అన్వేషించండి

74 Lashes For Singing Without Hijab: ఇరాన్‌లో అంతే..హిజాబ్ లేకుండా పాట పాడిందని సింగర్‌కు 74 కొరడా దెబ్బలు!

Iran Islamic Penal Code: హిజాబ్ లేకుండా పాట పాడినందుకు ఇరాన్ యువ గాయని పరాస్తూ అహ్మదీకి 74 కొరడా దెబ్బల శిక్ష విధించింది ఇరాన్ కోర్టు . ఈ తీర్పు ఇప్పుడు వైరల్‌గా మారింది.

Human Rights Violations In Iran:  హిజాబ్ ధరించకుండా  పాట పాడినందుకు గాను ఇరాన్‌కు చెందిన 29 ఏళ్ల యువ గాయని పరాస్తూ అహ్మదీ  కి అక్కడి కోర్టు 74 కొరడా దెబ్బల   కఠిన శిక్ష విధించింది. ఇరాన్‌లోని కోమ్ ప్రావిన్స్ కోర్టు ఈ వివాదాస్పద తీర్పును వెలువరించింది. డిసెంబర్ 2024లో ఆమె హిజాబ్ లేకుండా యూట్యూబ్‌లో లైవ్‌స్ట్రీమ్ చేసిన ఒక మ్యూజిక్ కాన్సెర్ట్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి వైరల్‌గా మారడమే ఈ శిక్షకు కారణం. ఆమెతో పాటు ఆ మ్యూజిక్ ప్రొడక్షన్‌లో పాల్గొన్న మరో ఎనిమిది మంది సంగీతకారులకు కూడా కోర్టు ఇదే శిక్షను ఖరారు చేసింది.
  
 కొరడా దెబ్బలతో పాటు రెండేళ్ల నిషేధం 

ఇరాన్ లో విప్లవ గీతం లాంటిదైన ఫ్రమ్ ద బ్లడ్ ఆఫ్ ద యూత్ ఆఫ్ ద హోమ్‌ల్యాండ్ అనే పాటను పరాస్తూ అహ్మదీ హిజాబ్ లేకుండా ఆలపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే ఇరాన్ అధికారులు ఆమెను, ఆమెతో పాటు ఉన్న ముస్లిం మ్యూజిషియన్లను అప్పట్లోనే కొద్దిరోజులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత విడుదల చేశారు. అయితే, ఆ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా ఇస్లామిక్ విలువలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ సైబర్ , క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజా తీర్పు ప్రకారం.. 74 కొరడా దెబ్బలతో పాటు, ఆయా కళాకారులందరిపై రెండేళ్ల పాటు దేశం విడిచి వెళ్లకుండా ట్రావెల్ బ్యాన్ విధించారు. అంతేకాకుండా, రాబోయే రెండేళ్ల వరకు వారు ఎలాంటి కళాత్మక కార్యక్రమాలు  చేయకూడదని కోర్టు ఆంక్షలు విధించింది.

  ఇరాన్ పెనాల్ కోడ్ ఏం చెబుతోంది? 

ఇరాన్ ప్రాసిక్యూటర్లు ఈ కేసులో ఇస్లామిక్ పీనల్ కోడ్‌లోని ఆర్టికల్ 638, కంప్యూటర్ క్రైమ్స్ లా లోని ఆర్టికల్ 743 ను ఉపయోగించారు. బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ లేకుండా తిరగడం  మతపరమైన నిషిద్ధ చర్య  కిందకు వస్తుందని ఆర్టికల్ 638 చెబుతోంది. అలాగే డిజిటల్ నెట్‌వర్క్‌ల ద్వారా సమాజంలో నైతికతను దెబ్బతీసే, అశ్లీలమైన కంటెంట్‌ను ప్రచారం చేయడం నేరమని ఆర్టికల్ 743 స్పష్టం చేస్తోంది. ఇరాన్ అధికారిక టాస్నిమ్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. సామాజిక విలువలు, నిబంధనలను ఉల్లంఘించినందుకే సదరు గాయనిని విచారించి శిక్ష విధించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.

 మానవ హక్కుల లాయర్ల వాదన 

 ఇరాన్ ప్రభుత్వ చట్టపరమైన వాదనలను మానవ హక్కుల న్యాయవాదులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇ ఇరాన్ క్రిమినల్ చట్టాల ప్రకారం మహిళలు పాటలు పాడటం లేదా సంగీతాన్ని సృష్టించడం ఎక్కడా నేరంగా పేర్కొన లేదని  అంటున్నారు. కేవలం హిజాబ్ లేదనే కారణంతో ఒక కళాత్మక ప్రదర్శనను  అశ్లీల కంటెంట్ అని ముద్ర వేయడం చట్టబద్ధం కాదన్నారు. అన్నింటికీ మించి, అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనల ప్రకారం కొరడా దెబ్బలు  కొట్టడం అనేది ఒక అనాగరిక చర్య అని, అది పక్కాగా  హింస  కిందకే వస్తుందని వాదిస్తున్నారు.

 అంతర్జాతీయంగా తీవ్ర నిరసనలు  

పరాస్తూ అహ్మదీకి శిక్ష పడటంపై అంతర్జాతీయ సమాజంలో ముఖ్యంగా ఇరాన్ దేశస్థులైన ప్రవాస కళాకారులు, హక్కుల నేతల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.  ఈ తీర్పు ఇరాన్ పాలకుల క్రూరత్వానికి అద్దం పడుతోందని ్ంటున్నారు.  ప్రముఖ ఇరాన్-బ్రిటిష్ నటి నజానిన్ బోనియాడి, హక్కుల కార్యకర్త మసిహ్ అలినెజాద్ సైతం ఇరాన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మహిళల స్వరాలను, వారి కనీస హక్కులను అణచివేసే ఇరాన్ ప్రభుత్వం ఒక  లింగ వివక్షతతో కూడిన నిరంకుశత్వం ను నడుపుతోందని వారు విమర్శించారు.  ఇరాన్ అధికారిక జుడీషియల్ మీడియా ఇప్పటివరకు ఈ తీర్పు ప్రతిని బహిరంగంగా ప్రకటించలేదు. అయితే, అక్కడి స్థానిక లాయర్లు ఈ కోర్టు పత్రాలను నేరుగా పరిశీలించి నిజమేనని ధృవీకరించారు.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Embed widget