అన్వేషించండి

U.S రెడ్‌లైన్ దాటితే మేమేంటో చూపిస్తాం... ఇరాన్ తీవ్ర హెచ్చరికలు

IRGC Reaction: ఇరాన్‌ను అంతం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలను ఆ దేశం తిప్పి కొట్టింది. అమెరికా గీత దాటితే అంతే రీతిలో సమాధానం ఇస్తామని IRGC హెచ్చిరించింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇరాన్ 'రెడ్ లైన్స్' దాటితే, ప్రతిస్పందన ప్రాంతం దాటి విస్తరిస్తుంది.
  • అమెరికా దాడి చేస్తే, ఇరాన్ చమురు రిఫైనరీలను ధ్వంసం చేస్తుంది.
  • ట్రంప్, నాగరికత నాశనం అవుతుందని ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు.
  • హార్ముజ్ జలసంధిపై ఇరాన్ మొండి పట్టుదల, ఉద్రిక్తతలను పెంచుతోంది.

US IRAN WAR:  అమెరికా “రెడ్ లైన్స్” దాటితే, తమ ప్రతిస్పందన ప్రాంతం దాటి విస్తరిస్తుందని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హెచ్చరించింది, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  తాజా బెదిరింపుల మధ్య  ఇరాన్ ప్రతిఘటన ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ఈ అర్ఖరాత్రి తర్వాత ఏం జరుగుతోందో అన్న ఆందోళనను ఇరాన్ రియాక్షన్ మరింత పెంచింది. ఇరాన్ ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న మీడియా ద్వారా ఈ ప్రకటన వెలువడింది, హోర్ముజ్ జలసంధిపై తాము చెప్పినట్లు వినకపోతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తామంటూ వాషింగ్టన్ హెచ్చరికలు చేస్తున్న తరుణంలోనే ఈ సమాధానం వెలువడింది. పరిస్థితి అదుపు తప్పితే, తెహ్రాన్ మిత్రపక్షాలు బాబ్ ఎల్-మండెబ్ జలమార్గం మూసివేయడానికి కూడా కదలవచ్చని  ఇరానియన్ వర్గాలు రాయిటర్స్‌తో తెలిపాయి, ఇది గనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు అంతరాయం జరుగుతుదని భయాలు రేకెత్తుతున్నాయి. 

IRGC హెచ్చరిక

ఇరాన్ తమతో చర్చలు జరుపుతోందని.. తమ షరతులకు లొంగుతుందని కొన్ని రోజులుగా ట్రంప్ చేస్తున్న ప్రచారం ఒట్టిదే అని తేలిపోయింది. తమ మాట వినకపోతే.. ఇరాన్ నాగరికతే లేకుండా చేస్తామన్న తీవ్రమైన హెచ్చరికలు IRGC లక్ష్య పెట్టలేదు. అమెరికా తమపై దాడి చేస్తే.. రిటార్ట్ అదే రీతిలో ఉంటుందని IRGC తెలిపింది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి జరిగితే, అది కేవలం ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా మరింత విస్తరిస్తుందని హెచ్చరించింది.

అమెరికా ఎలాగైతే.. తమ పవర్‌హౌస్‌లను, బ్రిడ్జిలను కూల్చేస్తామని చెబుతోందో అదే రీతిలో అమెరికా, దాని మిత్ర దేశాల చమురు రిఫైనరీలను ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరానియన్ దళాల పరిధిని, సామర్థ్యాన్ని అమెరికా నాయకులు తక్కువ అంచనా వేస్తున్నారని  దానికి ఫలితం కూడా అనుభవిస్తారని హెచ్చరించారు.

వెనక్కి తగ్గని ట్రంప్ 

కొన్ని రోజులుగా ప్రతి రోజూ.. ఇరాన్ ను టార్గెట్ చేస్తున్న ట్రంప్.. మరోసారి అదే స్థాయిలో హెచ్చరికలు చేశారు. తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్‌లో, పరిస్థితి మరింత దిగజారితే ఒక మొత్తం నాగరికత నాశనం అవుతుందని కూడా ట్రంప్ హెచ్చరించారు.
ప్రపంచ చరిత్రలో ఇది అత్యంత ముఖ్యమైన క్షణాలలో ఒకటిగా అభివర్ణిస్తూ, ఒక ప్రధాన మలుపు రాబోతోందని ఆయన సూచించారు. 

పెరుగుతున్న ఉద్రిక్తతలు
హార్ముజ్ జలసంధిపై తన మొండి పట్టుదలను ఇరాన్ వీడనాడాలంటూ ట్రంప్ విధించిన గడువు భారత కాలమాం ప్రకారం బుధవారం తెల్లవారుజాముకు ముగుస్తుంది. ఇప్పటికే అమెరికా భారీ వైమానిక దాడికి సన్నద్ధమవుతోంది. పెద్ద సంఖ్యలో బాంబర్లు, F-35లు ఇరాన్‌వైపు వెళుతున్నాయి. తెల్లారే సరిక ఏం జరుగుతోందో అన్న ఆందోళన పెరుగుతోంద. ఈ పరిస్థితిల్లో ఇరాన్ వ్యాఖ్యలు పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి, 

టాప్ హెడ్ లైన్స్

IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
United States IRAN War: 'ఒక్క సైనికుడు మా భూభాగంలో అడుగుపెట్టినా కాళ్లు నరికేస్తాం' అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ 
'ఒక్క సైనికుడు మా భూభాగంలో అడుగుపెట్టినా కాళ్లు నరికేస్తాం' అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ 
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget