By: ABP Desam | Updated at : 16 Mar 2022 04:31 PM (IST)
Edited By: Murali Krishna
భారత్‌కు అమెరికా వార్నింగ్
భారత్‌ను అమెరికా పరోక్షంగా హెచ్చరించింది. భారత్‌కు రష్యా ఇచ్చిన ఆయిర్ ఆఫర్‌పై అమెరికా ఘాటు వ్యాఖ్యలు చేసింది. డిస్కౌంట్ ధరకు చమురు ఇస్తామని రష్యా ఇచ్చిన ఆఫర్‌ను భారత్ స్వీకరిస్తే ఉక్రెయిన్‌పై దండయాత్రకు మద్దతిచ్చినట్లవుతుందని అమెరికా అభిప్రాయపడింది. ఇది చరిత్రలో భారత్‌కు అపఖ్యాతి తెస్తుందని హెచ్చరించింది.
రష్యా ఆఫర్
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తోన్న కారణంగా అమెరికా, నాటో దేశాలు ఆ దేశ చమురుపై పూర్తిస్థాయి నిషేధం విధించాయి. దీంతో రష్యా చమురును కొనుగోలు చేసేవారి సంఖ్య పడిపోయింది. దీంతో రష్యా భారత్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతి తక్కువ ధరకే భారత్‌కు క్రూడాయిల్ విక్రయిస్తామని చెప్పింది.
ఎందుకంటే
తమ దేశం నుంచి ఎవరూ చమురు కొనుగోలు చేయకపోవడం వల్ల రష్యా వద్ద చమురు నిల్వలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రష్యా అమెరికాకు ప్రతి రోజు 7 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసేది. అంతేగాకుండా ప్రపంచ చమురు అవసరాల్లో 12 శాతం.. సహజ వాయువులో 16 శాతం అవసరాలను రష్యా తీరుస్తుంది. ఇప్పుడీ చమురును కొనేవారు లేకపోవడంతో ఆ చమురును భారత్‌కు అతి తక్కువ ధరకే విక్రయిస్తామంటూ రష్యా చమురు కంపెనీలు ఇప్పటికే భారత్‌కు ఆఫర్ చేశాయి.
అయితే రష్యా ఇచ్చిన ఆఫర్‌పై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రష్యా ఓపెన్ ఆఫర్ ఇచ్చిన విషయం వాస్తవమేనని.. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది.
Also Read: Bhagwant Mann Swearing-In: పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం- ఈ రికార్డ్ గమనించారా?
Also Read: Navjot Singh Sidhu Resignation: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా- ఇదేంటి అంత చిన్న రిజైన్ లెటర్!
Umbrella Costs 1 Lakh : ఆ గొడుగు ధర అక్షరాలా లక్ష - వర్షంలో బయటకు తీసుకెళ్లారో తడిచిపోతారంతే !
Elon Musk Political Views: ట్రంప్ అంటే మస్క్ మామకి ఎందుకింత లవ్?
Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!
Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ
China Plane Crash: ఎంత పనిచేశారు పైలట్లు! 132 మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు!
Elon Musk: ఎలన్ మస్క్ ఆ యువతిని లైంగికంగా వేధించారా? 2.5 లక్షల డాలర్లు చెల్లించారా?
TTD Darshan Tickets For July, August : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం
Breaking News Live Updates : దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు హైకోర్టుకు బదిలీ, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
NTR31: ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్