By: ABP Desam | Updated at : 17 Sep 2023 02:04 PM (IST)
Edited By: jyothi
12 రోజుల్లో 10 దేశాల్లో భారీ వరదలు, వాతావరణ మార్పులే కారణమా? ( Image Source : ABP English )
Floods: ప్రపంచ దేశాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఎన్నడూ చూడని రీతిలో లిప్తకాలంలో సంభవిస్తున్న వరదలతో వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను వరదలు ముంచెత్తాయి. కేవలం 12 రోజుల్లోనే 10 దేశాలు, భూభాగాలు వరదల బారిన పడ్డాయి. ఈ ప్రకృతి విపత్తులో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలిచివేసే అంశం. ఒక్క లిబియాలోనే వరదల కారణంగా 11 వేల మందికి పైగా మరణించారు. వేలాది మంది గల్లంతయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా దేశాలను ప్రభావితం చేస్తున్న ఈ రకమైన ప్రకృతి విపత్తులు వాతావరణ సంక్షోభం కిందే లెక్కకట్టాలి నిపుణులు అంటున్నారు. ఈ రకమైన వరదలు ప్రస్తుతం 10 దేశాలను కబళించగా.. రానున్న రోజుల్లో మరిన్ని దేశాల్లోనూ ప్రకృతి విపత్తులు చూసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఇదంతా వాతావరణ మార్పుల వల్లే జరుగుతున్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇలాంటి విపరీతమైన విపత్తుల పట్ల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని హాంకాంగ్ సిటీ విశ్వవిద్యాలయ వాతావరణ శాస్త్రవేత్త జంగ్- యున్ చు నొక్కి చెప్పారు. ప్రకృతి విపత్తుల గురించి ఆలోచించడం ప్రారంభించాలని సూచించారు. ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో తీవ్రమైన సంఘటనలు చూసే పరిస్థితి రావొచ్చని హెచ్చరించారు.
ఐరోపాలో అత్యంత భయంకరమైన తుపాను
మధ్యధరా సముద్రంలో సంభవించిన డేనియల్ తుపాను.. లిబియాను అతలాకుతలం చేస్తోంది. వరద బీభత్సంతో 2వేల మందికి ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గల్లంతైనట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. డేనియల్ తుపాను మధ్యధరా సముద్ర ప్రాంతంలో తీవ్ర ప్రభావం చూపింది. టర్కీ, బల్గేరియా, గ్రీస్‌లు కుండపోత వర్షాలతో అతలాకుతలమయ్యాయి. తాజాగా లిబియాలో భారీ వరదలు సంభవించాయ్. దీంతో ఎత్తయిన భవనాలు నేలమట్టమయ్యాయి. వీధుల్లో వరదనీరు అడుగుల మేర నిలిచిపోయింది. డేనియల్ తుపాను ప్రభావంతో డెర్నా, జబల్ అల్ అఖ్దర్, అల్-మార్జ్ శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
లిబియాలో వరదలకు వేలాది మంది మృత్యువాత
దెర్నా నగరంలో సంభవించిన వరదల ధాటికి 2వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ ప్రధానమంత్రి ఒసామా హమద్ తెలిపారు. దెర్నాలోని అనేక ప్రాంతాలు వరదలో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. డేనియల్ తుపాను ధాటికి ఇప్పటికే తూర్పు లిబియాలోని అనేక ప్రాంతాల్లో కల్లోలిత పరిస్థితులు నెలకొన్నాయి. దెర్నా నగరంలో పరిస్థితి భయానకంగా మారింది. విద్యుత్ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. చుట్టూ వరద నీరు చేరడం వల్ల ఇళ్లల్లో ఉన్న ప్రజలు.. సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కొందరికి ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు. దేశంలో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు అక్కడి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వరదల కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. వందలాది మంది లోతట్టు ప్రాంతాల్లో చిక్కకుపోయారు. సైన్యం, సహాయక బృందాలు వారిని రక్షించడానికి తీవ్రంగా యత్నిస్తున్నాయి.
హాంకాంగ్, తైవాన్ ను ముంచెత్తిన వర్షాలు
హాంకాంగ్ లో ఎన్నడూ చూడనంత రీతిలో వర్షాలు పడ్డాయి. 140 ఏళ్లలో ఇలాంటి భారీ వర్షాలు చూడటం ఇదే తొలిసారి. హాంకాంగ్, తైవాన్ లో కురిసిన అతి భారీ వర్షాలకు వీధులు, సబ్ వేలు మొత్తం నీట మునిగి నదులను తలపించాయి. గంట వ్యవధిలో 158.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. క్వోలూన్, నగర ఉత్తర ప్రాంతంలో గంట వ్యవధిలో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షాపాతం నమోదైంది. కొన్ని చోట్ల 24 గంటల్లో 19.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
అమెరికాలోనూ భారీ వర్షాలు
అమెరికాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రియో గ్రాండే దో సుల్ రాష్ట్రాన్ని భారీ వానలు ముంచెత్తాయి. 40 ఏళ్లలో ఎన్నడూ చూడని రీతిలో అతి భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని నీట ముంచింది.
Iraq: ఇరాక్‌లో ఓ పెళ్లి వేడుకలో ఘోర అగ్ని ప్రమాదం, 100 మంది సజీవదహనం
నిజ్జర్ హత్యలో విదేశీ హస్తం ఉంది, భారత్‌పై విషం కక్కిన కెనడా సిక్కు ఎంపీ
టిబెట్ విషయంలో దలైలామా వెనక్కి తగ్గారా? స్వాతంత్య్రం వద్దనడం వెనక ఉద్దేశమేంటి?
Jaishankar In UNGA: ‘భారత్ నుంచి నమస్తే’ - ఐరాసలో మంత్రి జైశంకర్
ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌తో భారత్‌కి సంబంధం లేదు, నిజ్జర్ హత్యపై జైశంకర్ క్లారిటీ
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో
Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు
Tiger 3 Teaser : 'టైగర్ 3'లో సల్మాన్ ఖాన్ దేశభక్తుడా? దేశ ద్రోహిగా మారాడా?
/body>