అన్వేషించండి

ఇజ్రాయెల్ పై దాడి - యూకేలో హమాస్‌ మద్దతుదారుల సంబరాలు

యుకేలో హమాస్‌ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడికి మద్దతుగా కొందరు లండన్‌లో సంబరాలు చేసుకున్నారు.

యూకేలో హమాస్‌ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడికి మద్దతుగా కొందరు లండన్‌లో సంబరాలు చేసుకున్నారు. హమాస్‌ మద్దతుదారులు కొందరు పాలస్తీనా జెండాలతో లండన్‌ వీధుల్లో సంబరాలు చేసుకుంటూ నినాదాలు చేశారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడికి మద్దతుగా కొందరు సంబరాలు చేసుకోవడంపై యూకే పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నిరసనలకు దారి తీయవచ్చని, లండన్‌ పౌరులకు ఆటంకం కలిగించే విధంగా చేపట్టే కార్యక్రమాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 

నెటిజన్ల మండిపాటు

హమాస్‌ మద్దతుదారుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇజ్రాయెల్‌లో ఎంతోమంది మహిళలు, పిల్లలను దారుణంగా హత్య చేశారని, అమాయకులైన పౌరులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దాడి చేసిన వారికి మద్దతుగా లండన్‌లో సంబరాలు చేసుకోవడం దుర్మార్గమని, హమాస్‌ వంటి ఉగ్రవాదులు తమదాకా రారని భావించడం మూర్ఖత్వమ అని ట్వీట్లు చేస్తున్నారు. 

హమాస్‌కు మద్దతుగా యుద్దంలోకి హెజ్బొల్లా

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. హమాస్‌కు మద్దతుగా తాజాగా లెబనాన్‌లోని మిలిటెంట్‌ సంస్థ హెజ్బొల్లా కూడా యుద్ధంలోకి దిగింది. ఆదివారం హెజ్బొల్లా గ్రూప్‌ డజన్ల కొద్దీ రాకెట్లు, మోర్టార్‌ షెల్స్‌ను ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలపై ప్రయోగించింది. ఈ స్థావరాలు ఇజ్రాయెల్‌ ఆధీనంలోని గోలన్‌హైట్స్‌ వద్ద పడ్డాయి. ఈ దాడులపై హెజ్బొల్లా అధికారికంగా స్పందించింది. భారీ సంఖ్యలో రాకెట్లు, షెల్స్‌ను ప్రయోగించినట్లు వెల్లడించింది. పాలస్తీనా పోరాటానికి సంఘీభావంగా ఇజ్రాయెల్‌పై దాడి చేసినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపుదాడికి ఇరాన్‌ నుంచి మద్దతు లభించిందని హమాస్‌ ప్రకటించింది. తాజాగా లెబనాన్‌లోని హెజ్బొల్లా కూడా ఈ యుద్ధంలోకి రావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదముంది. మరోవైపు హెజ్బొల్లా దాడులను ఇజ్రాయెల్‌ దళాలు తిప్పికొడుతున్నాయి

ఇజ్రాయెల్‌లో మృతుల సంఖ్య 500

ఇజ్రాయెల్‌లో మృతుల సంఖ్య 500 దాటగా.. 1500 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు హమాస్‌ దాడులపై ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్‌ వైమానిక దళం పాలస్తీనాలోని గాజాపై విరుచుకుపడింది. దీంతో అక్కడ 300 మందికిపైగా ఈ దాడుల్లో మరణించినట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Indian woman shoplifting in Japan: జపాన్‌లో చేసింది దొంగపని - పైగా పోలీసులకు లంచం ఆఫర్ - భారతీయ పర్యాటకురాలికి ఏ శిక్ష పడిందంటే?
జపాన్‌లో చేసింది దొంగపని - పైగా పోలీసులకు లంచం ఆఫర్ - భారతీయ పర్యాటకురాలికి ఏ శిక్ష పడిందంటే?
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
Illegal Bangladeshi immigrants in West Bengal 2026: బెంగాల్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లిపోతున్న లక్షల మంది చొరబాటుదారులు - వారిపై సానుభూతి చూపించాలా? దేశంలోనే ఉండనివ్వాలా?
బెంగాల్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లిపోతున్న లక్షల మంది చొరబాటుదారులు - వారిపై సానుభూతి చూపించాలా? దేశంలోనే ఉండనివ్వాలా?
US Iran War: అమెరికా, ఇరాన్ మధ్య మహా ఒప్పందం ఖరారు! డొనాల్డ్ ట్రంప్ సంతకంపై ఉత్కంఠ
అమెరికా, ఇరాన్ మధ్య మహా ఒప్పందం ఖరారు! డొనాల్డ్ ట్రంప్ సంతకంపై ఉత్కంఠ

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Dry ginger vs Fresh ginger: అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
Embed widget