News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Navjot Singh Sidhu Resignation: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా- ఇదేంటి అంత చిన్న రిజైన్ లెటర్!

సోనియా ఆదేశాల మేరకు పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు.

FOLLOW US: 
Share:

పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ 5 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు సిద్ధూ రాజీనామా చేసి ఆ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

"కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోరినట్లుగా నా రాజీనామా లేఖను పంపాను" అని సిద్ధూ తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పంజాబ్‌కు సిద్ధూ, ఉత్తరాఖండ్‌కు గణేశ్ గొదియాల్, మణిపుర్‌కు ఎన్ లోకేన్ సింగ్‌లను పీసీసీ చీఫ్‌లుగా ఒకేసారి కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది.

సోనియా ఆదేశాలు

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన ప్రారంభించింది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ పీసీసీ చీఫ్‌లు తక్షణమే వారి పదవులకు రాజీనామా చేయాలని సోనియా గాంధీ ఆదేశించారు.

ఈ మేరకు కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. పార్టీని మళ్లీ పునర్నిర్మించడమే లక్ష్యంగా పార్టీ ఈ ప్రక్షాళన మొదలు పెట్టినట్లు సుర్జేవాలా పేర్కొన్నారు. ఈ ప్రకటన వచ్చిన కాసేపటికే ఉత్తరాఖండ్ పీసీసీ చీఫ్ గణేశ్ గొదియాల్, ఉత్తర్‌ప్రదేశ్‌ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లు తమ పదవులకు రాజీనామా చేశారు.

ఘోర ఓటమి

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అన్నీ తానై స్వయంగా ప్రియాంక గాంధీ పార్టీని నడిపించినా ఫలితాలు ఘోరంగా వచ్చాయి. యూపీ చరిత్రలో ఎన్నడూలేనంత తక్కువ సీట్లు సాధించింది. కాంగ్రెస్ రెండంటే రెండు సీట్లలో గెలుపొందింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 7 సీట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో సీట్లు పెరగకపోగా దారుణంగా తగ్గడం ఆ పార్టీ శ్రేణులను నిరాశ పరిచింది.

కనీసం గోవా అయినా తమకు దక్కుతుందని గంపెడాశ పెట్టుకున్న పార్టీకి నిరాశే ఎదురైంది. పంజాబ్లో పార్టీ అంతర్గత కుమ్ములాటల వల్ల అధికారం కోల్పోవడంతో పాటు సీనియర్ నేతలంతా ఇంటి బాట పట్టారు. దీంతో పార్టీ అసమ్మతి నేతలు (జీ 23 నేతలు) ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటమికి బాధ్యులెవరో తక్షణమే తేల్చాలని డిమాండ్ చేశారు. 

దీంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను రాజీనామా చేయాలని ఆదేశించారు. మరి ఈ రాజీనామాల పర్వం ఇక్కడితో ఆగుతుందో లేదో చూడాలి.

Published at : 16 Mar 2022 12:46 PM (IST) Tags: navjot singh sidhu punjab congress chief sonia gandhi punjab congress Punjab Assembly Election 2022 navjot singh sidhu resignation

ఇవి కూడా చూడండి

Hyderabad News: ఫిలింనగర్ లో దారుణం - అప్పు తీర్చలేదని దంపతులను చంపేశారు, ముగ్గురు నిందితుల అరెస్ట్

Hyderabad News: ఫిలింనగర్ లో దారుణం - అప్పు తీర్చలేదని దంపతులను చంపేశారు, ముగ్గురు నిందితుల అరెస్ట్

హైవేపై ఘోర ప్రమాదం, ట్రక్‌ని ఢీకొట్టిన కార్‌లో మంటలు - ఓ చిన్నారి సహా 8 మంది ఆహుతి

హైవేపై ఘోర ప్రమాదం, ట్రక్‌ని ఢీకొట్టిన కార్‌లో మంటలు - ఓ చిన్నారి సహా 8 మంది ఆహుతి

Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి

Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి

Petrol - Diesel Rates Today: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol - Diesel Rates Today: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Revanth Reddy Canvoy: ట్రాఫిక్‌లో ఇరుక్కున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కొత్త కాన్వాయ్ నంబర్ ఇదే

Revanth Reddy Canvoy: ట్రాఫిక్‌లో ఇరుక్కున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కొత్త కాన్వాయ్ నంబర్ ఇదే

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Weather Latest Update: నేడు తెలంగాణలో పొడి వాతావరణమే, ఏపీకి స్వల్ప వర్ష సూచన: ఐఎండీ

Weather Latest Update: నేడు తెలంగాణలో పొడి వాతావరణమే, ఏపీకి స్వల్ప వర్ష సూచన: ఐఎండీ

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?