Viral News: లాస్ఎంజెల్స్ వైల్డ్ ఫైర్‌లో అన్నీ తగలబడిపోయాయి.. ఈ ఒక్క బిల్డింగ్ తప్ప -ఎలా తట్టుకుందబ్బా ?
California brutal wildfires: కార్చిచ్చు దెబ్బకు లాస్ ఎంజెన్స్ కాలిపోయింది. బుగ్గిగా మారింది. కానీ చుట్టుపక్కల అన్నీ తగలబడిపోయినా ఒక్క బిల్డింగ్ మాత్రం చెక్కు చెదరలేదు. ఎందుకో తెలుసా ?
9 million mansion survived California brutal wildfires: అమెరికాలోని సంపన్నుల నగరం లాస్ ఎంజెల్స్ తగలబడిపోయింది. కాలనీలకు కాలనీలు బుగ్గిగా మారిపోయాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే మంటలు చుట్టుముట్టినా .. చుట్టుపక్కల అంతా బుగ్గిగా మారినా ఒక్క బిల్డింగ్ మాత్రం చెక్కు చెదరలేదు.లాస్ ఎంజెల్స్ వైల్డ్ ఫైర్ ఆ భవనాన్ని ఏమీ చేయలేకపోయింది.
రిటైర్డ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ స్టైనర్ ఓ మంచి ఇంటిని కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. వైల్డ్ ఫైర్ చుట్టుముట్టడంతో ఆ ఇంట్లో నుంచి అతన్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ కుటుంబం అంతా వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. మిగతా ఇళ్లలాగా తన ఇళ్లు కూడా కాలిపోయిందని ఆయన అనుకున్నారు. కానీ.. మంటలు ఆరిపోయిన తర్వాత అక్కడికి వెళ్లి చూస్తే ఆ ఇల్లు చెక్కు చెదరలేదు.దాంతో డేవిడ్ స్టైనర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాను ఇంటిని కోల్పోయానని అనుకున్నానని.. కానీ మిగిలి ఉండటం చూసి ఉబ్బితబ్బిబ్బు అవుతున్నానని ఆయన అంటున్నారు.
Also Read: కొత్త బంగారు గని పాక్ కష్టాలను గట్టెక్కిస్తుందా? - లేక ఆఫ్రికా పరిస్థితే దీనికి కూడా వస్తుందా!
అసలు అన్ని తగలబడిపోయినా ఇది ఒక్కటే ఎలా బయటపడిందన్నదానిపై పలువురు ఆరా తీయడం ప్రారంభించారు. ఈ భవనం మనుగడకు దాని దృఢమైన నిర్మాణం కారణం కావొచ్చని స్టైనర్ చెబుతున్నారు. ఈ భవనాన్ని నిర్మించాడనికి రాళ్లను ఉపయోగించారు. అలాగే ప్రత్యేకంగా రూపొందించిన అగ్ని నిరోధక పైకప్పుతో సహా అగ్ని నిరోధక పదార్థాలతో నిర్మించారు. అయితే చిన్న చిన్న అగ్నిప్రమాదాలన తట్టుకుంటుదంని అనుకున్నాను కానీ ఇలా వైల్డ్ ఫైర్ వచ్చినా చెక్కు చెదరకుండా ఉంటుందని ఊహించలేకపోయానని అంటున్నారు ఈ ఇల్లు 4,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. నాలుగు బెడ్‌రూమ్‌ల ఇంటిని ఒక బిల్డర్ నుండి కొనుగోలు చేశాడు. తన ఇల్లు మిగిలిన సంతోషం ఉన్నా..మిగిలిన వాళ్లు ఇళ్లు కోల్పోవడంపై డేవిడ్ బాధపడుతున్నారు.
లాస్‌ఎంజిల్స్‌లోని ది పాలిసాడ్స్ ప్రాంతంలో వేలాదిఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. 3000 ఎకరాలలో సంపన్న వర్గాలు నివసించే విలాసవంతమైన భవనాలు భూడిదలా మారాయి. చాలా మంది తన సామాగ్రి, వాహనాలకు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కొన్ని వేల ఇళ్ళు, భవనాలను కార్చిచ్చు శిథిలంగా మార్చింది. మంటలను ఆర్పేందుకు విమానాలు, హెలికాప్టర్లు, బుల్డోజర్లను అధికారులు రప్పించారు. అధ్యక్షుడు బైడెన్ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇతర దేశాలు కూడా మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.