(Source: ECI/ABP News/ABP Majha)
Imran Khan: ఏదీ నక్కిలీసు గొలుసు అంటూ ఇమ్రాన్‌ను నిలదీస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వం
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు బహుమతిగా లభించిన నెక్లెస్ అమ్మేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. తోషా-ఖానాకి పంపలేదని దర్యాప్తు ప్రారంభమైనట్టు మీడియా కథనాలు వస్తున్నాయి.
18కోట్ల విలువైన నెక్లెస్ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. అది ఎక్కడ ఉందంటూ దర్యాప్తు సంస్థలు ఖాన్ విచారించనున్నట్టు తెలుస్తోంది.
తన హయాంలో బహుమతిగా పొందిన ఖరీదైన నెక్లెస్‌ను రాష్ట్ర గిఫ్ట్ రిపోజిటరీలో డిపాజిట్ చేయకుండా రూ.18 కోట్లకు నగల వ్యాపారికి విక్రయించారనే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మెడకు చుట్టుకున్నాయి. పాకిస్తాన్ అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించినట్లు మీడియా చెబుతోంది.
ఖాన్ బహుమతిగా అందుకున్న నెక్లెస్ తోషా-ఖానా (స్టేట్ గిఫ్ట్ రిపోజిటరీ)కి పంపబడలేదని మాజీ స్పెషల్ అసిస్టెంట్ జుల్ఫికర్ బుఖారీకి ఇచ్చారని మీడియా వెల్లడించింది. దాన్ని లాహోర్‌లోని నగల వ్యాపారికి రూ. 18 కోట్లకు విక్రయించినట్టు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్త ప్రచురించింది.
ఖాన్ తన పదవీ కాలంలో బహుమతిగా పొందిన ఖరీదైన నెక్లెస్‌ను రాష్ట్ర గిఫ్ట్ రిపోజిటరీలో డిపాజిట్ చేయకుండా రూ. 18 కోట్లకు నగల వ్యాపారికి విక్రయించారనే ఆరోపణలపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) అతనిపై విచారణ ప్రారంభించిందని నివేదిక పేర్కొంది.
పబ్లిక్ ఇచ్చిన బహుమతులను సగం ధర చెల్లించి వ్యక్తిగతంగా ఉంచుకోవచ్చు. కానీ అయితే గత వారం పార్లమెంటులో అవిశ్వాస ఓటుతో ఓడిపోయిన ఖాన్ లక్షల రూపాయలను జాతీయ ఖజానాకు జమ చేశారు. ఇది చట్టవిరుద్ద చర్యగా పాకిస్థాన్ అధికారులు చెబుతున్నారు.
చట్టం ప్రకారం రాష్ట్ర అధికారులు, ప్రముఖుల స్వీకరించే బహుమతులను తోషా-ఖానాలో సమర్పించాలి. అలా చేయకపోవడం చట్ట విరుద్దమైన చర్యగా చెబుతోంది పాకిస్థాన్. బహుమతి విలువలో సగం మొత్తం చెల్లించడానికి కూడా చట్టం అంగీకరించదని పేర్కొంది.