By: ABP Desam | Updated at : 28 Oct 2021 08:31 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
పిల్లలకు పేర్లు పెట్టడం అంటే ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మరీ రొటీన్‌గా కాకుండా, పాతగా లేకుండా, లేటెస్ట్‌గా, సింపుల్‌గా ఉండేలా పిల్లలకు పేర్లు పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు. అందుకోసం ఎంతో శ్రమ పడుతుంటారు. మన దగ్గర అయితే, జన్మ నక్షత్రాలు, రాశులు వంటి ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. కొంత మంది పురాణాలు సైతం వెతికి అందులోని శక్తిమంతమైన పేర్లను ఇప్పటి కాలానికి తగ్గట్లుగా మార్చి పెట్టుకుంటుంటారు. కానీ, తాజాగా ఓ వ్యక్తి తన కొడుక్కి పెట్టుకున్న పేరు మాత్రం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఇండోనేసియాకు చెందిన ఓ వ్యక్తి తన కొడుకుకు వింత రీతిలో పేరు పెట్టాడు. ఇంగ్లీషు లెటర్స్ పట్ల తనకున్న అభిమానం ఏంటో దీనిద్వారా చాటుకున్నాడు. ఏకంగా ఇంగ్లీష్ అక్షరాల్లో ఉండే ఉన్న తొలి 11 అక్షరాలను వరుసగా పేర్చేసి పేరు పెట్టేశాడు. వినేందుకు ఆశ్చర్యంగా ఉంది కదా.. కానీ, ఇది నిజం. స్థానిక వార్తా పత్రికలు వెల్లడించిన వివరాల మేరకు.. ఆ బాలుడి పేరు ‘ABCDEF GHIJK Zuzu’. ఈ పేరు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే, 12 ఏళ్ల క్రితమే ఈ పేరు పెట్టగా.. తాజాగా వెలుగులోకి రావడం విశేషం.
Also Read: Pig like calf: పంది రూపంలో పుట్టిన రెండు తలల దూడ
బయటికి ఎలా తెలిసిందంటే..
దక్షిణ సుమత్రా ప్రావిన్స్‌లోని మౌరా ఎనిమ్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఇటీవల ప్రభుత్వ ఉన్నతాధికారులు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. అక్కడ చదువుతున్న 12 ఏళ్ల బాలుడి పేరు చూసి వైద్యశాఖ అధికారులు కంగుతిన్నారు. జూనియర్ హైస్కూల్ గ్రేడ్‌గా పిలిచే ఓ పాఠశాలలో చదువుతున్న ఆ బాలుడి వ్యాక్సినేషన్ స్లిప్, స్కూలు ఐడీ కార్డుపై అదే పేరు ఉండటంతో అదే అతడి అసలు పేరు అని షాక్ అయ్యారు.
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
తనకి పజిల్స్ అంటే ఎంతో ఇష్టమని.. తనకు కొడుకు పుడితే ఇలాంటి పేరు పెట్టాలని ఆరేళ్ల ముందే నిర్ణయించుకున్నట్లుగా బాలుడి తండ్రి జుల్ఫామీ అధికారులతో చెప్పారు. అయితే, తన కొడుకును Adef అని తాము ముద్దుగా పిలుచుకుంటామని చెప్పారు. తనకు రచయిత అవ్వాలని ఆశ ఉండేదని, అందుకే ఈ వినూత్న ఆలోచన వచ్చిందని చెప్పాడు. ఇప్పటికీ తనకు రాయడమంటే ఎంతో ఇష్టమని జుల్ఫామీ తెలిపారు.
పెద్ద కుమారుడి తర్వాత పుట్టిన మరో ఇద్దరు పిల్లలకు కూడా ఇలా వినూత్న రీతిలోనే పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కానీ, ఫ్యామిలీ అందుకు ఒప్పుకోకపోవడంతో సాధారణ పేర్లు పెట్టినట్లు వివరించారు. ఒకవేళ వారు ఒప్పుకొని ఉంటే.. NOPQ RSTUV అని ఒకరికి, XYZ అని ఇంకొకరికి పెట్టాలని భావించానని చెప్పాడు.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
JK Rowling Death Threat: డోంట్ వర్రీ నెక్స్ట్ టార్గెట్ నువ్వే, హ్యారీపాటర్ రైటర్‌కి బెదిరింపులు
Revenge Lover : ప్రియుడు మోసగాడని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చిన లవర్ - తర్వాతే అసలు ట్విస్టులు
Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ
Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్ ఎందుకు వివాదాస్పదమైంది?
Salman Rushdie: వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ, ఓ కన్ను కోల్పోక తప్పదేమో - న్యూయార్క్ టైమ్స్ కథనం
Gorantla Madhav: ఒరిజినల్ వీడియో నాదగ్గరే ఉంది! టీడీపీకి ఆ దమ్ముందా? వాళ్ల మార్ఫింగ్ వీడియోలిస్తా? - గోరంట్ల
Revanth Reddy : మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరిండు - రేవంత్ రెడ్డి
Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్
Pawan Kalyan Yatra : అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ టూర్