IranTo Close Hormuz Strait: హర్మూజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ నిర్ణయం, పలు దేశాలకు తప్పని చమురు షాక్!
Iran Israel Conflict | ప్రపంచ దేశాలకు ముడి చమురు అధికంగా రవాణా అయ్యే హర్మూజ్ జలసంధి మూసివేయాలని ఇరాన్ పార్లమెంట్ నిర్ణయం తీసుకుందని రిపోర్టులు వైరల్ అవుతున్నాయి.

టెహ్రాన్: ఇరాన్ పలు దేశాలకు షాకిస్తూ హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేతకు నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ తో ఉద్రిక్తతల సమయంలో అనవసరంగా అమెరికా జోక్యం చేసుకుంది. ఇరాన్ లోని మూడు అణుస్తావరాలపై అమెరికా బీ2 స్పిరిట్ బాంబులతో దాడులు చేసింది. దాంతో ప్రపంచ మార్కెట్ కు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసందని మూసివేతకు ఇరాన్ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. ఇరాన్ పార్లమెంటు జల సంధి మూసివేతకు ఆమోదం తెలిపినట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఇజ్రాయెల్ తో తమ ఉద్రిక్తతల సమయంలో అమెరికా జోక్యం చేసుకోవడంతో, ఇతర దేశాల మద్దతు కూడగట్టేందుకు ఇరాన్ పార్లమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఈ నిర్ణయాన్ని ఎప్పుడు అమలు చేస్తుందా అని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అన్నంత పని చేసిన ఇరాన్!
ఈ జలమార్గంలో షిప్పింగ్ లేన్లు చాలా ఇరుకైనవి. ప్రతి దిశలో కేవలం 3 కి.మీ వెడల్పు మాత్రమే ఉంటాయి. అందువల్ల హర్మూజ్ జలసంధిపై తరచుగా మూసివేస్తామనే ప్రకటనలు వస్తుంటాయి. ఇరాన్, అరేబియా సముద్రంలో ముసాండం ద్వీపకల్పం మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జల సంధి హర్మూజ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అవసరమయ్యే ముడి చమురులో 20 శాతం రవాణా అవుతుంది. ఈ జలసంది ద్వారా పలు దేశాలకు 2 కోట్ల బ్యారెళ్ల చమురు సరఫరా అవుతుంది.
ముడి చమురుకు జీవనాడి హర్మూజ్ జలసంధి
ఖతార్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, యుఎఇ, కువైట్ నుండి వచ్చే చమురు ఎగుమతుల్లో ఎక్కువ భాగం ఈ ఇరుకైన జలమార్గం ద్వారానే రవాణా అవుతుంది. గతంలో పశ్చిమ దేశాలు ప్రధానంగా అమెరికా, యూరప్ - పర్షియన్ గల్ఫ్ ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇరాన్ పార్లమెంట్ తాజా నిర్ణయంతో చైనా, భారత్ లాంటి ఆసియా దేశాలు ఈ మూసివేత కారణంగా ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి.
భారతదేశానికి హర్మూజ్ జలసంధి చాలా ముఖ్యమైనది. మన దేశం దిగుమతి చేసుకుంటున్న మొత్తం దిగుమతి 5.5 మిలియన్ బ్యారెళ్లలో రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు హర్మూజ్ జలసంధి ఇరుకైన జలమార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఇదే సమయంలో భారత్ ప్రత్యామ్మాయ మార్గాలపై ఫోకస్ చేయనుందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. రష్యా చమురు సూయజ్ కాలువ, కేప్ ఆఫ్ గుడ్ హోప్ లేదా పసిఫిక్ మహాసముద్రం ద్వారా ప్రవహించే హార్ముజ్ జలసంధి ద్వారా వేరు చేయబడి ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన సరఫరా మార్గం మూసివేయడంతో చమురు ధరలపై ప్రభావాన్ని చూపుతాయి. తాజా పరిణామాలు గమనిస్తే చమురు ధరలు బ్యారెల్‌కు $80కి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ముడిచమురు కోసం విదేశాలపై ఆధారపడ్డ భారత్
భారత్ 90 శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచ దేశాలకు ఈ జలసంధి ద్వారా 20 శాతం ముడి చమురు సరఫరా కాగా, భారత్ దిగుమతి చేసుకునే వాటాలో నలభై శాతం ఈ మార్గం ద్వారానే వస్తుంది. ప్రపంచ మార్కెట్ లో ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది. భారత్ లో సోమవారం నుంచే ఇంధన ధరలు పెరిగినా ఆశ్చర్యం అక్కర్లేదు.






















