరిగాయి. గాజా హాస్పిటల్ దాడి తరవాత ఇవి మరింత ఉద్ధృతమయ్యాయి. యూఏఈతో పాటు బహ్రెయిన్ ఈ దాడి చేసింది ఇజ్రాయేల్ అని ఆరోపించాయి. అటు ఇజ్రాయేల్ మాత్రం ఇది తమ పని కాదని తేల్చి చెబుతోంది. హమాస్ ఉగ్రవాదుల పనేనని ఆధారాలనూ చూపించింది.
#WATCH | Chicago, Illinois: Chicago Coalition for Justice in Palestine (CJP) and other pro-Palestinian groups hold an emergency protest to condemn the Israeli bombing of a Palestinian hospital in Gaza.
— ANI (@ANI) October 18, 2023
(Source: Reuters) pic.twitter.com/budTXmYrLF
Also Read: గాజాకు వంద మిలియన్ డాలర్ల సాయం, ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్